1. జ్ఞాన సూక్తులు

విజ్ఞాన మర్మము

1 1.          సర్వవిజ్ఞానము ప్రభువు నుండి వచ్చును.

                              అది కలకాలము ఆయన చెంతనే ఉండును.

2.           సముద్రపు ఇసుక రేణువులను, వర్ష బిందువులను,

               అనంతకాలపు దినములను గణింపగల వాడెవడు? 

3.           ఆకాశము ఎత్తును, భూమి వైశాల్యమును,

               అగాధ విజ్ఞానముల లోతును

               తెలియగలవాడెవడు?

4.           అన్నికంటె ముందుగా ప్రభువు విజ్ఞానమును సృజించెను.

               కావున వివేకము ఎల్లవేళల ఉన్నదియే.

51.          ఆకాశమందలి దేవుని వాక్కే

               విజ్ఞానమునకు ఆధారము.

               శాశ్వతములైన ఆజ్ఞలు దానికి నిలయములు.

6.           విజ్ఞానపు జన్మస్థానము ఎవరికి తెలియును?

               దాని తెలివిని ఎవరు గ్రహింపగలరు?

7.            విజ్ఞానమునకు ఉండు తెలివిడిని ఎవరు

               అర్థము చేసికోగలరు?

               దానికి ఉన్న అనుభవమును

               ఎవరు గ్రహింపగలరు?

8.           జ్ఞానియైన వాడొక్కడే,

               ఆయన మహా భయంకరుడును,

               సింహాసనాసీనుడైన ప్రభువు.

9.           ఆయనే విజ్ఞానమును సృజించెను.

               దానిని పరిశీలించిచూచి

               దాని విలువను గ్రహించెను.

               తాను సృజించిన ప్రతివస్తువును

               విజ్ఞానముతో నింపెను.

10.         ప్రభువు ప్రతి నరునికి విజ్ఞానము నొసగెను.

               తనను ప్రేమించువారికి మాత్రము

               దానిని సమృద్ధిగా దయచేసెను.

దేవునిపట్ల భయభక్తులు

11.           ప్రభువు పట్ల భయభక్తులు గలవారికి

               గౌరవాదరములు,

               సంతోషసౌభాగ్యములు చేకూరును.

12.          దేవునిపట్ల భయభక్తులు కలవాని

               హృదయము సంతసించును.

               అతడు సుఖసంతోషములతో

               దీర్ఘకాలము జీవించును.

13.          అి్టవాడు  ప్రశాంతముగా  కన్ను మూయును.

               అతడు మరణించునపుడు

               ప్రభువు అతనిని దీవించును.

14.          ప్రభువుపట్ల భయభక్తులు చూపుట

               విజ్ఞానమునకు మొదిమెట్టు.

               భక్తులు మాతృగర్భమునుండియే

               విజ్ఞానమును పొందుదురు.

15.          ఆదిమ కాలమునుండియు విజ్ఞానము

               నరులతో వసించుచున్నది.

               భావితరమువారు కూడ దానిని నమ్మెదరు.

16.          దేవునిపట్ల భయభక్తులు చూపుటయే

               పరిపూర్ణవిజ్ఞానము.

               నరులు దాని ఫలములతో

               ఆనంద పరవశులగుదురు.

17. అది మన గృహములను, గాదెలను

               మనము కోరుకొనిన

               మంచి వస్తువులతో నింపును.

18. దేవునిపట్ల భయభక్తులు చూపుట

               విజ్ఞానమునకు కిరీటము.

               అది నరులకు శాంతిని,

               ఆరోగ్య భాగ్యములను దయచేయును.

19. ప్రభువు తెలివిని వివేచనమును

               నరులమీద క్రుమ్మరించును.

               అది తనను స్వీకరించు వారికి

               మహాగౌరవము చేకూర్చిపెట్టును.

20. దేవునిపట్ల భయభక్తులు చూపుట

               విజ్ఞానమునకు మూలము.

               దీర్ఘాయువు దాని కొమ్మలు.

21. దేవునిపట్ల భయభక్తులు చూపినచో

               పాపము తొలగిపోవును.

               కోపము మటుమాయమైపోవును.

ఓర్పు, సంయమనము

22. అనుచితమైన కోపము తగదు.

               అది కోపిష్ఠినే నాశనము చేయును.

23. సహనవంతుడు తగినసమయము కొరకు

               ఓపికతో వేచియుండును.

               కడన అతడు సంతోషము చెందును.

24. తగినకాలము వచ్చువరకు

               అతడు నోరు విప్పి మ్లాడడు.

               కనుక అతడి ఉచితవిజ్ఞతను ఎల్లరును

               మెచ్చుకొందురు.

విజ్ఞానము, దైవభక్తి

25. విజ్ఞానము, వివేకసూక్తులకు నిధి వింది,

               కాని పాపాత్ములకు  దైవభక్తి గిట్టదు.

26. నీవు విజ్ఞానమును ఆశింతువేని

               దైవాజ్ఞలను పాింపుము.

               అప్పుడు ప్రభువు దానిని నీకు సమృద్ధిగా

               దయచేయును.

27. దైవభయమే విజ్ఞానము, ఉపదేశము కూడ.

               విశ్వసనీయత, వినయము

               ప్రభువు మెచ్చెడి గుణములు.

28. నీవు దైవభీతిని విడనాడ వలదు.

               చిత్తశుద్ధిలేకుండ దేవుని పూజింప వలదు.

29. జనులముందు నటన చేయవలదు.

               నీ మాటలను అదుపులో ఉంచుకొనుము.

30.        అహంకారముతో విఱ్ఱవీగెదవేని కూలిపోయెదవు

               నగుబాట్లు కూడ తెచ్చుకొందువు.

               ప్రభువు నీ రహస్యములను వెల్లడిచేసి

               భక్తసమాజము ముందట

               నీకు తలవంపులు తెచ్చును.

               ఎందుకన, దైవభీతి లేనందున

               నీ హృదయము కపటముతో నిండెను.