అకియోరును శత్రువులకు అప్పగించుట
6 1. శిబిరమున గుమిగూడియున్న వారి కలకలము తగ్గిన పిదప, హోలోఫెర్నెసు విదేశసైనికులు అమ్మోనీ యులు వినుచుండగా అకియోరును మందలించెను.
2. ”ఓయి! నీవెవరివని అనుకొింవి? నీ వెంట వచ్చిన ఈ అమ్మోనీయులు వ్టి కూలివారు. నీవు మా యెదుట ఒక ప్రవక్తవలె మ్లాడుచున్నావు. మేము యిస్రాయేలీ యుల మీదికి యుద్ధమునకు పోగూడదనియు వారి దేవుడు వారిని సంరక్షించుననియు నీవు చెప్పుచున్నావు. అసలు నెబుకద్నెసరుగాక మరియొక దేవుడు కలడా? అతడు తన సైన్యములను పంపి ఈ యిస్రాయేలీ యులను భూమిమీది నుండి తుడిచివేయును. వారి దేవుడు వారినెంత మాత్రము కాపాడజాలడు.
3. మేము నెబుకద్నెసరు సేవకులము. మేము యిస్రాయేలు సైన్య ములను ఏకనరుని ఓడించినంత తేలికగా ఓడింతుము. వారెక్కడ ? మా అశ్వబలమును ఎదిరించుట ఎక్కడ?
4. మేము వారిని సర్వనాశనము చేయుదుము. వారి కొండలు వారి నెత్తుిలో తడిసిపోవును. వారి లోయలు వారి పీనుగులతో నిండును. యిస్రాయేలీయులు మమ్ము ఎదిరింపజాలరు. మేము వారిని అడపొడ కానరాకుండ తుడిచివేయుదుము. ఇది ప్రపంచాధి నేతయైన నెబుకద్నెసరు ఆజ్ఞ అనుకొనుము. ఆ రాజు పలికిన పలుకులు వ్యర్ధముకాబోదు.
5. ఓయి అకియోరు! నీవు అమ్మోనీయుల దేశమునుండి వచ్చిన కూలివాడవు, ద్రోహివి. ఐగుప్తునుండి పారిపోయివచ్చిన ఈ బానిసలను తెగార్చువరకు నేను నీ మొగము చూడను.
6. నేను వారిని శిక్షించివచ్చిన పిదప నా సైనికులు నిన్ను మట్టుపెట్టుదురు. హతులలో నీవు ఒకడివి అగుదువు. 7. నా సైనికులు ఇప్పుడు నిన్ను కొండలోనికి తీసికొనిపోయి యిస్రాయేలీయుల నగర ముచెంత విడనాడుదురు.
8. తరువాత ఆ ప్రజలతో పాటు నీవుకూడ మాచేతికి చిక్కిచత్తువు.
9. యిస్రాయేలీ యులు నా కత్తికి బలికారనియే నీవు తలంచెదవేని మరి ఇప్పుడు నీ మొగమింతగా చిన్నపోనేల? నేను నోరు విప్పి మ్లాడితిని. నేను పలికిన పలుకొక్కి వ్యర్ధము గాబోదని యెరుగుము” అనెను.
10. అంతట హోలోఫెర్నెసు సేవకులను పిలిచి అకియోరును బెతూలియాకు కొనిపోయి యిస్రాయేలీ యులకు అప్పగించిరండని ఆజ్ఞాపించెను.
11. ఆ సేవకులు అతనిని పట్టుకొని శిబిరము వెలుపలికి కొనిపోయిరి. అచినుండి అతనిని మైదానములగుండ నడిపించు కొనిపోయి కొండలను దాి బెతూలియా పట్టణము క్రింది భాగమున నున్న చెలమలను చేరు కొనిరి. 12. బెతూలియా నగరవాసులు వారి రాకను గమనించి ఆయుధములు చేప్టి కొండనెక్కిరి. ఒడి సెలలు కలవారు రాళ్ళు విసరిరి. కనుక హోలోఫెర్నెసు సైనికులు కొండమీదికి ఎక్కజాలరైరి.
13. వారు కొండ అంచును మరుగుచేసికొని అకియోరును త్రాళ్ళతో బంధించిపర్వతపాదముచెంతనేవదలిప్టిె వెళ్ళిపోయిరి.
14. యిస్రాయేలీయులు తమ పట్టణము నుండి క్రిందికి దిగివచ్చి అకియోరు బంధములనువిప్పిరి. అతనిని తమ నగరమునకు కొనిపోయి పట్టణాధి కారులకు చూపించిరి.
15. ఆ రోజులలో నగరాధి కారులు షిమ్యోను తెగకుచెందిన మీకా కుమారుడైన ఉజ్జీయా, గొతోనియేలు కుమారుడైన కాబ్రిసు, మెల్కియేలు కుమారుడైన కార్మిసు.
16. ఆ అధికారులు పట్టణ పెద్దలను పిలిపించిరి. స్త్రీలును, పిల్లలునుగూడ సభకు పరుగెత్తుకొని వచ్చిరి. అకియోరును సభ ఎదుికి కొనివచ్చిరి. ఉజ్జీయా అతనిని యేమి జరిగినదో చెప్పు మనెను.
17. అకియోరు హోలోఫెర్నెసు మంత్రాలోచన సభలో ఎవరేమి చెప్పినదియు, అస్సిరియా అధికారు లెదుట తాను స్వయముగా ఏమి చెప్పినదియు వివ రించెను. హోలోఫెర్నెసు యిస్రాయేలీయులను నాశ నము చేయుదునని ప్రజ్ఞలు పలికెననియు తెలియ చేసెను.
18. ఆ మాటలు విని యిస్రాయేలీయులు నేలమీద బోరగిలపడి ప్రభువునకు మ్రొక్కిరి.
19. వారు ”ఆకాశాధిపతివైన ప్రభూ! ఈ శత్రువులు కన్నుమిన్ను గానక నీప్రజలనెట్లు అవమానించుచున్నారో చూడుము. నీవు మమ్ము కరుణతో ఆదరింపుము. నీకు నివేది తుల మైన మాకు తోడ్పడుము” అని ప్రార్ధించిరి.
20. వారు అకియోరునకు ధైర్యము చెప్పిరి. అతనిని మెచ్చుకొనిరి.
21. సభ ముగిసిన తరువాత ఉజ్జీయా అకియోరును తన ఇంికి కొనిపోయెను. అతడు ఊరిపెద్దలకు విందు చేసెను. ఆ రాత్రియంతా వారు యిస్రాయేలు దేవుడైన ప్రభువును తమకు సహాయము చేయుమని మనవి చేసిరి.