8 1.         నీవు నాకు సోదరుడవైన

                              ఎంత బాగుగానుండెడిది!

                              మాతల్లి స్తన్యములను గ్రోలినవాడవైన

                              ఎంతబాగుగా నుండెడిది!

                              అప్పుడు, నిన్ను వీధిలో కలిసికొనినప్పుడు

                              నేను నిన్ను ముద్దుపెట్టుకొనినను

                              ఎవరును తప్పుపట్టెడివారు కారు.

2.           నేను నిన్ను మా తల్లి ఇంికి కొనిపోయెడిదానను.

               అచట నీవు నాకు

               ఉపదేశము చేసియుండెడివాడవు.

               నేను నీకు సుగంధము కలిపిన ద్రాక్షారసమును,

               దానిమ్మపండ్ల రసమును అందించియుండెడిదానను

3.           నీవు నీ ఎడమచేతిని నా తలక్రిందనుంచి

               నీ కుడిచేతితో నన్ను

               ఆలింగనము చేసికొనెడివాడవు.

ప్రియుడు

4.           యెరూషలేము కుమార్తెలారా!

               నేను మీకు ఆనప్టిె చెప్పుచున్నాను.

               నా ప్రియురాలు స్వయముగా మేలుకొనువరకు

               మీరు ఆమెకు నిద్రాభంగము కలిగింపవలదు.

ఆరవ గీతము

చెలికత్తెలు

5.           ప్రియునిమీద వాలి ఎడారినుండి వచ్చు

               ఈమె ఎవరు?

ప్రియుడు

               ఆపిలుచెట్టు క్రింద,

               మీ అమ్మ నిన్ను గర్భము తాల్చిన

               తావుననే నేను నిన్ను మేలుకొలిపితిని.

6.           నన్ను నీ హృదయము మీద,

               నీ హస్తముమీద ముద్రవలె ధరింపుము.

               ప్రేమ మృత్యువంత బలమైనది.

               అనురాగము పాతాళలోకమువలె

               తాను ప్టినవారిని విడువనిది.

               ప్రేమజ్వాలలు అగ్నిజ్వాలలవింవి,

               నిప్పు మంటలవలె గనగనమండునవి.

7.            అగాధసముద్ర జలములు ప్రేమనార్పలేవు.

               నదీప్రవాహములు ప్రేమను ముంచివేయలేవు.

               ఒకడు తన పూర్తి స్వాస్థ్యమునంత ఇచ్చినను

               ప్రేమను కొనజాలడు.

               అవమానమును మాత్రమే కొనితెచ్చుకొనును.

ప్రియురాలి సోదరులు

               మాకొక చిన్నచెల్లెలు కలదు.

               ఆమెకింక చనుకట్టు ఏర్పడలేదు.

               ఆమెకు వివాహము చేయుకాలము వచ్చినప్పుడు

               మనము ఏమి చేయుదము?

8.           ఆమె ప్రాకారము విందైనచో,

               దానిని కాపాడుటకు

               మనము వెండి బురుజును నిర్మింతము.

9.           ఆమె ద్వారము విందైనచో

               దానిని రక్షించుటకు

               మనము దేవదారు వాసములను అమర్చుదము.

ప్రియురాలు

10.         నేను ప్రాకారమువిందానను.

               నా కుచములే నా బురుజులు.

               నా ప్రియుడు నన్ను చల్లనిచూపున చూడగా

               నాకు శాంతి సౌభాగ్యములు సిద్ధించెను.

11.           బాలుహామోను అను తావున

               సొలోమోనునకు ఒక ద్రాక్షతోటయున్నది.

               అతడు దానిని కాపులకు గుత్తకిచ్చెను.

               వారిలో ఒక్కొక్కడు అతనికి

               వేయి వెండినాణెములు చెల్లించును.

12.          సొలోమోనునకు

               వేయి వెండినాణెములు ముట్టునుగాక!

               కాపులకు రెండువందల వెండినాణెముల

               ఆదాయము లభించుగాక!

               నా ద్రాక్షతోట మాత్రము నాకే కలదు.

ప్రియుడు

13.          ఉద్యానవనములందు వసించు ప్రేయసీ!

               నా చెలికాండ్రు నీ పలుకులు వినగోరుదురు.

               నేనును నీ స్వరమును వినగోరెదను.

ప్రియురాలు

14.          ప్రియా! నీవు శీఘ్రముగా రమ్ము!

               సుగంధపుమొక్కలు పెరిగెడి కొండమీద

               లేడివలెను, జింకపిల్లవలెను చూపట్టుము.