ఐగుప్తురాజు అను మకరము
32 1. అంతట పండ్రెండవయేడు, పండ్రెండవనెల మొదిరోజున ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నరపుత్రుడా! నీవు ఐగుప్తు రాజుమీద శోకగీతమును వినిపింపుము. అతనితో ఇట్లు చెప్పుము:
నీవు జాతులలో సింగమువలె ఉన్నావు.
కాని నీవు నదిలో నీిని ఎగజిమ్ము
మకరమవు మాత్రమే.
నీవు నీ కాళ్ళతో నీిని కలుషితము చేసి
నదులను పాడుచేయుచున్నావు.
3. నా జాతి ప్రజలు ఏకమై వచ్చినపుడు
నేను వలవేసి నిన్ను పట్టుకొందును.
వారు నిన్ను ఒడ్డునకు లాగుదురు.
4. నేను నిన్ను నేలపై పడవేయుదును.
నిన్ను పీకుకొని తినుటకుగాను
సకల పకక్షులను, వన్యమృగములను కొనివత్తును.
5. నేను కొండలను నీ శవముతో కప్పుదును. లోయలను మురిగిన నీ మాంసముతో నింపుదును
6. నీ నెత్తుిని నీ దేశముపై క్రుమ్మరింతును.
అది కొండలను తడిపి వాగులను నింపును.
7. నేను నిన్ను సంహరించినపుడు
ఆకాశమును కప్పివేసి తారలను నిర్మూలింతును.
సూర్యుని మేఘములు ఆవరించును.
చంద్రుడు కాంతినీయడు.
8. నేను ఆకాశజ్యోతులన్నింని ఆర్పివేసి,
నీ దేశమును తమోమయము చేయుదును.
ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.
9. నేను నీవెరుగని దేశములలో నీ మరణ వార్తను విన్పింపగా, బహుజాతులు గగ్గోలుపడును. నేను నీకు ప్టించిన దుర్గతిచూసి బహుజాతులు భీతిల్లును.
10. నా ఖడ్గమును వారిమీద ఝళిపించె దను. నిన్నుబ్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులు నిన్నుబ్టి భీతిల్లుదురు. నీ పతనదినమున వారందరు ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.
11. యావే ప్రభువుపలుకిది: నీవు బబులోనియా రాజు ఖడ్గమునకు బలియగుదువు.
12. క్రూరజాతుల సైనికులు నీ ప్రజలమీద కత్తులుదూసి, వారిని హత మార్చునట్లు నేను చేయుదును. నీ ప్రజలును, నీకు గర్వకారణమైన సమస్త వస్తువులును నాశనమగును.
13. నేను నీి ఒడ్డులందు నీ పశువులను వధింతును. ఆ మీదట పశువులు కాని, నరులుకాని తమ కాళ్ళతో నీిని మురికి చేయజాలరు.
14. నీ నీళ్ళు తేరుకొని స్వచ్ఛమగును. నీ నదులు నూనెపారినట్లుగా నెమ్మదిగా పారును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.
15. నేను ఐగుప్తును ఎడారిచేసి దానిలోని నరుల నెల్ల నాశనము చేయునపుడు వారు నేను ప్రభుడనని గ్రహింతురు.
16. ఈ హెచ్చరిక విలాపగీతమగును. నానా జాతుల స్త్రీలు ఈ గీతమును ఆలపించుచు ఐగుప్తుకొరకును, దాని ప్రజల కొరకును విలపింతురు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”
పాతాళలోకమునకు పోవువారు
17. అంతట పండ్రెండవయేడు, మొదినెల పదునైదవదినమున ప్రభువువాణి నాతో ఇట్లనెను: 18. ”నరపుత్రుడా! ఐగుప్తులోని జనబాహుళ్యము మీద శోకగీతమును ఆలపింపుము. బలాఢ్యులైన ఇతర జాతి ప్రజలతోపాటు వారినికూడ పాతాళమునకు పంపుము.
19. నీవు ఐగుప్తీయులతో ఇట్లనుము:
‘మీరు ఇతరులకంటె
సుందరమూర్తులమని ఎంచితిరా?
మీరు పాతాళలోకమునకు పోయి
సున్నతినొందనివారి ప్రక్కన పవ్వళింపుడు.’
20. పోరున చచ్చిన వారితోపాటు ఐగుప్తీయు లును కూలుదురు. ఒక ఖడ్గము వారినందరిని మట్టు పెట్టును. 21. మహావీరులును, ఐగుప్తుతరపున పోరాడిన యోధులును ఐగుప్తీయులను మృతలోకమునకు ఆహ్వా నించుచు ”పోరున మడిసిన సున్నతినొందనివారును ఇచికి దిగివచ్చి ఈ తావున పవ్వళించిరి” అని పలుకుదురు.
22. అస్సిరియా ఆ పాతాళలోకమున ఉన్నది. దాని సైనికుల సమాధులు దానిచుట్టును కలవు. వారందరును యుద్ధమున చనిపోయిరి. వారి సమా ధులు పాతాళలోకమున లోతైన తావున ఉన్నవి.
23. అస్సిరియా సైనికులెల్లరును యుద్ధమున చనిపోయిరి. వారి సమాధులు అస్సిరియా గోరీ ప్రక్కనే ఉన్నవి. కాని పూర్వము వారు సజీవుల లోకమును గడగడ లాడించిరి.
24. ఏలాము అచట ఉన్నది. దాని సైనికుల సమాధులు దానిచుట్టును ఉన్నవి. వారెల్లరును పోరున మడిసిరి. సున్నతినొందని వారై మృతలోకమును చేరుకొనిరి. వారు బ్రతికి ఉన్నపుడు ఎల్లెడల భీతిని ప్టుించిరి. కాని ఇపుడు మృతులై అవమానము చెంది యున్నారు.
25. ఏలాము పోరున కూలిన వారి ప్రక్కన పండుకొని ఉన్నది. దాని సైనికుల సమాధులు దాని చుట్టునున్నవి. వారెల్లరును పోరున మడిసిన సున్నతిలేనివారు. వారు బ్రతికిఉండగా భీతిని ప్టుించిరి. కాని ఇప్పుడు మృతులై అవమానము చెంది ఉన్నారు. పోరున కూలినవారికి పట్టుదుర్గతియే వారికిని ప్టినది.
26. మెషెక్కు, తుబాలు అచటనున్నవి. వాని సైనికుల సమాధులు వాని చుట్టునున్నవి. వారెల్లరును సున్నతిలేనివారై పోరునమడిసిరి. అయినను ఒకప్పుడు వారు సజీవులను గడగడలాడించిరి.
27. పురాతన కాలపు వీరులకువలె వారికిని ఖననసంస్కారములు జరుగలేదు. ఆ ప్రాచీనవీరులు తమ ఆయుధములతో పాటు పాతాళమునకు దిగిపోయిరి. అచట వారి ఖడ్గములు వారి తల క్రిందనున్నవి. వారి డాళ్ళు వారి దేహములపైనున్నవి. ఈ వీరులొకప్పుడు సజీవులకు భీతి ప్టుించిరి.
28. ఈ రీతిగా ఐగుప్తీయులు పోరున కూలిన సున్నతిలేనివారి ప్రక్కన పండుకొందురు.
29. ఎదోము తన రాజులతోను, అధిపతులతోను అచట నున్నది. వారు శూరులు. కాని ఇప్పుడు పోరున కూలిన సున్నతినొందని వారితోపాటు పాతాళమున పరుండియున్నారు.
30. ఉత్తర దేశాధిపతులును, సీదోనీయులును అచ్చటనున్నారు. ఒకప్పుడు వారి అధికారము నరులకు భీతిని ప్టుించెను. కాని వారిప్పుడు పోరున కూలిన వారితోపాటు పాతాళము చేరుకొని అవమానము చెందిరి. సున్నతిలేనివారై అచట పరుండియుండిరి. మృతలోకమునకు పోవువారికి కలుగు అవమానమే వారికిని కలిగినది.
31. పోరున మడిసిన వీరులెల్లరిని చూచి ఐగుప్తు రాజును అతని సైన్యమును ఓదార్పు చెందునని యావే ప్రభువు నుడువుచున్నాడు.
32. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను ఐగుప్తురాజు సజీవులకు భీతి ప్టుించునట్లు చేసితిని. కాని అతడును, అతని సైనికులును చత్తురు. వారు పోరునకూలిన సున్నతినొందని వారిప్రక్కన పవ్వ ళింతురు.” ఇది దేవుడైన ప్రభువు వాక్కు.