యిర్మీయా శ్రమలు

పుస్తకపు చుట్ట

36 1. యోషీయా కుమారుడును, యూదా రాజు నగు యెహోయాకీము పరిపాలనాకాలము నాలుగవ యేట ప్రభువు నాకు తన వాక్కును వినిపించి, 2. ”నీవు పుస్తకపుచుట్టను తీసికొని యిస్రాయేలు యూదాలను గూర్చియు, అన్యజాతులను గూర్చియు నేను నీకు చెప్పినసంగతులెల్ల వ్రాయుము. యోషీయా కాలమున నేను మొదట నీతో మాటలాడినప్పినుండి నేివరకును నేను నీకు వినిపించిన విషయములనెల్ల లిఖింపుము.

3. యూదా ప్రజలు నేను వారి మీదికి పంపబోవు వినాశనముగూర్చి విని, ఒకవేళ తమ పాపకార్యముల నుండి వైదొలగవచ్చును. అపుడు నేను వారి దోషములను, పాపములను మన్నింతును” అని చెప్పెను.

4. కనుక నేను నేరీయా కుమారుడైన బారూకును పిలిపించి ప్రభువు నాకు చెప్పిన పలుకులెల్ల అతనికి వినిపించితిని. అతడు ఆ మాటలనెల్ల పుస్తకపుచుట్టలో వ్రాసెను.

5. నేనతనితో ఇట్లు చెప్పితిని: ”నేను ప్రభువు మందిరములోనికి పోకుండ వారిచే నిర్భందింపబడి తిని.

6. ప్రజలు ఉపవాసముచేయు దినమున నీవే అచికి పొమ్ము. అచట పుస్తకపు చుట్టనుండి పెద్దగా చదువుము. నీవు నా నోట విని పుస్తకమున వ్రాసిన ప్రభువు వాక్కులనెల్ల ప్రజలు విందురు. తమతమ నగరములనుండి వచ్చిన యూదా, ప్రజలెల్లరికిని వినపడునట్లుగా, నీవు ఆ వాక్కులను చదువుము.

7. ఒకవేళ వారు దేవునికి మొరపెట్టుకొని తమ దుష్కార్యములనుండి వైదొలగవచ్చును. ప్రభువు మహాగ్రహముతో తన ప్రజలను శిక్షింపబూనెను.”

8. బారూకు నేను చెప్పినట్లు చేసెను. మందిరమున పుస్తకపుచుట్టనుండి ప్రభువు వాక్కులను వినిపించెను.

9. అది యూదారాజగు యెహోయాకీము పరి పాలనాకాలము ఐదవయేడు, తొమ్మిదవనెల. యెరూషలేమువాసులును, యూదా నగరముల నుండి యెరూషలేమునకు వచ్చు ప్రజలును ప్రభువు అను గ్రహమును పొందుటకుగాను ఉపవాసము చేయవలె నని ప్రకటనము చేయించిరి.

10. యావే మందిర ములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యావే మందిరపు నూత్న ద్వారపు ప్రవేశమున ప్రజలెల్లరును వినుచుండగా, నేను చెప్పిన సంగతులెల్ల పుస్తకమునుండి బారూకు చదివి వినిపించెను.

11. షాఫాను మనుమడును గెమర్యా కుమారు డునైన మీకాయా, ఆ పుస్తకపుచుట్టనుండి బారూకు చదివిన వాక్కులెల్ల వినెను.

12. అతడు రాజప్రాసాద మునకుబోయి ఆస్థాన కార్యదర్శి గది ప్రవేశించెను. అపుడు అధికారులెల్లరు అచట సమావేశమైయుండిరి. ఆస్థాన కార్యదర్శియగు ఎలీషామా, షెమయా కుమారుడైన గేలాయా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇతర అధికారులు అచట నుండిరి. 

13. బారూకు ప్రజలకు పుస్తకమును చదివి విన్పించుచుండగా, తానాలించిన సంగతులెల్ల మీకాయా ఆ అధికారులకు తెలియజేసెను.

14. వారు, యెహూదిని బారూకు నొద్దకు పంపి, ”నీవు ప్రజలకు చదివి వినిపించిన పుస్తకపుచుట్టను మా యొద్దకు కొనిరమ్ము”అని చెప్పించిరి. ఈ యెహూది కూషీ మునిమనుమడు, షెలమ్యా మనుమడు, నెతన్యా కుమారుడు. బారూకు పుస్తకపుచుట్టను చేతబట్టుకొని వారి యొద్దకు వచ్చెను.

15. వారు ”ఓయి! నీవు కూర్చుండి ఆ పుస్తకము మాకు చదివి వినిపింపుము” అని అనగా, అతడు దానిని చదివి వినిపించెను.

16. వారు ఆ పుస్తకములోని మాటలను విని భయపడి ఒకరి మొగమొకరు చూచుకొని బారూకుతో ”మేము ఈ సంగతులను రాజునకు తెలియజేయవలయును” అనిరి.

17. అంతట వారు బారూకును జూచి ”నీవు ఈ సంగతులను ఎట్లు వ్రాసితివి? యిర్మీయా నీకు చెప్పెనా?” అని అడిగిరి.

18. బారూకు ”ఈ పలుకులెల్ల యిర్మీయా నాతో చెప్పెను. నేను వానిని సిరాతో పొత్తమున వ్రాసితిని” అని బదులు పలికెను.

19. వారతనితో ”నీవును, యిర్మీయాయు ఇచినుండి వెడలిపోయి దాగుకొ నుడు. మీరెక్కడనున్నది ఇతరులకు తెలియజేయకుడు” అని చెప్పిరి.

రాజు పుస్తకపుచుట్టను కాల్చివేయుట

20. ఆ అధికారులు పుస్తకపుచుట్టను రాజాస్థాన కార్యదర్శియగు ఎలీషామా గదిలోనుంచి రాజభవ నములోనికిపోయి రాజునకు అంతయు తెలియజేసిరి.

21. రాజు పుస్తకమును తెప్పించుటకు యెహూదిని పంపెను. అతడు ఎలీషామా గదినుండి గ్రంథమును తెచ్చి రాజునకును, అతని చుట్టును నిలుచుండియున్న అధికారులకును దానిని చదివివినిపించెను.

22. అది ఆ సంవత్సరపు తొమ్మిదవ మాసము, శీతకాలము కనుక రాజు శీతకాల భవనమున కుంపిముందు కూర్చుండియుండెను.

23. యెహూది మూడు నాలుగు పుటలు చదువగానే రాజు ఆ పుటలను చాకుతో కోసి కుంపిలోని నిప్పులో పడవేసెడివాడు. పుస్తకపు చుట్ట అంతయు కాలిపోవు వరకు అతడు అటులనే చేసెను.

24. ఆ సంగతులెల్ల వినిన పిదపకూడ రాజుగాని, అతని అధికారులుగాని భయపడలేదు. బట్టలు చించు కోలేదు. 25. ఎల్నాతానును, డెలాయాయును, గెమర్యాయును పుస్తకమును కాల్చివేయవలదని ప్రాధే యపడిరి. కాని రాజు వారి మాటలు వినలేదు.

26. అతడు యిర్మీయాను, యిర్మీయా లేఖికుడైన బారూకును బంధింపుడని రాజవంశజుడైన యెరాహ్మెయేలును, అస్రీయేలు కుమారుడైన సెరాయాను, అబ్దేలు కుమా రుడైన షెలెమ్యాను ఆజ్ఞాపించెను. కాని ప్రభువు వారిని దాచియుంచెను.

యిర్మీయా మరియొక

పుస్తకపుచుట్టను వ్రాయుట

27. నేను బారూకుచే వ్రాయించిన గ్రంథపు చుట్టను రాజు కాల్చివేసినపిదప ప్రభువు తన వాక్కు నిట్లు వినిపించెను: 28. ”నీవు మరియొక చుట్టను తీసికొని యెహోయాకీము కాల్చివేసిన మొది చుట్ట లోని మాటలన్నిని దీనిలో వ్రాయుము.

29. యెహోయాకీముతో నా పలుకులుగా ఇట్లు చెప్పుము: ”బబులోనియా రాజు వచ్చి ఈ దేశమును నాశనము చేసి అందలి నరులను, జంతువులను చంపివేయునని నీవేల వ్రాసితివని నీవు యిర్మీయాను ప్రశ్నించి గ్రంథపుచుట్టను కాల్చివేసితివి.”

30. కనుక ప్రభుడనైన నేను యూదారాజువగు నీతో ఇట్లు చెప్పుచున్నాను. నీ వంశజులెవ్వరును దావీదు రాజ్యమును పాలింపరు. నీ శవమును బయట పారవేయుదురు. అది పగలు ఎండకు ఎండును. రేయి మంచులో నానును.

31. నేను నిన్నును, నీ వంశజులను, నీ ఉద్యోగులను మీ దుష్కార్యములకుగాను శిక్షింతును. మీరు గాని, యెరూషలేము పౌరులు గాని, యూదా ప్రజలు గాని నా హెచ్చరికలను పాింపరైతిరి. కనుక నేను మీ మీదికి రప్పింతునన్న వినాశమును రప్పించి తీరుదును.”

32. అంతట యిర్మీయా మరియొక చుట్టను తీసికొని లేఖికుడగు బారూకునకిచ్చితిని. అతడు యెహోయాకీము కాల్చివేసిన గ్రంథములోని మాట లన్నింని యిర్మీయా నోిమాటను బ్టి మరల వ్రాసెను. ఆ పలుకులవింవి మరికొన్ని కూడ దానిలో చేర్చబడెను.