నరుడు విజ్ఞానమును ఎన్నుకోవలయును

4 1.         కుమారులారా!

                              మీ తండ్రి ఉపదేశమును ఆలింపుడు.

                              సావధానముగా విని,

                              విజ్ఞానమును ఆర్జింపుడు.

2.           నేను మీకు సదుపదేశము చేయుదును

               కనుక నా బోధ పెడచెవిని పెట్టకుడు.

3.           నేనును ఒక తండ్రికి కుమారుడను.

               మాయమ్మకు ఒక్కడనైన ముద్దుబిడ్డడను.

4.           అప్పుడు మా తండ్రి నాకిట్లు బోధ చేసెడివాడు:

               ”నాయనా! నా పలుకులు శ్రద్ధగా వినుము.

               నా ఆజ్ఞలు పాింతువేని నీవు బ్రతికిపోయెదవు.

5.           విజ్ఞానవివేకములను ఆర్జింపుము.

               నా పలుకులు మరువకుము, ఆశ్రద్ధచేయకుము.

6.           నీవు విజ్ఞానమును విడనాడకుందువేని

               అది నిన్ను కాపాడును.

               విజ్ఞానమును ప్రేమింతువేని

               అది నిన్ను సంరక్షించును.

7.            విజ్ఞానమును ఆర్జించుట

               అన్నికంటే ముఖ్యమైనది.

               నీకు ఉన్నవన్నియు వెచ్చించియైన

               దానిని బడయుము.           

8.           వివేకమును ప్రేమింతువేని

               అది నిన్ను గొప్పవానిని చేయును.

               దానిని ఆప్యాయముగా చూచెదవేని

               అది నీకు కీర్తి గడించిపెట్టును.

9.           అది నీ తలకు పూలదండ చుట్టును,

               మేలిమి కిరీటము పెట్టును.”

10. కావున కుమారా!

               నా పలుకులు జాగ్రత్తగా వినుము.

               నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.

11.           నేను నీకు విజ్ఞానమును ఉపదేశింతును.

               సత్పథమును చూపెదను.

12.          నీవు విజ్ఞానమార్గమున నడతువేని

               నీకేదియు అడ్డురాదు.

               నీ పాదములు తొిల్లవు.

13.          నీవు నేర్చుకొనిన క్రమశిక్షణను విడనాడకుము.

               దానిని పాించినచో

               అది నీకు జీవము నొసగును.

14.          దుష్టుల మార్గమున

               ఏనాడును పయనింపకుము.        

               దుర్జనుల బాటలో సంచరింపకుము.

15.          దుష్టపథమును మానివేయుము.

               దానినుండి వైదొలగి ప్రక్కగా తొలిగిపొమ్ము.

16.          దుష్కార్యములు సల్పిననేగాని

               దుష్టులకు నిద్రపట్టదు.

               ఎవరికైన హాని చేసిననేగాని

               వారి కింకి కునుకురాదు.

17.          వారు దుష్టవర్తనమునే

               భోజనముగా స్వీకరింతురు

               దౌర్జన్యమునే పానీయముగా సేవింతురు.  

18.          సత్పురుషుల మార్గము వేకువ వెలుగువింది.

               దాని ప్రకాశము పట్టపగలగువరకును 

               క్రమముగా వృద్ధిచెందును. 

19.          దుర్మార్గుల మార్గము మాత్రము

               రాత్రివలె తమోమయముగా నుండును.

               ఏది తగిలిపడిపోవుదురో వారికే  తెలియదు.

20.  కుమారా! నా పలుకులు ఆలింపుము,

               నా మాటలు శ్రద్ధగా వినుము.

21. వానిని ఏనాడును మరువక 

               నీ ఎదలో పదిలపరచుకొనుము.

22.        నా పలుకులు గైకొనువారికి

               అవి జీవనదాయకములగును.

               సంపూర్ణ ఆరోగ్యమునొసగును.

23.        అన్నికంటె ముఖ్యముగా

               నీ హృదయమును పదిలము చేసికొనుము.

               నీ జీవనగతికి మూలాధారమదియే.

24. నీ నోితో అబద్ధములు  చెప్పకుము. 

               నీ పెదవులతో వంచన వాక్కులను పలుకకుము.

25.        ధైర్యముతో ముందునకు చూచి నడువుము.

               నీ దృష్టిని ఎప్పుడు ముందరికి ప్రసరింపనిమ్ము.

26.        నీవు చేయనున్న కార్యములకు

               జాగ్రత్తగా సిద్ధముకమ్ము.

               అప్పుడు నీ పనులన్నింట

               నీకు విజయము సిద్ధించును.

27.         చెడును విడనాడి ఋజుమార్గమున నడువుము. కుడిఎడమలకు బెత్తెడైనను జరుగకుము.