నీనెవెెె తప్పులకు శిక్ష

3 1. నెత్తురు నొలికించిన పట్టణమునకు,

               కల్లలాడిన నగరమునకు వినాశము తప్పదు.

               ఆ పురము కొల్లసొమ్ముతో నిండియున్నది.

               అది కొల్లగొట్టుటను ఎన్నడును మానలేదు.

2.           అదిగో! సారధి కొరడాల ఝుళిపింపు,

               చక్రముల ధ్వానము, గుఱ్ఱములదౌడు ధ్వని,

               రథముల నాదము.

3.           రౌతులు ప్రాకారముల మీదికి దుముకుచున్నారు.

               కత్తులు మెరయుచున్నవి,

               ఈటెలు తళతళలాడుచున్నవి,

               శవములు కుప్పలుగా పడుచున్నవి,

               పీనుగులకు అంతములేదు.

               పీనుగులు కాలికి తగిలి జనులు తొిల్లుచున్నారు   

4.           తన వ్యభిచారములకుగాను

               నీనెవె శిక్షనొందుచున్నది.

               ఆమె అందగత్తె, మంత్రవిద్యలో ఆరితేరినది.

               ఆమె తన రంకులతోను, మంత్రమహిమలతోను

               సంసారులను అమ్మివేసినది.

5.           సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు:

               నీనెవె! నేను నిన్ను శిక్షింతును.

               నీ వస్త్రపుటంచులు నీ ముఖముమీదికెత్తి

               జనమునకు నీ మానమును,

               జాతులకు నీ నగ్నత్వమును బయల్పరుతును

6.           నీ మీదికి మాలిన్యమువేసి పదుగురియెదుట

               నిన్ను అవమానమున ముంచుదును.

               జనులు నిన్ను గాంచి వెరగందుదురు.

7.            నిన్ను చూచిన వారెల్లరు వెనుకకు పరుగిడి

               ‘నీనెవె నాశమైనది,

               ఆమెపై ఎవరు సానుభూతి చూపుదురు?

               ఆమెను ఓదార్చువారిని

               ఎటనుండి కొనిరాగలము?’ అని పలుకుదురు.

నోవమోను నగరమునుండి గుణపాఠము

8.           నీనెవే!

               నీవు నో (తేబెసు) నగరముకంటె

               మెరుగైనదానవు కాదు.

               అదియు నీ వలె నది ప్రక్కనే ఉండెను.

               నైలునది జలములు దానిని ప్రాకారమువలె

               రక్షించుచుండెను.

9.           అది కూషు, ఐగుప్తుల నేలెను.

               దానికి అనంతమైన బలముండెను.

               పూతు, లిబియా దేశములు

               దానికి సాయపడుచుండెను.      

10.         అయినను శత్రువులు ఆ నగరవాసులను

               బందీలుగా కొనిపోయిరి.

               ప్రతిత్రోవ మలుపులో దాని పసిగందులను

               బండలకు విసరిక్టొి చంపిరి.

               దాని ప్రముఖులను గొలుసులతో బంధించి

               తీసికొనిపోయి తమలో తాము

               చీట్లువేసి పంచుకొనిరి.

నీనెవె యత్నములు సఫలము కావు

11.           నీనెవే!

               ప్రభువు శిక్ష అను పానీయము త్రాగుటవలన

               నీకును మత్తెక్కును.

               నీవును శత్రువులనుండి తప్పించుకోగోరుదువు.

12.          నీ కోటలన్నియు తొలికాపుపండ్లుగల

               అత్తిచెట్ల వింవి.

               ఒకడు ఆ చెట్లను ప్టి ఊపినచో

               ఆ పండ్లురాలి, వాని నోిలో పడును.

13. నీ సైనికులు స్త్రీల వింవారు.

               శత్రువులు దాడిచేసినపుడు

               నీ దేశమునకు రక్షణములేదు.

               నీ ద్వారముల అడ్డుగడెలు అగ్నికాహుతి అగును.

14.          నీవు ముట్టడికిగాను

               నీరు తోడుకొని   ఉంచుకొనుము.

               నీ కోటలను పిష్ఠము చేసికొనుము.

               ఇటుకలను చేయుటకు జిగటమ్టిని త్రొక్కుము.

               ఇటుక మూసలను, ఆవమునుసిద్ధము చేసికొనుము.

15.          నీవు ఎన్ని యత్నములు చేసినను

               అగ్ని నిన్ను దహింపక మానదు.

               ఖడ్గములు నిన్ను వధింపక మానవు.

               నీవు మిడుతల వాతబడిన

               పైరువలె నాశనమగుదువు.

నీనెవె ప్రజలు మిడుతలవింవారు

               నీనెవే!

               నీ పౌరులు మిడుతలవలె వృద్ధిజెందిరి.

16. నీ వర్తకులు ఆకసమునందలి

               చుక్కలకంటెను నెక్కువగా వ్యాపించిరి.

               కాని వారిపుడు ఎగిరిపోయిన

               మిడుతలవలె అదృశ్యమైరి.

17. నీ అధికారులు చలిగానున్నపుడు

               గోడలమీద వాలియుండు

               మిడుతల వింవారు.

               కాని సూర్యుడు ఉదయింపగనే

               ఆ మిడుతలెగిరిపోవును.

               అవి ఎచికి పోయినవో ఎవరికిని తెలియదు.

శోకగీతము

18. అస్సిరియా రాజా!

               నీ కాపరులు చచ్చిరి.

               నీ నాయకులు దీర్ఘనిద్ర చెందిరి.

               నీ ప్రజలు కొండలపై చెల్లాచెదరైరి.

               వారిని మరల ప్రోగుజేయువాడు ఎవడును లేడు.

19.          నీకు తగిలిన దెబ్బలకు మందులేదు.

               నీ గాయములు ఇక నయముకావు.

               నీ వినాశనము గూర్చి వినినవారెల్లరును

               సంతసముతో చప్పట్లు కొట్టుదురు.

               హద్దులేని నీ క్రూరత్వమునకు

               బలిగాని వారు ఎవరైనా ఉన్నారా?

Previous