ఉపకారము చేయుటకు నియమములు

12 1.       ఉపకారము చేయగోరెదవేని

                              యోగ్యులెవరో పరిశీలింపుము.

                              అప్పుడు నీ సత్కార్యము వ్యర్థముకాదు.

2.           భక్తిపరునికి చేసిన ఉపకారమునకు

               అతనినుండి కాకున్నను,

               దేవుని నుండియైనను బహుమతి లభించును.

3.           ఎల్లవేళల దుష్కార్యములు చేయువానికి,

               ఏనాడు దానధర్మములు చేయనివానికి

               మేలు కలుగదు.

4.           దైవభక్తి కలవారికేగాని

               పాపాత్ములకు ఉపకారము చేయవద్దు.

5.           వినయవంతునికి సహాయము చేయవలెను గాని

               భక్తిహీనునికి చేయరాదు.

               భక్తిలేని వానికి అన్నము ప్టిెనచో

               అతడు నీ కరుణను విస్మరించి

               నీ మీద తిరుగబడును.

               నీవతడికి చేసిన మంచికిగాను రెండంతలు

               అదనముగా చెడ్డను అనుభవింప వలసివచ్చును.

6.           మహోన్నతుడైన ప్రభువుకూడ

               పాపాత్ములను అసహ్యించుకొనును.

               వానిని శిక్షించితీరును.

7.            సత్పురుషులకు దానము చేయవలెను.

               పాపాత్ములకు సహాయము చేయరాదు.

స్నేహితులలో మంచివారు, చెడ్డవారు

8.           సంపదలలో మంచిమిత్రుని గుర్తింపజాలము.

               కాని ఆపదలలో చెడ్డమిత్రుని

               తప్పక గుర్తింపవచ్చును.

9.           ఆపదలలో మిత్రులుకూడా

               మనలను విడిచిపోయెదరు.

               కాని, సంపదలలో చెడ్డవారును

               మిత్రులవలె నింతురు.

10.         చెడ్డ స్నేహితుని ఎప్పుడును నమ్మరాదు.

               త్రుప్పు లోహమునువలె

               అతని దుష్టత్వము మనలను నాశనము చేయును

11.           దుష్టుడు నక్కవినయములతో దండము ప్టిెనను

               అతనినిగూర్చి  జాగ్రత్తగా  ఉండవలెను

               కంచుటద్దము మీది త్రుప్పువలె

               వానిని తుడిచి వేయవలెను.

               అప్పుడు ఆ త్రుప్పు ఎి్ట హానియు చేయదు.

12.          దుష్టమిత్రుని నీ ఎదుట ఉండ నిచ్చెదవేని

               అతడు నిన్ను ప్రక్కకున్టెి,

               నీ స్థానమును ఆక్రమించుకోవచ్చును.

               అతనిని నీ కుడిప్రక్కన కూర్చుండనిచ్చెదవేని

               నీ పీఠమును కాజేయజూచును.

               అప్పుడు నీవు నా మాటలలోని

               సత్యమును గ్రహింతువు.

               నా పలుకులను జ్ఞప్తికితెచ్చుకొని పశ్చాత్తాపపడెదవు

13.          పాములనాడించు వానిని పాము కరచినచో,

               వన్యమృగములను మచ్చిక చేయువానికి

               మృగము హానిచేసినచో, ఎవరైన దుఃఖింతురా?     

14.          పాపాత్ములతో దిరుగుచు

               వారి పాపకార్యములలో పాల్గొనువాని

               విషయముకూడ అంతియే.

15.          దుష్టమిత్రుడు కొంతకాలము

               నీ చుట్టు తిరుగవచ్చుగాక !

               కష్టములు రాగానే నిన్ను విడిచి వెళ్ళిపోవును.

16.          దుష్టునికి పెదవులమీద తేనెయుండును.

               అతడు హృదయములో మాత్రము నిన్ను గోతిలో కూలద్రోయవలెనని కోరుకొనుచుండును.

               అతడు నీ కష్టములలో సానుభూతి

               చూపుచున్నట్లే నించును. కాని

               అవకాశము దొరికినపుడు నీ ప్రాణము తీయును

17.          నీకు కష్టములు వచ్చినపుడు

               అతడు నీ ఎదుికి వచ్చును.

               కాని నీకు సాయము చేయుచున్నట్లే నించి

               నిన్ను గోతిలో ద్రోయును.

18.          ఆ మీదట సంతసముతో

               చేతులు చరచి తలయాడించును.

               తాను మరొక వ్యక్తిగా మారిపోయి

               నీ మీద పుకార్లు ప్టుించును.