ఉదయకాల ప్రార్థన

ప్రధానగాయకునికి పిల్లనగ్రోవితో పాడదగిన దావీదు కీర్తన

5 1.         ప్రభూ! నా పలుకులు ఆలకింపుము,

                              నా నిట్టూర్పులు వినుము.

2.           నా రాజా! నా దేవా!

               నీ సహాయము కొరకు

               నేను పెట్టు మొరను ఆలింపుము.

3.           ప్రభూ! వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము.

               ప్రాతఃకాలమున నేను

               నీకు ప్రార్థనలు అర్పించి వేచియుందును.

4.           నీవు దుష్టత్వమున ఆనందించు దేవుడవు కావు.

               చెడుతనమునకు నీయొద్ద చోటులేదు.

5.           గొప్పలు చెప్పుకొనువారిని సహింపవు.

               పాపము చేయువారిని అసహ్యించుకొందువు.

6.           అబద్ధములాడువారిని నాశనము చేయుదువు.

               మోసగాండ్రను, నరహత్య చేయువారిని

               ప్రభువు అసహ్యించుకొనును.

7.            నేను మాత్రము నీ కృపాతిశయమువలన

               నీ ఇంట ప్రవేశింతును,

               నీ పట్ల భయభక్తులు చూపుచు

               నీ పవిత్రమందిరమున నీకు మ్రొక్కుకొందును.

8.           ప్రభూ! శత్రువులు నాకొరకు కాచుకొనియున్నారు.

               నీ నీతియందు నీవు నన్ను నడిపింపుము.

               నీ మార్గమును నాకు స్పష్టముగా తెలుపుము.

9.           వారి నోట సత్యము లేదు

               నన్ను నాశనము

               చేయవలయుననియే వారి కోరిక.

               వారి కంఠములు తెరచిన  సమాధులవింవి.

               వారి మాటలు బయికి తీయగానుండును.

10.         దేవా! నీవు వారిని అపరాధులనుగా చేయుము.

               వారు తాము త్రవ్వినగోతిలో

               తామే కూలునట్లు చేయుము.

               వారు బహుపాపములు చేసిరి కనుక,

               నీ మీద తిరుగబడిరి కనుక,

               నీ ఎదుినుండి వారిని గిెంవేయుము.

11.           కాని నిన్ను ఆశ్రయించిన

               వారందరు ఆనందించెదరు.

               నిరతము సంతసముతో గానము చేయుదురు.

               వారిని సంరక్షించుము.

               నీ నామమును  ప్రేమించువారు

               నిన్ను తలంచుకొని ప్రమోదము చెందుదురు.

12.          ప్రభూ! నీవు నీతిమంతులను దీవింతువు.

               నీ కృప వారిని డాలువలె కాపాడును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము