యెహూ చరిత్ర

ఎలీషా శిష్యుడు యెహూను అభిషేకించుట

9 1. ఎలీషా ఒక యువప్రవక్తను పిలిచి ”నీవు  ప్రయాణమునకు సన్నద్ధుడవై గిలాదునందలి రామోతు నకు పొమ్ము. ఈ తైలపాత్రముగూడ నీవెంట కొని పొమ్ము.

2. అక్కడకు వెళ్ళినపిదప నింషీ మనుమడు యెహోషాఫాత్తు కుమారుడునగు యెహూ ఎక్కడ నున్నాడో తెలిసికొనుము. అతనిని మిత్రుల మధ్యలో నుండి లేపి లోపలిగదిలోకి తోడ్కొనిపొమ్ము.

3. ఈ తైలమును అతని తలమీద పోసి ‘ప్రభువు నిన్ను యిస్రాయేలునకు రాజుగా అభిషేకించితినని సెల విచ్చుచున్నాడు’ అని చెప్పుము. వెంటనే నీవు తలుపు తెరచి శీఘ్రముగా పారిపొమ్ము” అని ఆదేశించెను.

4-5. ఆ యువకుడు రామోతుగిలాదు చేరుకొను నప్పికి సైన్యాధిపతులందరు ప్రోగై యుద్ధ విషయ ములు ముచ్చించుకొనుచుండిరి. అతడు ”సైన్యాధి పతీ! నీకొక సందేశము కొనివచ్చితిని” అనెను. యెహూ ”ఓయీ! నీ సందేశము మాలో ఎవరికి వినిపింప గోరెదవు?” అని ప్రశ్నించెను. అతడు ”నీకే” అని బదులు చెప్పెను.

6. యెహూ లేచి లోపలి గదిలోనికి వెళ్ళెను. అచట యువప్రవక్త యెహూ తలపై  తైలము పోసి, అతడు యెహూతో ”యిస్రాయేలు దేవుడైన యావేప్రభువు మాట ఇది. నేను నిన్నభిషేకించి నాప్రజ యిస్రాయేలునకు రాజుగా నియమించితిని.

7. నీవు నీ యజమానుడగు అహాబుని కుమారుని వధింప వలయును. యెసెబెలు నా ప్రవక్తలను నా సేవకులను చంపినందుకుగాను నేను ప్రతీకారము చేసితీరెదను.

8. కనుక అతని కుటుంబము అతని వంశజులందరు చావవలసినదే. అతని వంశీయులు, వారు బానిస లైనను, స్వేచ్ఛాపరులైనను, అందరును చావవలసినదే.

9. నెబాతు కుమారుడు యరోబాము కుటుంబము వలెను, అహీయా కుమారుడు బాషా కుటుంబము వలెను, అహాబు కుటుంబమునుకూడ వేరంట పెరికివేయుదును.

10. యెసెబెలు శవమును పాతి పెట్టువారుండరు. యెస్రెయేలు మండలమున కుక్కలు ఆమె శవమును తినును” అని పలికి వెంటనే తలుపు తెరిచి పారిపోయెను.

యెహూను రాజుగా ప్రకించుట

11. యెహూ సైన్యాధిపతుల వద్దకు రాగానే వారతనితో ”అందరు సురక్షితమేగదా. ఆ పిచ్చివానికి నీతో ఏమి పనికలిగినది?” అని అడిగిరి. యెహూ ”అతడెందుకు వచ్చెనో మీరెరుగుదురు గదా!” అనెను.

12. కాని వారు ”నీవు మాతో చతురాడవలదు. అతడు నీతో ఏమి చెప్పెనో తెలుపుము” అని అడిగిరి. యెహూ ”ప్రభువు నన్ను యిస్రాయేలునకు రాజుగా అభిషేకించెనని అతడు నాతో చెప్పెను” అనెను.

13. వెంటనే తోడిసైన్యాధిపతులు తమ వస్త్రములను యెహూ కాళ్ళముందట మెట్లపైన పరచిరి. బాకాలు ఊది యెహూ రాజయ్యెనని నినాదము చేసిరి.

యెహూ రాజ్యాధికారమును

కైవసము చేసికోబూనుట

14. యెహూ యెహోరామురాజు మీద కుట్ర పన్నెను. అప్పుడు యెహోరాము యెస్రెయేలున వసించుచుండెను. యెహోరామును, యిస్రాయేలీయు లందరును కలసి హసాయేలుతో పోరాడి రామోతును స్వాధీనము చేసుకొనుటకు వ్యూహము పన్నిరి.

15. అయితే యెహోరాము రామోతు వద్ద సిరియారాజు హసాయేలుతో జరిగిన పోరాటమున గాయపడి యెస్రెయేలున చికిత్స పొందుచుండెను. అపుడు యెహూ తోడి సైన్యాధిపతులతో ”మీరు నా పక్షమున చేరగోరుదురేని ఈ రామోతునుండి ఎవరుగాని వెళ్ళి ఇక్కడ జరిగిన సంగతులను యెస్రెయేలునందు తెలుప కుండునట్లు చూడుడు” అని ఆజ్ఞాపించెను.

16. వెంటనే అతడు రథమునెక్కి యెస్రెయేలునకు పయన మయ్యెను. అచట యెహోరామునకు గాయము ఇంకను మానలేదు. యూదారాజు అహస్యాకూడ ఆ సమయముననే యెహోరామును సందర్శింప వచ్చి యుండెను.

17. యెస్రెయేలున కోటబురుజుపైనున్న గస్తీ వాడు యెహూ సైన్యముతో వచ్చుట చూచి ఎవరో వచ్చుచున్నారని యెరిగించెను. యెహోరాము ఒక బంటును గుఱ్ఱముపై పంపి మనపక్షము వారి క్షేమము తెలిసికొనుడని ఆజ్ఞ యిచ్చెను.

18. వెంటనే ఒక ఆశ్వికుడు వెళ్ళి యెహూను కలసికొని ”మన పక్షము వారందరు సురక్షితముగా ఉన్నారా అని రాజు ప్రశ్నించుచున్నాడు” అని పలికెను. కాని యెహూ ”ఆ సంగతి నీకెందులకు? నీవుకూడ వెనుకకు  పోయి  సైన్యములో చేరుము” అని నుడివెను. కావలివాడు ”మన ఆశ్వికుడు వెళ్ళి వారిని కలసికొనెను గాని తిరిగి వచ్చుటలేదు” అని చెప్పెను.

19. రాజు మరియొక రౌతును పంపగా అతడును వెళ్ళి యెహూతో ”మన పక్షమువారందరు సురక్షితముగా ఉన్నారాయని రాజు ప్రశ్నించుచున్నాడు” అని పలికెను. యెహూ ”ఆ సంగతి నీకెందుకు? నీవు కూడ వెనుకతట్టు పోయి సైన్యములో చేరుము” అని పలికెను.

20. మరల కావలివాడు ”మన రౌతు వెళ్ళి వారిని కలిసికొనెను గాని తిరిగి వచ్చుటలేదు. ఆ వచ్చువారి నాయకుడు మన యెహూ వలె వెఱ్ఱెత్తినట్లు రథము తోలుచున్నాడు” అని చెప్పెను.

21. యెహోరాము రథము సిద్ధము చేయుడని ఆజ్ఞాపించెను. అతడును, అహస్యారాజును, తమతమ రథములనెక్కి యెహూను కలిసికొనుటకై వెళ్ళిరి. వారు నాబోతు పొలమున అతనిని కలిసికొనిరి.

యెహోరాము వధ

22. యెహోరాము ”మన వారందరికి కుశలమే కదా?” అని యెహూను ప్రశ్నించెను. యెహూ ”మీ అమ్మ యెసెబెలు ప్రారంభించిన జారత్వము, మంత్ర విద్య ఇంత విపరీతముగా వ్యాప్తిచెందుచుండగా ఇక మన వారికి కుశలమెక్కడిది?” అని బదులు పలికెను.

23. వెంటనే యెహోరాము రథముత్రిప్పి ”అహస్యా ! రాజద్రోహము, రాజద్రోహము!” అని అరచుచు పారిపోజొచ్చెను.

24. యెహూ విల్లెక్కుప్టిె సత్తువ కొలది యెహోరాము భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండా దూసుకొనిపోయెను. అతడు రథముమీదనే కూలి ప్రాణములువిడచెను.

25. యెహూ తన అంగరక్షకుడైన బిద్కరుతో ”అతని శవమును నాబోతు పొలమున పడవేయుము. ఒక మారు మనమిద్దరము ఇతని తండ్రి అహాబు వెనుక గుఱ్ఱముపై పోవుచుండగా ప్రభువు 26. ‘నిన్న నేను నాబోతు వధను అతని కుమారుల వధను కన్నులార జూచితిని. అందులకుగాను నిన్నుగూడ ఈ పొలము ననే శిక్షింతును” అని పలికెను. నీకు జ్ఞప్తియున్నదా? అది ప్రభువు వాక్కు. కనుక ఇప్పుడు యెహోరాము శవమును నాబోతు పొలమున పడవేయుము. ప్రభువు పలుకు నెరవేరితీరును” అని చెప్పెను.

అహస్యా వధ

27. యూదారాజు అహస్యా యెహోరాము చావునుచూచి భయపడి బేత్హగ్గాను మార్గము ప్టి పారిపోయెను. కాని యెహూ, అహస్యాను వెన్నాడి ”వీనిని కూడ వధింపుడు” అని ఆజ్ఞాపించెను. అహస్యా యీబ్లెయాము వద్ద మెరక మీదనున్న గూరు నగరము నకు పోవుమార్గమున రథము నడుపుచుండగా యెహూ సైనికులు అతనిని గాయపరిచిరి. అతడు మెగిద్దో వరకు పారిపోయి అచట ప్రాణములు విడిచెను.

28. రాజోద్యోగులు అతని శవమును రథము మీద యెరూషలేమునకు తీసికొనిపోయి దావీదునగరము నందు అతని పితరుల సమాధులలో అతనిని పాతి ప్టిెరి.

29. యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడు యెహోరాము పరిపాలనాకాలము పదు నొకండవఏడు యూదా సీమలో అహస్యా రాజయ్యెను.

యెసెబెలు వధ

30. యెహూ యెస్రెయేలు నగరమునకు తిరిగి వచ్చెను. యెసెబెలు యెహూ వచ్చెనని విని ముఖము నకు రంగుపూసుకొని, శిరోభూషణము ధరించి ప్రాసా దము కికీచెంత నిలుచుండి దారివైపు పారజూచు చుండెను. 31. అంతలో యెహూ ప్రాసాదద్వారము వద్దకు రాగా యెసెబెలు ”స్వామి హంతకుడా! సిమ్రీ వింవాడా! నీవు సమాధానముగా వచ్చుచున్నావా?” 4 అని ప్రశ్నించెను.

32. యెహూ కికీవైపు పారజూచి ”నా పక్షము చేరువారెవరు?” అని అడిగెను. రాజ ప్రాసాదరక్షకులలో ఇద్దరు ముగ్గురు నపుంసకులు అతనివైపు చూచిరి.

33. యెహూ ”దానిని క్రిందకు పడద్రోయుడు” అని అరచెను. వారు యెసెబెలును క్రిందకు పడద్రోసిరి. ఆమెనెత్తురు గోడమీదను గుఱ్ఱములమీదను చిందిపడెను. యెహూ తన రథము లను, గుఱ్ఱములను ఆమె శవముమీదుగా తోలెను.

34. అతడు ప్రాసాదమును ప్రవేశించి భోజనము చేసెను. అటుపిమ్మట సేవకులతో ”ఆ నికృష్టురాలిని కొనిపోయి పాతిపెట్టుడు. ఎంత దౌర్భాగ్యురాలైనను రాజపుత్రికగదా!” అనెను.

35. కాని సేవకులు పోయిచూడగా ఆమె శవమున కపాలమును, పాదములును, అరిచేతులునుతప్ప మరియేమియు కనపడలేదు.

36. ఆ వార్త విని యెహూ ”యెస్రెయేలు పొలమున కుక్కలు యెసెబెలు ప్రేతమును తిని వేయును.

37. ఆమె శరీరఅవశేషములను పొలమున పెంటవలె చల్లుదురు. వానినిచూచి ఆమె యెసెబెలు అని యెవరును గుర్తింపజాలరని ప్రభువు ఏలియా ప్రవక్తద్వారా పలికెనుగదా! ఇకనేమి ప్రభువు చెప్పినదంతయు జరిగినది” అని పలికెను.