షెబారాణి సొలోమోనును సందర్శించుట
10 1. షెబారాణి సొలోమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కుప్రశ్నలతో పరీక్షింపవచ్చెను.
2. ఆమె చాలమంది సేవకులను వెంటనిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెలపైకి ఎక్కించుకొనివచ్చెను. రత్నములను, పెద్దమొత్తము బంగారమునుగూడ కొని వచ్చెను. రాణి సొలోమోనును కలిసికొని తాను అడగ గోరిన ప్రశ్నలన్నియు అడిగెను.
3. అతడు ఆమె ప్రశ్న లన్నికి జవాబుచెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలి యనిదేదియులేదు.
4-5. సొలోమోను విజ్ఞానము, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలలో భోజనము, అతనికి కొలువుచేయు ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, వారు తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షసారాయము అందించు సేవకులు, అతడు సమర్పించు దహనబలులను చూచుసరికి ఆమెకు నోటమాట రాలేదు.
6. ఆమె అతనితో ”నిన్నుగూర్చి, నీ విజ్ఞానముగూర్చి నేను మా దేశమున విన్నవార్తలెల్ల నిజములే.
7. కాని నేనిచికివచ్చి నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనను తెలుపలేదు. నీ విజ్ఞానమును, వైభవమును నేను వినినదానికంటెను ఎక్కువగానున్నవి.
8. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞానసూక్తులు ఆలకించుచున్న నీ జనులు, నీ సేవకులెంత అదృష్టవంతులో!
9. నిన్ను చల్లనిచూపు చూచి యిస్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడునుగాక! ప్రభువు యిస్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను. కనుకనే వారిని నీతి నియమములతో, న్యాయముతో పరిపాలించుటకు నిన్ను రాజునుచేసెను” అనెను.
10. షెబారాణి సొలోమోనునకు పండ్రెండు బారువుల బంగారము, సుగంధద్రవ్యములు, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుకచేసినన్ని సుగంధద్రవ్యము లను మరెవ్వరును సొలోమోనునకు ఇచ్చియుండలేదు.
11. హీరాము నావికులు ఓఫీరునుండి బంగారమునే గాక వారు అక్కడినుండి విస్తారమైన మంచి గంధపు చెక్క, రత్నములనుగూడ కొనివచ్చిరి.
12. సొలోమోను ఆ గంధపుకొయ్యతో దేవాలయమునకు, రాజనగరు నకు పైకప్పులను చేయించెను. మరియు దానితో సంగీతకారులకు పిల్లనగ్రోవులు, వీణలు చేయించెను. నేివరకు అటువిం చందనపుకొయ్య మరల ఇక్కడ కనిపింపలేదు.
13. సొలోమోను కూడ షెబారాణి కోరుకొనిన వస్తువులెల్ల ఆమెకు బహుమతిగా ఇచ్చెను. అతడు తన రాజవైభవమునకు తగినట్లుగా ఆమెకు కానుకలు ఇచ్చెను. అటుతరువాత రాణి తన సేవకు లతో షెబా రాజ్యమునకు వెడలిపోయెను.
సొలోమోను సిరిసంపదలు
14. సొలోమోనునకు ఏటేా ఇంచుమించు అరువదిఆరు బారువుల బంగారము లభించెడిది.
15. వర్తకులమీద విధించిన కప్పములనుండి, వర్తకుల నుండి, అరేబియా రాజునుండి, రాష్ట్రపాలకులనుండి లభించిన బంగారము ఈ లెక్కలో చేరలేదు.
16. అతడు సుత్తితోక్టొిన బంగారముతో రెండువందల పెద్దడాలులను చేయించెను. వానికి ఒక్కొక్కదానికి ఆరువందల తులముల బంగారమువాడెను.
17. సుత్తితో క్టొిన బంగారముతోనే మూడు వందల చిన్న డాలులనుగూడ చేయించెను. వానికి ఒక్కొక్కదానికి నూటఏబది తులముల బంగారమువాడెను. వాని నన్నిని ”లెబానోను అరణ్యము” అను పేరుగల మందిరమున నుంచెను.
18. అతడు దంతముతో సింహాసనము చేయించి దానిని మేలిమి బంగారమున పొదిగించెను.
19-20. ఈ సింహాసనమునకు ఆరుమెట్లు కలవు. ఒక్కొక్క మెట్టునకు రెండు సింహ ముల చొప్పున మొత్తము పండ్రెండు సింహముల బొమ్మలు కలవు. సింహాసనమునకు వెనుకతట్టున ఎద్దుతలను చెక్కించెను. సింహాసనము రెండు చేతులకు ప్రక్క రెండు సింహముల బొమ్మలు కలవు. ఏ రాజు ఇటువిం సింహాసనము చేయించి ఎరుగడు.
21. సొలోమోను పానపాత్రములన్నియు, ‘లెబా నోను అరణ్యము’ అనుపేరుగల మందిరములోని పాత్ర ములన్నియు మేలిమిబంగారముతోనే చేయబడెను. సొలోమోను కాలమున వెండికి విలువలేదు గనుక దానితో అతడు వాడిన పాత్రలలో దేనినిచేయరైరి.
22. సొలోమోనునకు నావలు గలవు. అవి హీరాము నావలతోపాటు సముద్ర యానము చేసెడివి. ప్రతి మూడేండ్లకొకసారి అతని ఓడలు వెండిబంగారములతో, దంతములతో, రకరకముల మర్కటములు, నెమళ్ళతో తిరిగివచ్చెడివి.
23. విజ్ఞానముననేమి, వైభవమున నేమి సొలోమోను ఈ నేలను పాలించిన రాజులలోకెల్ల గొప్పవాడు.
24. ప్రభువు అతనికి అనుగ్రహించిన విజ్ఞానసూక్తులను వినుటకై ప్రపంచములోని జనులెల్లరు వచ్చెడివారు.
25. అతనిని చూడవచ్చినవారు వెండి బంగారువస్తువులను, ఆయుధములను, సుగంధ ద్రవ్యములను, గుఱ్ఱములను, గాడిదలను బహుమతు లుగా కొనివచ్చిరి. ఏటేట ఇట్లే జరుగుచుండెడిది.
సొలోమోను రథములు
26. సొలోమోనునకు గొప్పరథబలమును గలదు. అతడు పదునాలుగు వందల రథములను తయారు చేయించెను. పండ్రెండువేల గుఱ్ఱములను సంపా దించెను. వానిలో కొన్నిని రథనగరములందు నిలిపి యుంచెను. కొన్నిని యెరూషలేముననే ఉంచెను.
27. అతనికాలమున యెరూషలేమున వెండి రాళ్ళవలె లభించెడిది. దేవదారుకొయ్య సాదా మేడికఱ్ఱవలె దొరకెడిది.
28. ఐగుప్తునుండి, సిలీష్యా నుండి అతనికి గుఱ్ఱములను కొనితెచ్చెడివారు. అతని ఉద్యోగులు సిలీష్యా నుండి నిర్ణీతమూల్యమునకు గుఱ్ఱములు కొని పంపెడివారు.
29. ఆ కాలమున ఐగుప్తునుండి దిగుమతి చేయబడిన రథములకు ఒక్కొక్కదానికి ఆరు వందల వెండినాణెములు, గుఱ్ఱములకు ఒక్కొక్కదానికి నూటయేబది వెండినాణెములు చెల్లించిరి. ఇట్లు దిగుమతియైన గుఱ్ఱములను రాజోద్యోగులు మరల హిత్తీయరాజులకు, సిరియా రాజులకు అమ్మెడివారు.