యిర్మీయా జీవితమున కడపి సంఘటన

44 1. ఐగుప్తునందలి మిగ్దోలు, తహపనేసు, నోపు, పత్రోసు మొదలైన నగరములలో వసించు యూదు లందరిని గూర్చి యిర్మీయాతో ప్రభువు ఇట్లు చెప్పెను: 2. ”సైన్యములకధిపతియు యిస్రాయేలు దేవుడైన ప్రభువు పలుకులివి: నేను యోరూషలేముమీద, యూదానగరములన్నిమీద తెచ్చిప్టిెన వినాశన మును మీరు స్వయముగా చూచితిరి. ఆ నగరములిప్ప ికిని పాడువడిఉన్నవి. వానిలో ఎవడును వసించుట లేదు.

3. ఆ నగరముల పౌరులు దుష్కార్యములు చేసి నాకు కోపము రప్పించిరి. వారు అన్యదైవములకు బలులర్పించిరి. తాముగాని, మీరుగాని, మీ పూర్వులు గాని ఎరుగని దైవములను కొలిచిరి.

4. నేను విడువక సదా వేకువనే నా సేవకులైన ప్రవక్తలను మీ చెంతకు పంపుచునేయుింని. నేను అసహ్యించుకొను ఈ ఘోరకార్యమును చేయవలదు అని వారు మిమ్ము హెచ్చరించుచునేయుండిరి.

5. కాని మీరు వారి పలుకులను లెక్కచేయలేదు. అన్యదైవములకు బలులు అర్పించు దుష్కార్యములను మానలేదు.

6. కావున నేను నా రౌద్రమును యూదా నగరముల మీదను, యెరూషలేము మీదను కుమ్మరించి వానిని కాల్చివేసి తిని. అవి నాశనమై ఎడారులై నేికిని అటులనే ఉన్నవి.

7. కావున సైన్యములకధిపతియు యిస్రాయేలు దేవుడనైన నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను. మీరీ దుష్కార్యములుచేసి కీడు తెచ్చుకోనేల? మీరు స్త్రీలను, పురుషులను, పిల్లలను, చింబిడ్డలను నాశనముచేసి మీ జనులలో ఎవరును మిగులకుండునట్లు చేయు దురా?

8. మీరు వలసవచ్చిన ఈ ఐగుప్తున అన్య దైవములకు బలులర్పించి, విగ్రహములను పూజించి నా కోపమును రెచ్చగొట్టనేల? మిమ్ము  మీరే నాశనము చేసికొందురా? భూమిమీది జాతులన్నియు మిమ్ము జూచి నవ్వవా? జనులు మీ పేరును శాపవచనముగా వాడుకొనరా?

9. యూదా నగరములలోను, యెరూషలేము వీధులలోను మీ పూర్వులును, యూదా రాజులును, వారి భార్యలును, మీరును, మీ భార్యలును చేసిన దుష్కార్యములను మీరు మరచిపోయితిరా?

10. నేివరకును మీకు వినయముగాని, దైవ భయముగాని అలవడలేదు. నేను మీకును  మీ పూర్వులకును విధించిన ధర్మశాస్త్రమును, కట్టడలను మీరు  పాింపలేదు.

11. ”కనుక సైన్యములకు అధిపతియు యిస్రా యేలు దేవుడనైన నేను యూదావారినందరిని నాశ నము చేయ నేను మీకు అభిముఖుడనగుదును.

12. యూదీయులలో మిగిలియున్నవారు ఐగుప్తున వసింప గోరుచున్నారు. నేను వారినందరిని నాశనము చేయు దును. అల్పులును, అధికులందరును ఐగుప్తున పోరు వలనగాని, ఆకలివలనగాని చత్తురు. ప్రజలు వారి దుర్గతి చూచి భీతిల్లుదురు. వారినిచూచి నవ్వుదురు. వారి పేరును తిట్టుగా వాడుకొందురు.

13. యెరూషలేము వాసులవలె ఐగుప్తున వసించు వారిని గూడ నేను పోరు, ఆకలి, అంటు రోగములతోశిక్షింతును.

14. యూదీయులలో మిగిలియుండి ఐగుప్తునకు వలస వచ్చిన వారిలో ఒక్కడును మిగులడు. వారు మరల యూదాలో వసింపగోరుచున్నారు. కాని వారిలో ఒక్కడును అక్కడకు తిరిగిపోడు. కొద్దిమంది శరణా గతులు తప్ప ఎవరును అచికి వెళ్ళరు.”

15. అప్పుడు తమభార్యలు అన్య దైవములకు ధూపమువేసితిరని తెలిసిన పురుషులును, అచట నిలుచుండియున్న స్త్రీలును, పత్రోసున వసించు యూదులును వారందరును కలిసి పెద్ద సమూహమై యిర్మీయాకు ఇట్లు బదులిచ్చిరి.

16. ”నీవు ప్రభువు పేరు మీదుగా చెప్పిన సంగతులను మేము విన నొల్లము.

17. మేము చేయదలచుకొన్న కార్యములెల్ల చేయుదుము. మేము ఆకాశరాజ్ఞికి ధూపము వేతుము. ద్రాక్షసారాయమును పానీయార్పణముగా పోయుదుము. పూర్వము మేము, మా పూర్వులును, మా రాజులును, మా నాయకులును యూదా నగరములలోను, యెరూషలేము వీధులలోను ఆలాగు చేసినపుడు మాకు చాలినంత తిండి దొరికెను. మేము ఏ చిక్కులకను గురికాక క్షేమముగా ఉంిమి.

18. కాని మేము ఆకాశరాజ్ఞికి ధూపము వేయుటయు, పానీయార్పణము గావించుటయు మానివేసిన వెంటనే కికపేదలమైతిమి, మాప్రజలు పోరువలనను, ఆకలి వలనను చచ్చిరి”

19. మరియు అచి స్త్రీలు ”మేము ఆకాశరాజ్ఞి ఆకారమున మోదకములు చేసినపుడును, ఆమెకు ధూపమువేసి, పానీయార్పణమును గావించు నపుడును మా పురుషుల అనుమతిలేకయే చేయు చున్నామా?” అని అనిరి.

20. అచి స్త్రీలు పురుషులు ఈ రీతిగా జవాబు చెప్పగా యిర్మీయా వారితో ఇట్లనెను: 21. ”మీరును మీ పూర్వులును, మీ రాజులును, నాయకులును, ప్రజలును, యూదా నగరములలోను, యెరూషలేము వీధులలోను అర్పించిన ధూపమును ప్రభువు గుర్తింప లేదనుకొింరా?

22. ఇందువలననే నేడు మీ దేశము ఎడారియయ్యెను. ప్రజలు దాని దుర్గతిని చూచి భీతిల్లి దానిని శాపవచనముగా వాడుకొనుచున్నారు. ప్రభువు మీ దుష్కార్యములను సహించకపోవుటవలననే ఇదంతయు జరిగినది.

23. మీరు అన్యదైవములకు అర్పణములర్పించి ప్రభువునకు ద్రోహము చేసి, ఆయన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, ఒడంబడికను మీరితిరి కనుక ఈ అనర్థము వాిల్లినది.”

24. అంతట యిర్మీయా అచి ప్రజలకు, ప్రత్యే కముగా స్త్రీలకు ఇట్లు చెప్పెను: ”సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఐగుప్తు లోని యూదులతో ఇట్లనుచున్నాడు:

25. మీరును, మీ భార్యలును ఆకాశరాజ్ఞికి ప్రమాణములు చేసితిరి. ఆమెకు మీరు ధూపమువేసి, పానీయార్పణము కావింతుమని ఆమెకు బాసచేసితిరి. మీ ప్రమాణములను నెరవేర్చుకొింరి. సరే, ఇక మీ ప్రమాణములను నిలబెట్టుకొనుడు. మీ వ్రతములు తీర్చుకొనుడు.

26. కాని ప్రభుడనైన నేను ఐగుప్తులోని యూదులను పురస్కరించుకొని నా జీవముతోడు అని నేను చేయు ఈ ప్రమాణమును గుర్తింపుడు. మీలో ఎవడును ఇక నా నామము నోటపలుకరని నా మహానామము మీదుగా నేను ప్రమాణము చేయుచున్నాను.

27. మీరు వృద్ధిలోకిరారుకదా, సర్వనాశనమయ్యెదరు. మీరు పోరు, అంటురోగముల వలన చత్తురు. మీలో ఎవడును మిగులడు.

28. మీలో కొద్దిమంది మాత్రమే చావు తప్పించుకొని ఐగుప్తునుండి యూదాకు తిరిగి పోవుదురు. అప్పుడు ప్రాణములతో బ్రతికియుండి ఐగుప్తున వసించుటకు వెళ్ళిన యూదీయులలో మిగిలియున్నవారు నా మాట నెగ్గునో, తమ మాట నెగ్గునో తెలిసికొందురు.

29. ప్రభుడనైన నేను ఈ తావున మిమ్ము శిక్షించితీరుదునని రూఢిగా తెలియ జేయుచున్నాను. నేను మిమ్ము నాశనము చేయుదునని చేసిన ప్రమాణము నెరవేరి తీరును.

30. నేను యూదారాజైన సిద్కియాను అతని విరోధియు, అతనిని చంపగోరువాడునైన బబులోనియా రాజు నెబుకద్నెసరు చేతికి అప్పగించితిని. ఆ రీతినే ఐగుప్తు రాజైన హోఫ్రను, అతనిని చంపగోరు విరోధులచేతికి అప్పగింతును.”