ప్రభువు రెండవమారు సొలోమోనుకు సాక్షాత్కరించుట

9 1-2. సొలోమోను దేవాలయమును, ప్రాసాద మును, మిగిలిన భవనములను క్టి ముగించిన పిదప, గిబియోనున ప్రత్యక్షమైనట్లు యావే మరల రెండవసారి అతనికి ప్రత్యక్షమయ్యెను.

3. ప్రభువు అతనితో ”నేను నీ ప్రార్థన, విన్నపములను ఆల కించితిని. నన్ను సదా ఆరాధించుటకై నీవు నిర్మించిన ఈ దేవాలయమును పవిత్రముచేసితిని. నేను దీనిని నిత్యము ఆదరముతో చూచి సంరక్షించుచుందును.

4. నీ తండ్రి దావీదువలె నీవును పూర్ణహృదయముతో, చిత్తశుద్ధితో నన్ను కొలుచుచు నాకు విధేయుడవై నా ఆజ్ఞలను పాింతువేని.

5. ‘నీ వంశీయుడొకడు నిత్యము నీ సింహాసనముపై కూర్చుండి యిస్రాయేలీ యులను పరిపాలించును’ అని నేను పూర్వము నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టు కొందును.

6. కాని నీవుగాని, నీ అనుయాయులుగాని నన్ను విడనాడి నా ఆజ్ఞలనుమీరి అన్యదైవములను ఆరాధింతురేని, 7. యిస్రాయేలును నేనిచ్చిన ఈ నేల మీదనుండి తొలగింతును. నా ఆరాధనకుగాను నేను పవిత్రముచేసిన ఈ దేవాలయమునుకూడ విడనాడు దును. అపుడు జనులెల్లరు యిస్రాయేలునుచూచి నవ్విపోదురు. వారిని గడ్డిపోచతో సమానముగా చూతురు.

8. ఇక ఈ మహాదేవాలయమును చూచి, ఇటువైపు వచ్చు వారందరు ముక్కుపై వ్రేలిడుకొని ప్రభువు ఈ నేలకు, ఈ దేవళమునకు ఏమిగతి ప్టించెనో చూడుడని ఛీ కొట్టుదురు.

9. అప్పుడు చుట్టుపట్లనున్న వారు ‘ఈ ప్రజలు తమ పితరులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చిన ప్రభువును విడ నాడి అన్యదైవములను ఆశ్రయించి వారిని కొలిచిరి. కనుక ప్రభువు వీరిని ఈ రీతిగా శిక్షించెను’ అని పలుకుదురు” అనెను.

హీరాముతో పొత్తు

10. సొలోమోను దేవాలయమును, ప్రాసాదమును క్టి ముగించుటకు ఇరువదియేండ్లు పట్టెను.

11. తూరు దేశపు రాజగు హీరాము సొలోమోనునకు కావలసిన దేవదారు కలప, సరళవృక్షముల కలప, బంగారము సమకూర్చిపెట్టెను. సొలోమోను అతనికి గలిలీసీమలోని ఇరువది పట్టణములిచ్చెను.

12. హీరాము తూరు దేశమునుండి వచ్చి ఆ పట్టణములను పరిశీలింపగా అవి అతనికి నచ్చవయ్యెను.

13. అతడు సొలోమోనుతో ”తమ్ముడా! నాకెటువిం పట్టణములు ఇచ్చితివోయి!” అనెను. కావుననే ఆ ప్రాంతమును నేివరకు కాబూలు1 అని పిలుచుచున్నారు.

14. హీరాము సొలోమోనునకు పండ్రెండు బారువుల బంగారము పంపెను.

సొలోమోను భవననిర్మాణమునకు వ్టెిచాకిరి

15. సొలోమోను దేవాలయమును, రాజగృహ మును కట్టుటకు, పురప్రాకారమును నిర్మించుటకు, పట్టణమునకు తూర్పువైపుననున్న పల్లము పూడ్చుటకు అనగా మిల్లో నిర్మాణమునకు ప్రజలచేత వ్టెిచాకిరి చేయించెను. ఆ రీతిగానే హాసోరు, మెగిద్దో, గేసేరు పట్టణములను పునర్నిర్మాణము చేయుటకు జనులతో వ్టెిచాకిరి చేయించుకొనెను. (16. ఐగుప్తు రాజు ఫరో గేసేరును ముట్టడించి వశముచేసికొనెను. ఆ నగరమందు నివసించు కనానీయులను చంపి పట్టణ మును తగులబ్టెించెను. అతడు తన కుమార్తెను సొలోమోనుకిచ్చి పెండ్లిచేసినపుడు ఆ పట్టణమును ఆమెకు కానుకగా ఇచ్చెను. 17. సొలోమోను దానిని పునర్నిర్మాణము చేసెను.)

18. ఈ వ్టెిచాకిరితోనే అతడు దిగువనున్న బేత్‌హోరోనును, బాలాతును, యూదా ఎడారిలోని తడ్మోరు పట్టణమును క్టించెను.

19. అతడు భోజనపదార్ధములకై ఏర్పాటుచేసిన శాలలు, సైన్యములను నిలిపిన పట్టణములు, రథము లను గుఱ్ఱములనుంచిన పట్టణములు, యెరూష లేముననేమి, లెబానోనుననేమి, సామ్రాజ్యమందలి ఇతర ప్రాంతాలలోనేమి క్టించిన భవనములు వ్టెి చాకిరితోనే నిర్మింపబడెను.

20-21. అతడు కనాను మండలమందలి నానా జాతులవారిని ఈ వ్టెిచాకిరికి ఉపయోగించుకొనెను. యిస్రాయేలీయులు ఈ మండ లములను ఆక్రమించుకొనినప్పుడు అమోరీయులు, హిత్తీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీ యులు మొదలైన ఈ జాతులను పూర్తిగా నాశనము చేయలేకపోయిరి. వీరినే సొలోమోను వ్టెిచాకిరికి వాడుకొనెను. వీరి సంతతివారు నేికిని బానిసలుగనే బ్రతుకుచున్నారు.

22. సొలోమోను యిస్రాయేలీయుల చేత వ్టెిచాకిరి చేయించుకోలేదు. వారతనికి సైనికులు, అంగరక్షకులు, సైన్యాధిపతులు, రథాధిపతులు, ఆశ్వి కులుగా పనిచేసిరి.

23. సొలోమోనునకు వ్టెిచాకిరి చేయువారిమీద అయిదువందలయేబదిమంది పర్య వేక్షకులుండిరి.

24. ఐగుప్తురాజైన ఫరో కుమార్తె దావీదునగరమునువీడి సొలోమోను క్రొత్తగా నిర్మించిన భవనమున నివసించుట మొదలిడిన తరువాత అతడు నగరమునకు తూర్పువైపుననున్న పల్లమునుపూడ్చి మెరకగా జేసెను.

దేవాలయ సంరక్షణ

25. సొలోమోను తానునిర్మించిన బలిపీఠముపై ఏడాదికి మూడుసారులు దహనబలులు, సమాధాన బలులు సమర్పించెడివాడు. ప్రభువెదుట సాంబ్రాణి పొగ వేసెడివాడు. అతడు దేవాలయమును చక్కగా మరమ్మతు చేయించెడివాడు.

సొలోమోను వ్యాపారము

సొలోమోను నావలు

26. ఎదోముమండలమునందలి రెల్లుసముద్రము తీరముననున్న ఎలతు పట్టణము వద్దగల ఏసోన్గెబరు రేవునందు సొలోమోను నావలను నిర్మించెను.

27. సొలోమోను నావికులతో పనిచేయుటకై, హీరాము తన నావికులలో నేర్పరులను కొందరినిపంపెను.

28. ఈ నావికులు ఓఫీరు రేవువరకు సముద్ర యానము చేసి సొలోమోనునకు నలుబది రెండు బారువుల బంగారము తెచ్చియిచ్చిరి.