ఉపోద్ఘాతము:

పేరు: సమూవేలు మొది, రెండవ గ్రంథములకు సమూవేలుప్రవక్త పేరును నిర్ధారించారు.  సమూవేలు అనగా ”దేవునిఅడిగి పొందినవాడు”.  గ్రంథ ఇతివృత్తాంతమునందు సమూవేలు పోషించిన పాత్రను ఆధారముగా గ్రంథమునకు ఈ పేరును పెట్టడము జరిగినది. హీబ్రూలేఖనముల ప్రకారము ఈ రెండు గ్రంథములను ఒకే గ్రంథముగా చూపించిరి.  గ్రీకుభాష అనువాదకులు దీనిని రెండుగా విభజించిరి.

కాలము: క్రీ.పూ.6వ శతాబ్దము మధ్యకాలములో వ్రాయబడినది. సమూవేలు ప్రవక్త కాలము క్రీ.పూ 1100 నుండి 1010న సౌలు మరణము వరకు ఈ గ్రంథ కాలవ్యవధి.

రచయిత: సమూవేలు  రెండు గ్రంథములు ద్వితీయోపదేశకారుని చారిత్రాత్మక గ్రంథములలోని భాగము.

చారిత్రక నేపథ్యము: సమూవేలు కాలమునాికి యిస్రాయేలీయులులో ”ఒకేప్రజ” అనే భావము సంపూర్ణముగా ఏర్పడలేదు. పండ్రెండు తెగలమధ్య సమైక్యత కొరవడినది. విభక్త తెగల సమాఖ్యగానున్న ఈ తెగలమధ్య ఐక్యత శత్రువులబారిన పడినప్పుడు మాత్రమే ఎక్కువగా కనపడేది.  నిబంధన మందసమునకు కూడ ఒక స్థిరత్వము లభించలేదు. ఇటువిం పరిస్థితుల్లో వారినందరిని ఏకము చేసి ఒకే గొడుగు క్రింద చేర్చడానికి రాజు / నాయకుడులాిం వ్యక్తి అవసరత ప్రస్పుటమైనది. ఈ చారిత్రకనేపథ్యమే సమూవేలు గ్రంథమునకు పునాది.

ముఖ్యాంశములు: ఈ కాలములో రాజు, రాజ్యము, రాజరికపు స్థాపనలు, వ్యవస్థీకరణ మార్పులు, (కుటుంబ పాలన నుండి రాజరికానికి మార్పు) రాజరికపు వ్యవస్థతో పాటు ‘ప్రవక్త’ వ్యవస్థలాింవి ఆవిర్భవించాయి. ఈ యుగము వ్యక్తులను కేంద్రంగా చేసుకొని కూడా రాణిస్తుంది. అి్ట వ్యక్తులలో సమూవేలు, సౌలు, దావీదు ప్రముఖులు. యాజకవ్యవస్థ ఛాయలు కూడ కనపడతాయి. ఈ గ్రంథములో మరొక ప్రధానాంశంము నిబంధనమందసము. మందసముపైని కరుణాపీఠము యావే దేవుని పాదపీఠముగా గుర్తింపు పొందినది. ఈ గ్రంథములోని ముఖ్య వేదాంత అంశములు: దేవుని ఆధిపత్యము, నాయకత్వము, దేవునియెడల విధేయత.

క్రీస్తుకు అన్వయము: ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతిగా వ్యవహరించిన సమూవేలు క్రీస్తుకు ముంగుర్తుగా నిలిచాడు.  సమూవేలు కాలములో నూతనయుగము ప్రారంభమైనది.  ఇది క్రీస్తుయుగానికి పునాదివేసింది. దావీదు కీర్తనలు క్రీస్తు మెస్సయకు సంకేతములుగా నిలిచాయి.

 

Previous                                                                                                                                                                                                   Next                                                                                       

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము