రాజు, పండుగలు

46 1. యావే ప్రభువిట్లనెను: ”లోపలి ఆవరణపు తూర్పుద్వారమును పనిచేయు ఆరుదినములు మూసి యుంచవలెను. కాని విశ్రాంతిదినములందును, అమావాస్య పండుగలందును దానిని తెరచియుంచ వలెను.

2. రాజు వెలుపలి ఆవరణములోనుండి ద్వారపు గది వసారా గుండావెళ్ళి, యాజకులు అతని దహనబలులను, సమాధానబలులను అర్పించు చుండగా అతడు ద్వారబంధముల వద్ద నిలుచుండును. అతడు ద్వారమువద్దనే ప్రభువును ఆరాధించి తిరిగి పోవును. ఆ సాయంకాలమువరకు ఆ ద్వారమును మూయరాదు.

3. విశ్రాంతిదినములందును, అమా వాస్య పండుగలందును ప్రజలు ప్రవేశద్వారము నెదుట శిరమువంచి దేవుని ఆరాధింపవలెను.

4. విశ్రాంతిదినములందు రాజు దహనబలికిగాను గొఱ్ఱె పిల్లలను ఆరింని, పొట్టేలిని ఒక దానిని కొనిరా వలెను. వానిక్టిె లోపమును ఉండరాదు.

5. అతడు ఒక్కొక్క పొట్టేలితోపాటు తూము ధాన్యమును, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతోపాటు తన శక్తికొలది ధాన్యమును కొనిరా వలెను. ఒక్కొక్క తూము ధాన్యముతోపాటు మూడు బానల ఓలివుతైలమునుగూడ కొనిరావలెను.

6. అమావాస్య పండుగనాడు అతడు ఒక కోడెను, ఆరు గొఱ్ఱె పిల్లలను, ఒక పొట్టేలిని అర్పింపవలెను. వానిక్టిె లోపమును ఉండరాదు.

7. అతడు ఒక్కొక్క కోడెతో పాటు, ఒక్కొక్క పొట్టేలితో పాటు తూము ధాన్యమును, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతోపాటు తనకిష్టమైనంత ధాన్యమును అర్పింపవలెను. మరియు ఒక్కొక్క తూము ధాన్యముతో పాటు మూడు పడుల ఓలీవు తైలమునర్పింపవలెను.

8. అతడు వసారాగది నుండి బయలుదేరి తాను లోనికి వచ్చిన ద్వారముగుండనే వెలుపలికి పోవలెను.

9. ఆయా పండుగలలో ప్రభువును ఆరాధించు టకు వచ్చినపుడు ఉత్తరద్వారముగుండ లోనికి వెళ్ళిన వారు, దక్షిణద్వారముగుండ బయికి వెళ్ళిపోవలెను. దక్షిణద్వారముగుండ లోనికి వెళ్ళినవారు, ఉత్తర ద్వారముగుండ బయికి వెళ్ళిపోవలెను. ఎల్లరును తాము ప్రవేశించిన ద్వారముగుండగాక దానికి అభి ముఖముగానున్న ద్వారముగుండ తిరిగిపోవలెను.

10. రాజు ప్రజలతోకలిసిప్రవేశింపగ వారు ప్రవేశించు దురు. వారు వెళ్ళిపోయినపుడు అందరునుకూడి బయటకు వెళ్ళిపోవును.

11. పండుగదినములలోను, నియమితదినములలోను భక్తులు ప్రతి కోడెకును, పొట్టేలికిని తూము ధాన్యపుపిండి చొప్పున అర్పింప వలెను. వారు  ప్రతి  గొఱ్ఱెపిల్లతో పాటు తమకిష్టము వచ్చినంత ధాన్యమును అర్పింపవచ్చును. ప్రతి తూము  ధాన్యపుపిండికిని మూడు పడుల ఓలివు తైలమును అర్పింపవలెను.

12. రాజు తనంతట తాను దహన బలిని గాని, సమాధానబలిని గాని అర్పింపకోరినపుడు అతనికొరకు లోపలి ఆవరణములోని తూర్పుద్వారమును తెరువవలెను. అతడు విశ్రాంతిదినములందువలె ఆ బలినర్పించును. అతడు వెళ్ళిపోయిన తరువాత ద్వారమును మూయవలెను.

ప్రతిదిన సమర్పణము

13. ప్రతిదినము ఉదయము ఎి్ట లోపమునులేని ఏడాది గొఱ్ఱెపిల్లను ప్రభువునకు దహనబలిగా అర్పింపవలెను. ప్రతిరోజు దానిని అర్పింపవలెను.

14. మరియు ప్రతి ఉదయము తూమున ఆరవ వంతు పిండిని సమర్పింపవలెను. దానిని పిసుకుటకు ఒక పడి ఓలివుతైలము అర్పింపవలెను. ఈ సమ ర్పణము గూర్చిన నియమములు శాశ్వతముగా అమలులో ఉండును. 15. కలకాలము వరకును ప్రతి ఉదయము గొఱ్ఱెపిల్లను, పిండిని, ఓలివుతైలమును ప్రభువునకు అర్పింపవలెను.

రాజు, భూమి

16. యావేప్రభువిట్లనెను: రాజు తన భూమిలో కొంతభాగమును తన కుమారులకు బహుమతిగా ఇచ్చెనేని అది వారికి శాశ్వతముగా భుక్తమగును.

17. కాని అతడు తన భూమిలో కొంతభాగమును తన సేవకులకిచ్చెనేని, విమోచన సంవత్సరము వచ్చినపుడు అది మరల రాజునకే చెందును. అది అతనిది. కనుక అతడు, అతని పుత్రులు మాత్రమే దానిని శాశ్వతముగా భుక్తము చేసికోవచ్చును.

18. ప్రజలకు వారసత్వ ముగా వచ్చిన భూమిని రాజు స్వాధీనము చేసికో రాదు. అతడు తన సొంత భూమినే తన కుమారులకు పంచిపెట్టవలెను. అతడు జనులు తమ వారసత్వ మును అనుభవింపనీయక వారి భూమిని తీసికొని వారిని పీడింపరాదు.”

దేవాలయములోని వంటగది

19. తరువాత అతడు నన్ను లోపలి ఆవరణ ములో దక్షిణ దిక్కునందలి ద్వారమునకు ఎదురుగా నున్న గదుల ముంగికి కొనిపోయెను. ఇవి యాజకులు ఉపయోగించుకొను పవిత్రమైన గదులు. అతడు ఆ గదులకు పశ్చిమముననున్న గదులను నాకు చూపించి, 20. ఇచట యాజకులు పాపపరిహార బలిగాను, ప్రాయశ్చిత్తబలిగాను వధించిన పశువుల మాంసమును వండుదురు. భక్తులర్పించిన పిండిని కాల్చి రొట్టెలు చేయుదురు. కనుక పవిత్ర వస్తువేదియు వెలుపలి ఆవరణములోనికి పోయి ప్రజలకు హాని చేయదు” అని చెప్పెను.

21-22 అంతట అతడు నన్ను వెలుపలి ఆవరణములోనికి కొనిపోయి, దాని నాలుగుమూలలందును నాలుగు చిన్న ఆవరణము లను చూపించెను. అవి ఒక్కొక్కి నలుబది మూరల పొడవు ముప్పది మూరల వెడల్పు ఉండెను.

23. వానిలో ప్రతిదాని చుట్టును రాతిగోడవరుస కలదు. ఆ గోడవరుసలనానుకొని చుట్టు అడుగుభాగమున పొయ్యిలు కలవు. వంటగదులు కలవు.

24. దేవాల యమున ఊడిగము చేయువారు ఆ వంటగదులలో ప్రజలర్పించు బలిపశువుల మాంసమును వండుదురు అని అతడు నాతో చెప్పెను.