లేవీయ యాజకులు

18 1. తోి యిస్రాయేలీయులకువలె లేవీయ  యాజకులకు, లేవీయులందరికి ఆస్తిపాస్తులుండవు. వారు యావేకు అర్పించిన కానుకలు నైవేద్యములు భుజించి బ్రతుకుదురు. అది వారి హక్కు.

2. ఇతర తెగలవలె ఈ తెగకు భూమివారసత్వము ఉండదు. ప్రభువు సెలవిచ్చినట్లుగా ప్రభువైన దేవుడే లేవీయు లకు వారసత్వము.

3. ప్రజలు ఎద్దునో, పొట్టేలునో బలిగా సమ ర్పించునపుడు దాని ముందుతొడను, రెండుదౌడలను, ఉదరమును యాజకులకు ఈయవలయును.

4. మీ తొలిధాన్యమునుండియు, ద్రాక్షసారాయమునుండియు, ఓలివునూనెనుండియు, ఉన్నినుండి మొదివంతు వారికి ఈయవలయును.

5. మీ తెగలన్నింట లేవీ తెగవారినే ప్రభువు యాజకులనుగా ఎన్నుకొనెను. వారు ప్రభువునకు పరిచర్యచేయుచు కలకాలము ఆయనను స్తుతింతురు. ఆయన ప్రజలను దీవింతురు.

6. మీ నగరములనుండి ఏ లేవీయుడైన ప్రభువు ఎన్నుకొనిన ఆరాధనస్థలమునకు మక్కువతో వచ్చి నపుడు, 7. అచటనున్న ఇతర లేవీయులవలె అతడు ప్రభువునకు సేవచేయవలెను.

8. అతడు నగరము నందున్న తన పిత్రార్జితము నుండి లభించిన ఆదాయము కలిగియున్నను, నైవేద్యములలో ఇతర లేవీయులకువలె సమపాలు భుజింపవలెను.

ప్రవక్త

9. మీరు యావే మీకొసగు దేశమున వసించు నపుడు అచిజాతుల జుగుప్సాకరమైన ఆచారములను అనుకరింపవలదు.

10. మీ బిడ్డలను అగ్నిలో దహన బలిగా అర్పింపరాదు. మీరు శకునములు చెప్పించు కొనకుడు. జ్యోతిష్కులను సంప్రతింపకుడు. చేతబడులు చేయింపకుడు.

11. మంత్రతంత్రములు ఉపయోగించు కొనకుడు. మృతులను సంప్రతించి భూతములను ఆవాహనము చేయింపకుడు.

12. ఇి్ట కార్యములు చేయువానిని ప్రభువు ఏవగించుకొనును. ఇి్ట హేయ మైన పనులు చేయువారు కనుకనే ప్రభువు అన్యజాతు లను మీ చెంతనుండి వెళ్ళగొట్టుచున్నాడు.

13. మీ మట్టుకు మీరు ఆయనను పూర్ణముగా విశ్వసింపుడు.

14. మీరు స్వాధీనము చేసికొనబోవు దేశము నందలి ప్రజలు శకునములు చెప్పువారిని, జ్యోతిష్కు లను సంప్రదించిరి. కాని మీర్టి పనులు చేయుటకు ప్రభువు అంగీకరింపడు.

15. ప్రభువు మీ ప్రజల నుండియే నావిం ప్రవక్తనొకనిని మీ చెంతకు పంపును. మీరు అతని మాటవినుడు.

16. నాడు హోరేబువద్ద సమావేశమైనపుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే. ‘మేము మరల యావే పలుకులు విన్నచో, మరల అతని అగ్నిమయరూపమును దర్శించి నచో తప్పక చత్తుము’ అని అంిరి.

17. అప్పుడు ప్రభువు నాతో ”వారి వేడుకోలు సబబుగనే యున్నది.

18. నీ విం ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారిచెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నియు అతడు వారితో చెప్పును.

19. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాింపని వానిని నేను శిక్షింతును.

20. కాని నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్తయు, అట్లే అన్యదైవములపేర ప్రవచనముచెప్పు ప్రవక్తయు తప్పక మరణమునకు గురికావలసినదే” అని నుడివెను.

21. కాని పలానా ప్రవక్త పలికినది ప్రభువు సందేశము కాదని మనము నిర్ణయించుటెట్లు అని మీరు ఆశ్చర్యపడవచ్చును.

22. ప్రవక్త ప్రభువు పేరిట పలికినపలుకు నెరవేరనిచో అది ప్రభువు సందేశముకాదని నిర్ణయింపనగును. అి్ట ప్రవక్త అహంకారముతో ప్రవచనము చెప్పెను. కనుక మీరు దానికి భయపడనక్కరలేదు.

Previous                                                                                                                                                                                                        Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము