యూదానందు అబీయాము పరిపాలనము (క్రీ.పూ. 913-911)
15 1. యిస్రాయేలు మండలమున యరోబాము పరిపాలనకాలము పదునెనిమిదవ యేట అబీయాము యూదా మండలమునకు రాజయ్యెను.
2. అతడు యెరూషలేమున మూడేండ్లు పరిపాలించెను. అతని తల్లి అబ్షాలోము కుమార్తె మాకా.
3. అబీయాము తన తండ్రివలె దుష్కార్యములు చేసెను. దావీదు హృదయ మువలె అతని హృదయము ప్రభువుమీద లగ్నము కాదయ్యెను.
4. అయినను దావీదు ముఖముచూచి ప్రభువు అతనికొక కుమారుని ప్రసాదించెను. ఆ కుమా రుడు అబీయాము తరువాత యెరూషలేమునుండి పరిపాలనచేసి ఆ నగరమును సుస్థిరము చేయవల యునని ప్రభువు తలంచెను.
5. దావీదు హిత్తీయు డైన ఊరియా విషయమునతప్ప యావేదృష్టికి నీతి యుక్తముగా ప్రవర్తించి అతని ఆజ్ఞలను పాించెను గనుక ప్రభువట్లు చేసెను.
6. అబీయాము రాజ్యము చేసినంతకాలము అతనికిని, యరోబామునకును బద్ధవైరముగా నుండెడిది.
7. అబీయాము జీవితము లోని ఇతరఅంశములన్నియు యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి.
8. అంతట అబీయాము తన పితరులతో నిద్రించగ అతనిని దావీదు నగరముననే పాతిప్టిెరి. అతని తరువాత అతని కుమారుడు ఆసా రాజయ్యెను.
యూదాలో ఆసా పరిపాలనము (క్రీ.పూ. 911-870)
9. యిస్రాయేలు దేశమున యరోబాము పరి పాలనకాలము ఇరువదియవయేట యూదా రాజ్య మున ఆసా రాజయ్యెను.
10. అతడు యెరూషలేము నుండి నలువదియేండ్లు పరిపాలించెను. అతని పితా మహి అబ్షాలోము కుమార్తెయైన మాకా.
11. ఆసా తన పితరుడైన దావీదువలె యావే దృష్టిలో నీతియుక్త ముగా జీవించెను.
12. మరియు అతడు వేశ్యలవలె ప్రవర్తించు మగవారినందరిని తన రాజ్యమునుండి బహిష్కరించెను. తన పూర్వులు నెలకొల్పిన విగ్రహ ములను నాశనము చేసెను.
13. అతడు తన పితా మహి మాకా అషేరా దేవతకొక విగ్రహమును నెల కొల్పగా ఆమెను రాజమాత పదవినుండి తొల గించెను. ఆ విగ్రహమును ముక్కలుచేసి కీద్రోను నది ఒడ్డున కాల్చివేసెను.
14. ఆసా ఉన్నతస్థలములను నిర్మూలింపకున్నను అతని హృదయము మాత్రము పూర్తిగా యావేమీదనే లగ్నమయ్యెను.
15. అతడు తన తండ్రియును, తానును ప్రభువునకు అర్పించిన వెండి బంగారములను, ఇతర పరికరములను కొని వచ్చి దేవాలయమునకు ఒప్పగించెను.
16. ఆసారాజును, యిస్రాయేలు మండలము నేలిన బాషారాజును జీవితకాలమంతయు పోరాడు కొనుచునే ఉండిరి.
17. బాషా యూదా వారికి విరో ధియై యుండి, యూదా నుండి ఎవరు రాకుండగను, తన రాజ్యములోని వారెవ్వరును ఆసాయొద్దకు పోకుండగను రామా పట్టణమును ప్రాకారములతో సురక్షితము చేసెను. దానితో యూదా మండలమునకు రాకపోకలకు ఆటంకము కలిగెను.
18. కనుక ఆసా, రాజ భవనమునను, దేవాలయమునను మిగిలియున్న వెండిబంగారములను చేకొని సేవకులద్వారా సిరియా రాజగు బెన్హెదదునకు కానుకగా పంపించెను. ఈ రాజు తబ్రిమ్మోను కుమారుడు, హెస్యోనునకు మనుమడు.
19. ఆసా ”మన తండ్రులవలె మనమును స్నేహితు లముగానుందము. నేను నీకు వెండిబంగారములను కానుకగా పంపితిని. ఇకమీదట నీవు యిస్రాయేలు రాజైన బాషాతో పొత్తువిడువుము. అతడు నా రాజ్యమునుండి తన సైన్యమును మరలించుకొని పోవ లయును” అని బెన్హెదదునకు వర్తమానమంపెను.
20. బెన్హెదదు ఆసాతో సంధిచేసికొని యిస్రాయేలు పట్టణ ముల మీదికి సైన్యాధిపతులను పంపెను. వారు ఇయ్యోను, దాను, ఆబేల్బెత్మాకా పట్టణములను, కిన్నెరెతు, నఫ్తాలి మండలములను వశము చేసికొనిరి.
21. ఈ ఉదంతము విని బాషా రామా పట్టణమును సురక్షితము చేయుట మానివేసి తీర్సా నగరమునకు వెడలిపోయెను.
22. అపుడు ఆసా యూదా మండల ములోని ప్రజలనెల్ల పిలిపించి రామా నగరమును సురక్షితము చేయుటకై బాషా కొనివచ్చిన రాళ్ళను, కలపను మోయించుకొనివచ్చెను. ఆ సామగ్రితో అతడు బెన్యామీను మండలములోని గెబా, మిస్ఫా నగరములను సురక్షితము చేసెను.
23. ఆసా జీవితములోని ఇతరాంశములు, అతడు చూపిన పరాక్రమము, అతడు చేసిన పనులు, క్టించిన పట్టణములు, యూదారాజుల చరిత్రలో లిఖింపబడియేయున్నవి. ఆసా రాజు ముసలితన మున పాదములలో జబ్బుతో బాధపడెను.
24. అంతట ఆసా తన పితరులతో నిద్రించి, తన పిత రుడైన దావీదు నగరముననే పాతిపెట్టబడెను. అతని తరువాత అతని కుమారుడు యెహోషాఫాత్తు రాజయ్యెను.
నాదాబు యిస్రాయేలును ఏలుట (క్రీ.పూ. 910-909)
25. ఆసారాజు యూదా రాజ్యమును పరి పాలించిన కాలము రెండవయేట యరోబాము కుమా రుడైన నాదాబు యిస్రాయేలు రాష్ట్రమునకు రాజై రెండేండ్లు పరిపాలించెను.
26. అతడు తన తండ్రి వలె యావే ఇష్టపడని దుష్కార్యములు చేసెను. ప్రజలనుకూడ పాపమునకు పురికొల్పెను.
27. యిస్సాఖారు తెగకు చెందిన అహీయా పుత్రుడైన బాషా నాదాబుమీద కుట్రపన్నెను. నాదాబు తనసైన్యముతో ఫిలిస్తీయాలోని గిబ్బెతోను నగరమును ముట్టడించు చుండగా బాషా అతనిని చంపివేసెను.
28. ఆసా యూదా రాజ్యమును పరిపాలించిన కాలము మూడవ యేట ఈ సంఘటన జరిగెను. ఆ రీతిగా నాదాబును చంపి బాషా యిస్రాయేలు రాజ్యమునకు రాజయ్యెను.
29. రాజయిన వెంటనే బాషా యరోబాము వంశీ యులనందరిని మట్టుపెట్టెను. ప్రభువు షిలో ప్రవక్త యైన అహీయా ద్వారా సెలవిచ్చినట్లే యరోబాము వంశమున ఒక్క పురుగుకూడ మిగులకుండ అందరు చచ్చిరి.
30. యరోబాము దుష్కార్యములు చేసి యిస్రాయేలీయులను కూడ పాపమునకు పురికొల్పి ప్రభుకోపమును రెచ్చగొట్టెను గనుక అతని వంశము మొదలంట నాశనమయ్యెను.
31. నాదాబు జీవితము లోని ఇతరాంశములు అతడుచేసిన పనులు, యిస్రా యేలు రాజులచరిత్రలో లిఖింపబడియేయున్నవి.
32. యూదా రాజగు ఆసా, యిస్రాయేలు రాజగు బాషా జీవితకాలమంతయు పోరాడుకొనుచునే యుండిరి.
బాషా యిస్రాయేలును పరిపాలించుట (క్రీ.పూ. 909-886)
33. ఆసా యూదా రాజ్యమున పరిపాలించిన కాలము మూడవయేట అహీయా కుమారుడగు బాషా యిస్రాయేలు రాజ్యమునకు రాజయ్యెను. అతడు తీర్సా పట్టణమునుండి ఇరువది నాలుగేండ్లు పరిపాలించెను. 34. యరోబామువలె అతడును యావే ఇష్టపడని దుష్కార్యములు చేసెను. ప్రజలను కూడ పాపమునకు పురికొల్పెను.