1. అంతట దేవుడు మోషేతో ”ఇదిగో! చూడుము, నేను నిన్ను ఫరోరాజునకు దేవునివిం వానినిగా నియమించితిని. నీ సోదరుడు అహరోను నీకు ప్రవక్తగా ఉండును.

2. నేను పలుకుమని నీతో చెప్పినదెల్ల నీవు నీ సోదరుడగు అహరోనుతో చెప్పుము. అతడు ఆ మాటలను ఫరోతో చెప్పి యిస్రాయేలీయులను ఐగుప్తుదేశమునుండి పంపివేయుమని అడుగును. కాని నేను ఫరో హృదయమును కఠినపరతును.

3. అప్పుడు నేను ఐగుప్తుదేశములో అనేక సూచకక్రియలను చూపి, మహత్తరకార్యములను చేయుదును.

4. ఫరో నీ మాట వినడు. నేను ఐగుప్తుదేశముపై నా బలమును చూపుదును. ఆ దేశీయులను నిశ్చయముగా శిక్షించి, నా సేనలును, ప్రజలును అయిన యిస్రాయేలీయు లను ఐగుప్తుదేశమునుండి తోడ్కొనివచ్చెదను. 5. ఐగుప్తుదేశముపై నా బలమును చూపి యిస్రాయేలీ యులను వెలుపలకు తోడ్కొనివచ్చినపుడు ఆ దేశీ యులు నేనే ప్రభుడనని తెలిసికొందురు” అనెను.

6. మోషే అహరోనులు ప్రభువుమాట తల దాల్చి ఆయన ఆనతిచ్చినట్లేచేసిరి.

7. ఫరోరాజుతో సంభాషించు నాికి మోషే వయస్సు ఎనుబది యేండ్లు. అహరోను వయస్సు ఎనుబది మూడేండ్లు.

ఐగుప్తుదేశమున అరిష్టములు- పాస్క కఱ్ఱ పామగుట

8. ప్రభువు మోషే అహరోనులతో మ్లాడుచు, 9. ”ఏదీ! మీ అద్భుతశక్తి చూపుడని ఫరో మిమ్మును అడిగినయెడల, మోషే! నీవు అహరోనుతో ‘నీ కఱ్ఱను తీసికొని ఫరోముందు పడవేయుము. అది పాము అగును’ అని చెప్పవలయును” అని పలికెను.

10. అంతట మోషే అహరోనులు ఫరోరాజు దగ్గరకు వెళ్ళి ప్రభువు ఆనతిచ్చినట్లుగా చేసిరి. అహరోను ఫరో ముందు, అతని కొలువువారిముందు కఱ్ఱను పడ వేసెను. అది పాముగామారెను.

11. ఇది చూచిన ఫరోరాజు ఐగుప్తునందలి విజ్ఞానులను, మాంత్రికులను పిలిచెను. వారుకూడ తమ మంత్రములచేత ఆ విధముగనే చేసిరి.

12. వారిలో ప్రతివాడు తన కఱ్ఱను విసరివేసెను. అది పాముగా  మారెను.  కాని అహరోను కఱ్ఱ వారి కర్రలన్నింని మ్రింగివేసెను.

13. అయినప్పికి ఫరోరాజు కఠినచిత్తుడుగనే ఉండెను. ప్రభువు ముందుచెప్పినట్లుగనే మోషే అహరోనుల మాటలు అతని చెవికి ఎక్కలేదు.

మొది అరిష్టము: నీరు నెత్తురుగా మారుట

14. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లనెను. ”ఫరోరాజు కఠినహృదయుడుగనే ఉన్నాడు. ప్రజను పోనిచ్చుటకు అంగీకరింపకున్నాడు.

15. ఉదయము ననే అతడు నైలునదికి వెళ్ళునపుడు నీవును అతనితో పాటు వెళ్ళుము. ఏి ఒడ్డున అతనికొరకు వేచి యుండుము. నీవు వెళ్ళునపుడు అంతకుముందు పాముగా మారిన కఱ్ఱనుగూడ కొనిపొమ్ము.

16. పోయి అతనితో ‘హెబ్రీయుల దేవుడైన యావే, అరణ్య ములో నన్ను ఆరాధించ నా ప్రజలను పోనిమ్ము’ అని నీతో చెప్పుటకు నన్ను పంపెను. కాని ఇంతవరకు నీవు ఆయన మాటలు వినలేదు.

17. కావున ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: ఇక దీనిని బ్టియైన నేను యావేనని నీవు గుర్తింతువు సుమా! నా చేతిలో ఉన్న ఈ కఱ్ఱతో నైలునది నీిని కొట్టెదను. అది నెత్తురుగా మారును.

18. ఏిలోని చేపలన్నియు చచ్చును. నది అంతయు కంపుకొట్టును. నైలునదినీరు త్రాగుటకు ఐగుప్తుదేశీయులు ఏవగించుకొందురు.”

19. ప్రభువు మోషేతో ”నీవు అహరోనుతో ‘నీ కఱ్ఱను చేప్టి ఐగుప్తుదేశమునందలి జలములు అన్నిం మీదికి అనగా నదులు, వాగులు, చెరువులు, ఊటగుంటల మీదికి చేయిచాపుము. వానిలోని నీరెల్ల నెత్తురుగా మారును. చివరకు తొట్టులలోను, కుండలలోను ఉన్న నీరు కూడ నెత్తురగును’ అని చెప్పుము” అని పలికెను.

20. మోషే, అహరోనులు ప్రభువు ఆజ్ఞాపించి నట్లే చేసిరి. ఫరోరాజు అతని కొలువువారు చూచు చుండగనే అహరోను కఱ్ఱనెత్తి నైలు నది నీిని కొట్టెను. నది నీరంతయు నెత్తురయ్యెను.

21. నదిలోని చేప లన్నియు చచ్చెను. అది కంపు కొట్టెను. ఐగుప్తు దేశీయులు నైలునది నీిని త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతట నెత్తురు కనిపించెను.

22. కాని ఐగుప్తుదేశీయులైన మాంత్రికులుకూడ తమ మంత్ర బలముచే ఆ అద్భుతకార్యమును చేసిరి. అందుచేత ప్రభువు ముందు చెప్పినట్లుగానే ఫరోరాజు యొక్క హృదయము కఠినము అయ్యెను. అతడు మోషే అహరోనులు చెప్పిన మాటలు వినలేదు.

23. ఫరోరాజు ఈ అద్భుతకార్యమునుగూడ లెక్కచేయక తన సౌధము నకు తిరిగివెళ్ళెను.

24. అంతట ఐగుప్తు దేశీయులు మంచినీికై ఏి ఒడ్డుపొడవున గుంటలు త్రవ్విరి. వారు నైలునదిలోని నీిని త్రాగలేకపోయిరి.

25. యావే నైలునది నీిని కఱ్ఱతో క్టొిన తరువాత ఏడు రోజులు గడిచెను.

Previous                                                                                                                                                                                                Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము