మరణము

3 1. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకి కలదు:

2.           పుట్టుటకొక సమయము,

               గిట్టుటకొక సమయము కలదు;

               నాటుటకొక సమయము,

               పెరికివేయుటకొక సమయము కలదు.

3.           చంపుటకొక సమయము,

               చికిత్స చేయుటకొక సమయము కలదు;

               పడగొట్టుటకొక సమయము,

               కట్టుటకొక సమయము కలదు.

4.           ఏడ్చుటకొక సమయము,

               నవ్వుటకొక సమయము కలదు;

               దుఃఖించుటకొక సమయము,

               నాట్యము చేయుటకొక సమయము కలదు.

5.           రాళ్ళను పారవేయుటకొక సమయము,

               రాళ్ళను కుప్ప వేయుటకొక సమయము కలదు;

               కౌగిలించుకొనుటకొక సమయము,

               కౌగిలిని మానివేయుటకొక సమయము కలదు.

6.           వెదకుటకొక సమయము,

               పొగొట్టుకొనుటకొక సమయము కలదు;

               పదిలపరుచుకొనుటకొక సమయము,

               పారవేయుటకొక సమయము కలదు.

7.            చింపుటకొక సమయము,

               కుట్టుటకొక సమయము కలదు;

               మౌనము వహించుటకొక సమయము,

               మ్లాడుటకొక సమయము కలదు.

8.           ప్రేమించుటకొక సమయము,

               ద్వేషించుటకొక సమయము కలదు;

               యుద్ధమునకొక సమయము,

               శాంతికొక సమయము కలదు.

9. నరులు పడిన శ్రమకు ఫలితమేమి?

10. నరుడు సాధనచేయ దేవుడు వానికి ప్టిెన శ్రమానుభవమును నేను గమనించితిని.

11. ఆయన ప్రతిపనికి దానికి తగిన సమయము నియమించెను. ఆయన నరునికి శాశ్వతత్త్వమును అర్థముచేసికొను శక్తినిచ్చెను. అయినను నరుడు దేవుని చర్యలను గ్రహింపజాల కున్నాడు.

12. కనుక ఆనందముగా బ్రతికి, ఈ జీవిత మును చక్కగా గడపుటకంటె మనము చేయదగిన దేమియులేదని నేను గ్రహించితిని.

13. నరుడు తిని, త్రాగి తాను సాధించిన వానిని అనుభవింపవలెను. ఇదియును దేవుడతనికి దయచేసిన వరమేనని గ్రహించితిని.

14. దేవుడు చేసిన కార్యము శాశ్వతముగా నుండిపోవును. మనము దానికి కొంత చేర్పనూలేము, దానినుండి కొంత తీసివేయనూలేము. ఆయన కార్య ములు చూచి మనము ఆయనపట్ల భయభక్తులు ప్రదర్శింపవలసినదే. 15. ఇప్పుడున్నదికాని, ఇక మీదట ఉండబోవునదికాని ఇంతకుముందు కూడ ఉన్నదియే. దేవుడు జరిగినదానినే మరల జరిగించును.

16. ఇంకనూ లోకమున న్యాయమును, ధర్మమును కన్పింపవలసిన తావులో అన్యాయము కన్పించు చున్నది.

17. దేవుడు న్యాయవంతులకును, అన్యాయ పరులకునుకూడ తీర్పు విధించుననియు, ప్రతికార్య మును అది జరుగవలసినపుడు జరుగుననియు నేను భావించితిని.

18. ఇంకను దేవుడు మనలను పరీక్షించు చున్నాడనియు, మనముగూడ జంతువులవలె జీవించు వారలమేనని ఆయన మనకు నేర్పుచున్నాడనియు నేను తలంచితిని.

19. నరులకు ప్టిన గతియే జంతువు లకును పట్టుచున్నదికదా? నరులవలె జంతు వులును చచ్చుచున్నవి. ఆ ఉభయప్రాణులు ఒకే కోవకు చెంది నవి. జంతువుకంటె నరుడేమి ఎక్కువ? అంతయును వ్యర్థమే.

20.        నరులు, జంతువులుకూడ

                              ఒకే గమ్యమును చేరుకొందురు.

                              అన్నియు మ్టినుండి ప్టుినవే,

                              చివరకు మ్టిలో కలిసిపోవునవే.

21. నరుని ఆత్మ పైని ఆకాశమునకును, జంతువు ఆత్మ క్రింది భూమిలోనికిని పోవునని ఎవడు రూఢిగా చెప్పగలడు?

22. కనుక నరుడిచట తాను సాధించిన కార్యములను అనుభవించుటయే ఉత్తమ మైనపద్ధతి. ఇదియే నరుని భాగధేయము. మనము గతించిన తరువాత ఏమి జరుగునో తెలిసికొను మార్గమేమియును లేదు.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము