11 1. నీ ధనమును వాణిజ్యమున వినియోగించి నచో అనతికాలముననే నీకు పెద్ద లాభము చేకూరును.1
2. నీ డబ్బును పలువిధములైన వర్తకములలో విని యోగింపుము. ఈ లోకమున ఎి్ట దురదృష్టము పట్టునో చెప్పలేము.
3. చెట్టు ఎటువైపు పడినను అది పడినచోటనే ఉండును. మేఘములు నీితో నిండియున్నపుడు వాన కురియును.
4. గాలివాటు కొరకు వేచియుండువాడు విత్తనము జల్లజాలడు.
వానకొరకు ఎదురు చూచువాడు పంటను సేకరింపలేడు.
5. తల్లిగర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తమును సృష్టించు ఆ దేవుని క్రియలను నీవెరుగవు.
6. ఉదయమున విత్తుము. సాయంకాలమునగూడ ఆ పనినే కొనసాగింపుము.
ఉదయము విత్తిన పైరే ఫలించునో, లేక సాయంకా లము విత్తిన పైరే ఫలించునో మనకు తెలియదు. రెండూ ఫలించినా ఫలింపవచ్చును.
వార్ధక్యము
7. వెలుతురు మనోజ్ఞమైనది. సూర్యుని చూచిన నేత్రములు ఆనందించును.
8. నరుడు చాలయేండ్లు జీవింపవచ్చును. అట్లు జీవించి నందుకుగాను సంతో షింపవచ్చునుగూడ. కాని అతడు గడపవలసిన అంధ కారపు రోజులు మాత్రము చాలయుండును. మనకు రానున్న భవిష్యత్కాలమంతయు నిరర్థకమైనది.
9. యువకుడా!
నీ యవ్వనమును అనుభవింపుము.
నీ యవ్వనకాలమును చూచి సంతసింపుము.
నీ మనస్సు కోరిన కోరికలు,
నీ కన్నులు వాంఛించిన వాంఛలు
తీర్చుకొనుము.
అయితే వీినన్నినిబ్టి
దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని
జ్ఞాపకము ఉంచుకొనుము.
10.నీ మనస్సునుండి విచారమును తొలగింపుము. నీ శరీరమునుండి బాధలను దూరము చేయుము.
ఎందుకనగా యవ్వనము, యుక్తప్రాయము దీర్ఘ కాలము నిలుచునవికావు.