23 1.      నాకు తండ్రివియు,

                              నా జీవమునకు కర్తవైన ప్రభూ! 

                              నేను నా జిహ్వకు లోబడకుండునట్లును

                              అనుగ్రహింపుము.

2.           ఎవరైన నా తలపులకుగాను నన్ను దండించినచో

               విజ్ఞానము నా హృదయమునకు

               శిక్షణనిచ్చినచో, ఎంతబాగుండును!

               నేను తప్పుచేసినపుడు శిక్షననుభవింపవలెను.

               నా అపరాధములన్నికి దండనమును పొందవలెను

3.           అప్పుడు నా తప్పులు పెరిగి పోకుండును.

               నేను మితిమీరిపాపములు కట్టుకొనకుందును.

               అప్పుడు నేను నా విరోధులకు దొరికిపోకుందును.

               వారు నన్ను గేలిచేయకుందురు.

4.           నాకు తండ్రివియు, నా జీవమునకు దేవుడవునైన

               ప్రభూ! అహంకారము నుండి నన్ను కాపాడుము.

5.           నా హృదయమునుండి కామమును

               తొలగింపుము.

6.           నేను మోహమునకు లొంగిపోకుండునట్లును, సిగ్గుమాలి కామవికారమునకు

               లోబడకుండునట్లును కరుణింపుము.

ఒట్టుపెట్టుకొనుట

7.            బిడ్డలారా! మీ నోిని అదుపులో పెట్టుకోవలసిన

               తీరును వినుడు.

               నా ఉపదేశమును పాింతురేని మీరు మోసపోరు

8.           పాపాత్ముని, అతని పలుకులే ప్టియిచ్చును.

               నిందాగర్వములతో కూడిన

               అతని మాటలే అతనిని కూలద్రోయును.

9.           నీవు ఒట్టు పెట్టుకోవలదు.

               పరిశుద్ధుడైన ప్రభువు నామమును

               తేలికగా ఉచ్చరింపవలదు.

10.         మాిమాికి దండనమును అనుభవించు

               బానిసకు గాయములు తప్పనట్లే

               తేపతేపకు ప్రభువు పవిత్రనామముతో

               ప్రమాణము చేయువానికి పాపము తప్పదు.

11.           నిరతము ఒట్టు పెట్టుకొనువాడు మహాదుష్టుడు.

               అతని కుటుంబము శిక్షకు గురియగును.

               అతడు తాను చేసిన ప్రమాణమును తీర్పడేని

               పాపము కట్టుకొనును.

               తేలికగా ప్రమాణము చేసెనేని

               రెండింతలుగా పాపమును కట్టుకొనును.

               అబద్ధ ప్రమాణము చేసెనేని దోషపాత్రుడగును.

               అతని కుటుంబమునకు కడగండ్లుతప్పవు.

కామ సంభాషణలు

12.          మృత్యువుతో సమానమైన సంభాషణ వైఖరి కలదు

               యిస్రాయేలీయులలో ఎవడును

               దానికి పాల్పడకుండుగాక!

               భక్తులు ఆ పాపపంకమున కాలుపెట్టక,

               దానికి దూరముగా నుందురుగాక!

13.          అసభ్యమైన కామ సంభాషణలకు పాల్పడవలదు,

               అి్ట చెయిదము పాపమును తెచ్చిపెట్టును.

14.          నీవు ప్రముఖుల మధ్య కూర్చుండియున్నప్పుడు మైమరచి, నీ అవివేకమును చాటుకోవచ్చును.

               ఆ సంగతి విన్నచో నీ తల్లిదండ్రులు

               ఎంత బాధపడుదురో ఊహింపుము.

               అప్పుడు నీవు నీప్టుిన దినమును శపింతువు.

               నీవు పుట్టకుండనే ఉండిన బాగుండెడిదిగదా

               అని తలంతువు.

15.          అసభ్య  పలుకులకు అలవాటుపడినవాడు 

               తాను  జీవించియున్నంత కాలము

               ఆ దురభ్యాసమును సవరించుకోలేడు.

వ్యభిచారి

16.          రెండువర్గముల పాపులు

               తప్పులు కుప్పలుగా చేయుదురు.

               మూడవవర్గము పాపులు కూడ

               దేవుని శిక్షననుభవింతురు.

               కొలిమివలె మండెడు కామాగ్ని నెవరు చల్లార్పలేరు

               అది తననుతాను కాల్చివేసికొని ఆరిపోవలసినదే.

               కామవాంఛను తీర్చుకొనుటకు మాత్రమే

               జీవించునరుని,

               కడన ఆ కామాగ్నియే కాల్చివేయును.

17.          అి్టవాడు ప్రతి స్త్రీని కామించును.

               అతడు జీవించియున్నంతకాలము

               అతని కామవాంఛతీరదు.

18.          వివాహధర్మము మీరి వ్యభిచారమునకు

               పాల్పడువారు ”నన్నెవరు చూతురు?

               ఇది చీకివేళ, గోడలు అడ్డముగా ఉన్నవి.

               ఎవరును నన్ను గమనింపరు,

               నేను భయపడనేల? మహోన్నతుడైన ప్రభువు

               నా దోషమును ప్టించుకొనడు”  అని అనుకొనును

19.          నరులు తనను చూతురేమో అని మాత్రమే

               అతని భయము.

               కాని  ప్రభువు నేత్రములు సూర్యునికంటె

               పదివేలరెట్లు కాంతిమంతముగా ఉండుననియు

               అవి మనము చేయు ప్రతికార్యమును,

               మన రహస్యములన్నిని గమనించుననియు

               అతడు ఎరుగడు.

20.        జగత్తును సృజింపక పూర్వమే

               ప్రభువునకు అన్నియు తెలియును.

               సృష్టి ముగిసినపిదప

               ఆయనకు అన్నియు తెలియును

21.          కనుక ఆ పాపి తాను ఊహింపనపుడు పట్టువడి

               బహిరంగముగా శిక్షను అనుభవించును.

వ్యభిచారిణి

22.        భర్తకు ద్రోహము చేసి పరపురుషుని వలన

               బిడ్డను కనిన స్త్రీకిని పై శిక్షయే ప్రాప్తించును.

23.        ఆమె మొదితప్పు మహోన్నతుని

               శాసనమును మీరుట.

               రెండవ తప్పు తన పెనిమికి ద్రోహముచేయుట. మూడవతప్పు రంకులాడియై

               అన్యపురుషుని వలన బిడ్డను కనుట.

24.         ఆ పతితను సభ యెదుికి కొనివత్తురు.

               ఆమె పిల్లల పుట్టుపూర్వోత్తరములను

               విచారింతురు

25. ఆమె బిడ్డలను సమాజము గౌరవింపదు.

               వారు స్వీయకుటుంబములను నెలకొల్పుకొని 

               సంతానమును కనజాలరు.

26.        ఆ వనిత శాపగ్రస్తురాలగును.

               ఆ అపకీర్తి ఏనాికిని తొలిగిపోదు.

27.         ఆమె గతించిన తరువాత లోకులు దైవభీతి కంటే

               శ్రేష్ఠమైనది ఏదియును లేదని,

               దైవాజ్ఞలను పాించుటకంటే 

               మధురమైనది ఏదియును లేదని గుర్తింతురు.