ఉపోద్ఘాతము:

పేరు: కతోలిక పవిత్ర గ్రంథ పూర్వనిబంధనలోని చివరి రెండు గ్రంథములు మక్కబీయుల పేరుతో ఉండును. యూదా మక్కబీయుడు, యాజకుడు మత్తతీయుని మూడవ కుమారుడు. ఈ మత్తతీయ క్రీ.పూ. 167లో సెల్యుసిడ్లకు వ్యతిరేకముగా యూదయ తిరుగుబాటునకు నాయకత్వము వహించెను.  

కాలము: మక్కబీయుల మొది గ్రంథమును క్రీ.పూ. 100 సం||లో వ్రాయబడినది. ఇందు క్రీ.పూ 175-134 మధ్యకాలపు వృత్తాంతాలున్నాయి. 

రచయిత: దీని అసలైన రచయిత ఎవరో తెలియదు. దీనిని హీబ్రూ భాష నుండి గ్రీకు భాషలోనికి అనువదించిరి. మక్కబీయులు రెండు గ్రంథాలు గ్రీకు సెప్తువజింత్‌ బైబులులోనే వున్నాయి. వీిని డ్యుటరోకెనానికల్‌ గ్రంథాలని అంారు. హీబ్రూ, కతోలికేతర పవిత్ర గ్రంథములలో ఇవి లేవు.

చారిత్రక నేపథ్యము: మక్కబీయుల మొది గ్రంథము మత్తతీయ నాయకత్వములో జరిగిన తిరుగుబాటును గూర్చి వివరించును. ఈ తిరుగుబాటు, గ్రీకు సంస్కృతి అభిమానులు యూదయ మత సంస్కృతిని ప్రభావితము చేసి, భ్రష్టపరిచిన తరుణములో తలెత్తినది.  క్రీ||పూ. 198 నాికి సెల్యుసిడ్‌ రాజ్యము పాలస్తీనాను ఆక్రమించినది. ఈ ఆక్రమణకు యూదులు పెద్దగా వ్యతిరేకించక పోయినప్పికిని  వారు యూదా మతాచారాలలో జోక్యము చేసుకోవాన్ని యూదులు ప్రతిఘించారు.

ముఖ్యాంశములు: మక్కబీయుల చర్యలను నిబంధన ప్రోత్సాహక చర్యలుగా పేర్కొనవచ్చును. యూదయ ప్రజలు ధర్మశాస్త్రమును విడనాడక దానిపట్ల విశ్వాస విధేయతలను పాించేటట్టుగా ప్రోత్సహించారు. చ్టాన్ని ధిక్కరించేవారు శిక్షకు గురవుతారని హెచ్చరించిరి.  మరణము తరువాత నీతిమంతులకు లభించు నిత్యజీవమును గురించి ఈ గ్రంథము పేర్కొనును.

క్రీస్తుకు అన్వయము: యూదుల శేషితజనము దేవునికి విశ్వాసపాత్రులుగా నిలిచెదరు. మక్కబీయ నాయకులు కనుమరుగైనప్పికి దేవుని నమ్ముకున్నవారు నిత్యము సజీవులుగానే ఉందురు. క్రీస్తును నమ్ముకున్న వారికి లభించే ప్రతిఫలము కూడా నిత్యజీవమే. క్రీస్తు బోధించిన దేవుని రాజ్యము విశ్వరూపము కలది (మత్త. 13:47-50; 22:1-14). యూదుల, అన్యుల మధ్య ఐక్యతను యేర్పరచడము క్రీస్తు మానవాళి రక్షణ ప్రణాళికలోని భాగమే. (ఎఫెసీ. 2:4; ఆది. 22 అధ్యా.). పరిశుద్ధ గ్రంథము ఓదార్పుకు మూలము (1 మక్క 12:9; రోమీ 15:4).