పవిత్ర పథము

35 1.      ఎండిన ఎడారి సంతసించునుగాక!

                              మరుభూమి ప్రమోదముచెంది,

                              పుష్పించునుగాక!

2.           అది జాజిపూలు పూయునుగాక!

               సంతసముతో పాటలుపాడునుగాక!

               అది లెబానోనువలె వైభవముగా అలరారును.

               కర్మెలు, షారోను మండలములవలె

               సారవంతమగును.

               ఎల్లరును ప్రభువు వైభవమును గాంతురు.

               మన దేవుని తేజస్సును జూతురు.

3.           దుర్బల హస్తములను బలపరుపుడు.

               గడగడవణకు మోకాళ్ళకు సత్తువనిండు.

4.           ”మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు.

               శత్రువులకు ప్రతీకారము చేయుటకును,

               విరోధులను శిక్షించి మిమ్ముకాపాడుటకును

               మీ దేవుడు వచ్చుచున్నాడు”

               అని మీరు నిరుత్సాహము చెందిన

               వారితో నుడువుడు.

5.           అప్పుడు గ్రుడ్డివారు చూతురు.

               చెవివారు విందురు.

6.           కుింవారు లేడివలె గంతులువేయుదురు.

               మూగవారు సంతసముతో కేకలిడుదురు.

               మరుభూమిలో ఏరులు పారును.

7.            ఎండిననేల సరస్సగును.

               మాడిననేలలో నీిబుగ్గలు పుట్టును.

               పూర్వము నక్కలు వసించిన పొదలలో

               తుంగలును, జమ్ములును ఎదుగును.

8.           అచట రాజపథము ఒకి నెలకొనును.

               దానిని ‘పవిత్రపథము’ అని పిలుతురు.

               పాపాత్ములు దానిగుండ పయనింపజాలరు.

               దానివెంట పోవువారిని

               మూఢులు ప్రక్కకు త్రిప్పజాలరు.

9.           ఆ మార్గమున సింగము కన్పింపదు.

               క్రూరమృగములు దానివెంట పయనింపవు.

               ప్రభువు రక్షించినవారు ఆ త్రోవగుండ నడతురు.

10.         ఆయన రక్షించినవారు ఇంికి తిరిగివత్తురు.

               ఉల్లాసముతో పాటలుపాడుచు

               మహానందముతో సియోనును చేరుకొందురు.

               వారు సంతోషముతోను, ప్రమోదముతోను వత్తురు.

               వారి దుఃఖవిషాదములెల్ల తొలగిపోవును.