కయీను – హేబెలు

1. ఆదాము తన భార్య ఏవను కూడెను. ఆమె గర్భవతియై కయీనును కనెను. ”దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను” అని ఆమె తలంచెను.

2. తరువాత ఆమె కయీను తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్టెలకాపరి. కయీను సేద్యగాడు.

3. కొంతకాలము గడచిన తరువాత కయీను పండినపంటలో కొంతపాలు దేవునికి కానుకగా కొనివచ్చెను.

4. హేబెలు కూడ మందలో ప్టుిన తొలిచూలు పిల్లలను, వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభువు హేబెలును, అతని కానుకను ప్రసన్నదృష్టితో చూచెను. 

5.కాని కయీను కానుకను త్రోసిపుచ్చెను. కావున కయీను మిక్కిలి కోపముతో ముఖము చిన్నబుచ్చుకొనెను.

6. ప్రభువు కయీనుతో ”నీకు కోపమేల? నీ ముఖము చిన్నబుచ్చుకొననేల?

7. మంచిపనులు చేసినచో తలయెత్తుకొని తిరుగగలవు. చెడుపని చేసినచో పాపమువచ్చి వాకిట పొంచియుండి నిన్ను మ్రింగజూచును. కాని నీవు దానిని అణగద్రొక్కవలెను.”4 అని అనెను.

8. ఒకనాడు కయీను తన సోదరుడు హేబెలుతో ”మనమిద్దరము పొలమునకు వెళ్ళుదము రమ్ము” అని అడిగెను. అక్కడికి వెళ్ళిన తరువాత కయీను హేబెలు మీదపడి అతనిని చంపెను.

9. ”నీ తమ్ముడు హేబెలు ఎక్కడ?” అని ప్రభువు కయీనును అడిగెను. దానికి కయీను ”నాకు తెలియదు. నేనేమైన వానికి కావలివాడనా?” అని ఎదురుచెప్పెను.

10. దానికి ప్రభువు ”అయ్యో! నీవెంత పనిచేసితివి? నీ తమ్ముని నెత్తురు నేలమీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది.

11. నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరుతెరచినది. ఈ భూమిపై నీవిక నిలువరాదు. నిన్ను శపించు చున్నాను.

12. నీ వెంత సాగుచేసినను ఈ నేలలో పంటలు పండవు. పారుబోతువై, దేశదిమ్మరివై బ్రతు కుము” అనెను. 13. కయీను ప్రభువుతో ”నేనింత శిక్ష భరింపజాలను.

14. ఈనాడు ఇక్కడనుండి నన్ను వెళ్ళగ్టొితివి. నేనిక నీ సన్నిధికి రాకుండ వెలివేయ బడి, పారుబోతునై దేశదిమ్మరినై తిరుగవలెను. ఎదురుపడినవాడు ఎవడో ఒకడు నా ప్రాణములు  తీయును” అని పలికెను.

15. అంతట ప్రభువు అతనితో ”కయీనును చంపినవాడు ఏడంతల దండన పాలగును.” అనెను. ఇట్లని దేవుడు కయీనునకు ఎదురుపడినవాడు ఎవడును అతనిని చంపకుండు టకు అతని ముఖమున ఒక గుర్తుంచెను.

16. కయీను ప్రభువు సముఖమునుండి వెడలి, ఏదెనుకు తూర్పుగా ఉన్న నోదు దేశములో నివసించెను.

కయీను సంతతి

17. కయీను తన భార్యను కూడెను. ఆమె గర్భవతియై హనోకును కనెను. అంతట కయీను ఒక నగరమును నిర్మించెను. ఆ నగరమునకు తన కుమారుని పేరు పెట్టెను.

18. హనోకునకు ఈరాదు పుట్టెను. ఈరాదునకు మహూయాయేలు జన్మించెను. మహూయాయేలునకు మతూషాయేలు, మతూషాయే లునకు లెమెకు ప్టుిరి.

19. ఆదా, సిల్లా అను పేర్లు గల స్త్రీలనిద్దరిని లెమెకు పెండ్లియాడెను.

20.ఆదా యాబాలును కనెను. ఈతడు గుడారములలో నివసించు పశువుల కాపరులకు మూలపురుషుడయ్యెను.

21.యాబాలు తమ్ముని పేరు యూబాలు. అతడు పిల్లనగ్రోవిని, సితారును మ్రోగించువారికి మూలపురుషుడు.

22.లెమెకు రెండవ భార్య సిల్లా తూబలుకయీనును కనెను. అతడు కాంస్య, ఇనుపవస్తువులను చేయనేర్పెడివాడు. తూబలుకయీను సోదరి పేరు నామా.

23. లెమెకు తన భార్యలతో ఇట్లనెను: ”ఆదా! సిల్లా! నా మాటలు వినుడు. లెమెకు  భార్యలారా! నా పలుకులు  ఆలింపుడు. నన్ను గాయపరచిన వానిని చంపివేసితిని. నన్ను క్టొిన పడుచువాని  ప్రాణములు  తీసితిని.

24. కయీనును చంపిన వానికి ఏడంతల శిక్ష. లెమెకును చంపినవారికి డెబ్బదియేడంతల దండనము.”

షేతు సంతతివారు

25. ఆదాము మరల తన భార్యను కూడెను. ఆమెకు ఒక కొడుకు పుట్టెను. ”కయీను చంపిన హేబెలునకు బదులుగా దేవుడు ఇంకొక కుమారుని నాకిచ్చెను” అని తలంచి ఆమె తన కొడుకునకు షేతు అను పేరు పెట్టెను.

26. షేతుకు కూడ ఒక కొడుకు పుట్టెను. అతని పేరు ఎనోషు. అతని నాినుండియే జనులు యావే నామమున దేవుని ఆరాధింప మొదలు పెట్టిరి.

Previous                                                                                                                                                                                                Next                                                                                     

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము