యూదితు, హోలోఫెర్నెసు శిబిరమునకు పోవుట
10 1-2. యూదితు పైరీతిగ యిస్రాయేలు దేవునికి ప్రార్ధనచేసి ముగించిన పిదప నేలమీదినుండి లేచి తన దాసిని పిలిపించెను. ఆమె విశ్రాంతి దినము లందును, ఉత్సవ దినములందును తాను వాడుకొను గదిలోనికి వెళ్ళెను.
3.అచటతానుతాల్చియున్నగోనెను విధవవస్త్రములను తొలగించెను. స్నానము చేసి విలు వగల అత్తరులు పూసికొనెను. శిరోజములను చక్కగా దువ్వుకొని ఒక ప్టీతో కట్టుకొనెను. తన భర్త మనష్షే జీవించియున్నపుడు తాను ఉత్సవసమయములలో ధరించు సొగసైన ఉడుపులను తాల్చెను.
4. కాళ్ళకు చెప్పులు తొడుగుకొనెను. దండలు, గాజులు, ఉంగర ములు, కమ్మలు మొదలైన సొమ్ములు పెట్టుకొనెను. ఆ అలంకరణముల వలన చూపరులకు మిగుల సుందరముగా కన్పించెను. ఆమెను చూచిన వారికి ఎవరికైన ఆమెమీద మనసుపోకమానదు.
5. యూదితు ద్రాక్షసారాయము పోసిన తోలుతిత్తిని, చమురుతో నింపిన కూజాను దాసిచేతికిచ్చెను. ఇంకను ఆమె వేయించిన యవధాన్యమును, ఎండిన అత్తిపండ్లతో చేసిన మోదకములను, శుద్ధిని పాించి తయారుచేసిన రొట్టెలను ఒక సంచిలో పెట్టెను. ఆ వస్తువులనన్నింని జాగ్రత్తగా మూటక్టి దాసిచేతి కిచ్చెను.
6. యూదితు, ఆమెదాసియు తమ ఇంిని విడిచి నగరద్వారము చెంతకు వచ్చిరి. అచట ఉజ్జీయా మరియు నగరనాయకులగు కాబ్రిసు, కార్మిసు ద్వార మునకు కావలి కాయుచుండిరి.
7. వారు క్రొత్త వస్త్రములు తాల్చి చక్కగ అలంకరించుకొని వచ్చిన యూదితు సౌందర్య మును చూచి ముగ్ధులైరి. 8. వారు ఆమెతో ”అమ్మా! మన పితరుల దేవుడైన ప్రభువు నిన్ను దీవించి నీ యత్నమును సఫలము చేయునుగాక! నీవు యిస్రా యేలీయులకు గౌరవమును, యెరూషలేమునకు కీర్తిని చేకూర్చిపెట్టుదువు గాక!” అని అనిరి.
9. ఆ మాట లకు యూదితు శిరమువంచి దేవునికి నమస్కారము చేసెను. ఆమె వారితో ”ద్వారముతెరచి నన్ను బయికి పోనిండు. నేను మీ కోరికలను సాధించి తిరిగివత్తును” అనెను. ఆ నాయకులు, యువకులను ద్వారము తెరువ ఆజ్ఞాపించిరి.
10. యూదితు, ఆమెదాసియు నగరము నుదాి వెడలిపోయిరి. ఆమె కొండను దిగి లోయను దాి వెళ్ళిపోవుచుండగా పురజనులు ఆమెవైపే చూచు చుండిరి. అటు తరువాత యూదితు వారికింకి కన్పింప దయ్యెను.
11-12. ఆ స్త్రీలు లోయగుండ నడచు చుండగా అచటవిడిది చేయుచున్న సైనిక బృందము వారిని ఆపెను. వారు యూదితును ”నీవే జాతిదానవు? ఎచినుండి వచ్చుచున్నావు? ఎచికి వెళ్ళుచు న్నావు?” అని యడిగిరి. ఆమె నేను హెబ్రీయుల ఆడు పడుచును. మా ప్రజలు మీ చేతికి చిక్కి నాశనమ గుదురు. కనుక నేను మా జనులనుండి పారిపోవు చున్నాను.
13. నేను మీ సేనాధిపతి హోలోఫెర్నెసు నొద్దకు వెళ్లి అతనికి విశ్వసనీయమైన సమాచారము కొంత విన్పింపవలయును. అతడు తన సైనికులలో ఒక్కనిని గూడ కోల్పోకుండనే ఈ పర్వతసీమనంతిని జయించు మార్గమును చూపింతును” అని చెప్పెను.
14. ఆ సైనికులు యూదితు పలుకులాలించుచు ఆమె సౌందర్యమును చూచి విస్మితులైరి.
15. వారు ”నీవు స్వయముగ మా సైన్యాధిపతిని చూడవచ్చితివి కనుక నీ ప్రాణములు దక్కినవి. మా సైనికులు కొందరు నిన్ను సైన్యాధిపతి గుడారమునకు తీసికొనిపోవుదురు.
16. నీవు అతనిని చూచి భయపడనక్కరలేదు. నీవు మాతో చెప్పిన విషయములనే అతనికి చెప్పుము. అతడు నిన్ను తప్పక ఆదరించును” అనిరి.
17. అంతటవారు నూరుగురు సైనికులను పిలిచి యూదితు ను, ఆమె దాసిని హోలోఫెర్నెసు గుడారమునకు తీసికొ నిపొండని ఆజ్ఞాపించిరి.
18. యూదితు వచ్చినదన్న వార్త శిబిరమంతట ప్రాకిపోయెను. ఆమెను చూచుట కుగాను సైనికులు గుడారములనుండి గబగబవచ్చు చుండిరి. ఆమె హోలోఫెర్నెసు గుడారము దాపున నిలుచుండి అతని దర్శనము కొరకు వేచియుండెను. అంతలో చాల మంది సైనికులువచ్చి ఆమె చుట్టును మూగిరి.
19. వారామె సౌందర్యమునకు పరవశులై యిస్రాయేలీయులు ఎి్టవారోయని ఆశ్చర్యపడ జొచ్చిరి. ”ఇంతి అందగత్తెలు కల జాతిని మనము అలక్ష్యము చేయుటయెట్లు? మనము వారిలో ఒక్కరిని మిగుల నీయక అందరిని మట్టుపెట్టవలెను. లేదేని వారు లోక మంత ిని లొంగదీసికొందురు” అని తమలో తాము గుసగుసలాడుకొనిరి.
20. అంతట హోలోఫెర్నెసు అంగరక్షకులు, సేవ కులు వచ్చి యూదితును అతని గుడారమునకు కొనిపోయిరి. 21.అప్పుడు హోలోఫెర్నెసు పాన్పుపై విశ్రమించియుండెను. దానిమీద ఒక తెర వ్రేలాడు చుండెను. ఆ తెరను పట్టుతోను, బంగారు పోగుల తోనునేసి పచ్చలతోను, విలువగలరత్నములతోను అలంకరించి యుండిరి.
22. సేవకులు యూదితు వచ్చినదని తెలియజేయగా అతడు పడకమీదినుండి లేచి గుడారము వెలుపలకి వచ్చెను. బంటులు అతని ముందట వెండిదివిీలు ప్టిరి.
23. యూదితు వారెదుికి రాగా హోలోఫెర్నెసును, అతని సేవకులును ఆమె సౌందర్యమును చూచి నిశ్చేష్టులైరి. ఆమె సాష్టాంగ పడి హోలోఫెర్నెసుకు నమస్కారము చేసెను. అతని బంటులు ఆమెనుపైకి లేవనెత్తిరి.