దావీదు చేజిక్కిన సౌలును చంపక వదలివేయుట
26 1. సీఫు నివాసులు గిబియాకు పయనమైవచ్చి సౌలును కలిసికొని, దావీదు యెషీమోను చెంతనున్న హకీలా కొండలలో దాగియున్నాడని తెలిపిరి.
2. సౌలు యిస్రాయేలీయులనుండి మూడు వేలమంది యోధులను ప్రోగుజేసికొని సీఫు ఎడారిలో తిరుగాడు చుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను.
3. అతడు యెషీమోను చేరువనున్న హకీలా కొండ చెంత త్రోవప్రక్కన గుడారములెత్తెను. అంతవరకు దావీదు ఎడారియందే సంచరించుచుండెను. అతడు సౌలు తనను పట్టుకొనవచ్చెనని వినెను.
4. గూఢచారు లను పంపి సౌలువచ్చెనని రూఢిగా తెలిసికొనెను.
5. దావీదు వెంటనే బయలుదేరి సౌలు దండుదిగిన తావుచేరుకొనెను. అచట సౌలును, అతని సేనాధిపతి యైన నేరు కుమారుడగు అబ్నేరును పరుండియుండిరి. దావీదు వారినిచూచెను. సౌలు సైన్యములమధ్య శిబిరాంతరమున ఉండెను.
6. అప్పుడు హిత్తీయుడైన అహీమెలెకును, సెరూయా పుత్రుడు యోవాబు సోదరుడునగు అబీషయి దావీదు వెంటనుండిరి. అతడు వారినిచూచి ”నేను సౌలు శిబిరమునకు పోయెదను. నా వెంట ఎవరు వత్తురు?” అని అడిగెను. వెంటనే అబీషయి ”నేను వత్తును” అనెను.
7. దావీదు, అబీషయి రేచీకిలో శిబిరమునొద్దకు వచ్చిరి. సౌలు పాళెమున పరుండి నిద్రించుచుండెను. అతని యీటె తలవైపున నేలలో దిగవేయబడియుండెను. అబ్నేరును, సైనికులును చుట్టు పరుండి నిదురించుచుండిరి.
8. అబీషయి దావీదుతో ”నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఇతనిని ఈ యీటెతో ఒకేఒక్క పోటున నేలకు గ్రుచ్చెదను. ఇక రెండవ పోటక్కరలేదు” అనెను.
9. కాని దావీదు అతనితో ”సౌలును చంప వలదు. ప్రభువు అభిషిక్తుని మీద చేయిచేసికొనినచో పాపము చుట్టుకొనదా?
10. యావే జీవము తోడు! పోగాలము దాపురించినపుడో, అపాయముననో, యుద్ధరంగముననో ప్రభువే ఇతనిని సంహరించును.
11. నా అంతట నేను ప్రభువు అభిషిక్తుని మీద చేయి చేసుకోరాదు. తలదాపుననున్న ఆ యీటెను, నీి కుండను గైకొనివెళ్ళుదము పద” అనెను.
12. అంతట దావీదు సౌలు తలదాపుననున్న ఈటెను, జలపాత్రను గైకొనగా ఇరువురు శిబిరమునుండి వెడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడును చూడ లేదు, ఎవడును గుర్తుపట్టలేదు, ఎవడును మేల్కొన లేదు. వారందరు మైమరచి నిద్రలోనుండిరి. యావే వారందరికి గాఢనిద్ర పట్టునట్లు చేసెను.
13. అంతట దావీదు గుడారమును దాి ఆవలి వైపు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండ పైకెక్కి నిలిచెను.
14. అచినుండి సౌలు సైన్యములను నేరు కుమారుడగు అబ్నేరును కేకలువేసి పిలిచెను. ”అబ్నేరూ! నీవు మ్లాడవా?” అని కేకవేయగా, అబ్నేరు మేల్కొని ”రాజునే నిద్రలేపు నీవెవడివి?” అని అడిగెను.
15. దావీదు అతనితో ”నీవు వీరుడవుగాదా ఏమి? యిస్రాయేలీయులలో నీపాి మొనగాడెవడును లేడుగదా? మరి నీ ప్రభువైన రాజును కాపాడక ప్రమత్తుడవైతివేమి? ఎవడో ప్రభువును సంహరించు టకు ఇప్పుడే శిబిరమున చొచ్చెనుగదా?
16. నీ చేయిదము ఏమియు బాగుగాలేదుసుమా! సజీవుడైన యావే తోడు! యావేచే అభిషిక్తుడైన ప్రభువును కాపాడ మీరందరు జాగరూకులుకారైరి. కనుక వెంటనే మీ తలలు తీయింపవలసినదే! అవునుగాని, రాజు తల దాపుననున్న ఈటె, నీికుండ ఏమైనవో చూడుము!” అనెను.
17. అప్పుడు సౌలు దావీదు స్వరమును గుర్తు ప్టి ”నాయనా! దావీదూ! ఇది నీ కంఠమేనా?” అని అడిగెను. దావీదు ”అవును, ఇది నా గొంతే” అని బదులుపలికి, 18. ”ప్రభూ! ఈ సేవకుని వెన్నాడనేల? నేను ఏ దుష్కార్యము చేసితిని?
19. ఏలినవారు సావధానముగా ఈ సేవకుని పలుకులు ఆలింతురుగాక! ప్రభువే నిన్ను నా మీదికి పురికొల్పె నేని, బలినర్పించి ఆయనను శాంతచిత్తుని చేయుదము. కాని నరులెవరునైనను నిన్ను నా మీదికి పురికొల్పిరేని, వారు యావే శాపమువలన మ్రగ్గిపోవుదురుగాక! ఆ నీచులు నన్ను యావే కాణాచిమీద నిలువనీయక ఈ అన్యభూములకు తరిమివేసిరి. నేను అన్యదేవతల కాళ్ళమీద పడునట్లు చేసిరి13.
20. ఇక యావే కింకి దూరముగా ఈ అన్యభూములపై నా మేనినెత్తురులు ఒలుకకుండునుగాక!14 యిస్రా యేలు ప్రభుడవైన నీవేమో వేటగాడు కొండలపై కౌజు వెంటపడినట్లు అనామకుడనైన నా వెంటబడివచ్చితివి” అని పలికెను.
21. సౌలు దావీదుతో ”నేను పాపము చేసితిని. నాయనా! నీవిక నాయొద్దకు రావచ్చును. నేను నీకు ఎటువిం అపకారమును చేయను. నేడు నా ప్రాణము పట్ల ఇంత ఆదరము చూపితివి. అవును, నేను వెఱ్ఱివానివలె ప్రవర్తించితిని. నా దోషము మన్నింప రానిది” అనెను.
22. దావీదు అతనితో ”ప్రభువు ఈటె ఇదిగో! నీ సేవకుడు ఇచ్చికి వచ్చి దీనిని కొనిపోవచ్చును.
23. యావే ఎవరెవరి నీతికి, విశ్వస నీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండును. నేడు ప్రభువు నిన్ను నాచేతికి అప్పగించెను. అయినను ప్రభువు అభిషిక్తునిపై నేను చేయి చేసికోలేదు.
24. నేడు నీ ప్రాణములను ఆదరముతో కాపాడితిని. అట్లే యావే నా ప్రాణములనుగూడ ఆదరమున కాపాడి అన్ని ఇక్కట్టులనుండి నన్ను బ్రతికించునుగాక!” అనెను.
25. సౌలు దావీదుతో ”నాయనా! దేవుడు నిన్ను దీవించునుగాక! నీవిక గొప్పకార్యములు చేసెదవు. తప్పక విజయము సాధించెదవు” అని చెప్పెను. అంతట దావీదు, సౌలు ఎవరి త్రోవను వారు వెళ్ళి పోయిరి.