మకుటము

1 1. ఉజ్జీయా, యోతాము, ఆహాసు, హిజ్కియాలు యూదాకును, యోహావాషు కుమారుడైన యరోబాము యిస్రాయేలునకును రాజులుగా ఉన్నకాలమున, ప్రభువు బేరీకుమారుడైన హోషేయకు తెలియజేసిన సందేశమిది.

హోషేయ వివాహము, దాని సాంకేతిక భావము

హోషెయ వివాహము, ముగ్గురు బిడ్డలు

2. ప్రభువు మొదట హోషేయద్వారా మ్లాడిన పుడు, అతడితో ‘నీవు వెళ్ళి వ్యభిచారిణియైన యువతిని పెండ్లియాడి, వ్యభిచారమువలన ప్టుిన1 పిల్లలను తీసుకొనుము. ఇట్లే ఈ దేశప్రజలును నన్ను విడనాడి వ్యభిచారిణివలె  ప్రవర్తించుచున్నారు’  అని  చెప్పెను.

3. కనుక హోషేయ దిబ్లాయీము కుమార్తెయైన గోమేరును పెండ్లియాడెను. ఆమె గర్భవతియై కుమా రుని కనెను.

4. ప్రభువు హోషేయతో ”నీవు శిశువునకు ‘యెస్రెయేలు’ అని పేరుపెట్టుము. ఎందుకన, యిస్రా యేలురాజు  వంశకర్తయైన  యెహూ  పూర్వము యెస్రెయేలున హత్యలు జరిగించెను. కనుక నేను అనతికాలముననే ఆ రాజును శిక్షింతును. యెహూ రాజవంశమును తుదమ్టుింతును.

5. ఆ సమయ మున యెస్రెయేలు లోయలో యిస్రాయేలు సైన్యము బలమును అణచివేయుదును” అని చెప్పెను.

6. గోమెరు మరల గర్భవతియై ఆడుబిడ్డను కనెను. ప్రభువు హోషేయతో ”ఈ శిశువునకు ‘లోరూహామా’2 అని పేరుపెట్టుము. ఎందుకన నేను ఇకమీదట యిస్రా యేలీయులపై జాలిచూపను. వారితప్పిదములను మన్నింపను.

7. కాని నేను యూదా ప్రజలకు జాలి చూపుదును. ప్రభుడను, వారి దేవుడనైన నేను వారిని రక్షింతును. కాని యుద్ధముద్వారా అనగా కత్తులు, విండ్లు, బాణములు, గుఱ్ఱములు, రౌతుల ద్వారా నేను వారిని రక్షింపను” అని చెప్పెను.

8. గోమేరు ఆ పాపకు పాలు మాన్పించిన పిదప మరల గర్భవతియై మగబిడ్డను కనెను.

9. ప్రభువు హోషేయతో ”నీవు ఈ శిశువునకు ‘లో-అమ్మీ’1 అని పేరుపెట్టుము. ఎందుకన, యిస్రాయేలీయులు నా ప్రజలుకారు, నేను వారికి దేవుడనుకాను” అని చెప్పెను.

యిస్రాయేలు ఉద్ధరణము

10. అయినను యిస్రాయేలీయులు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకరేణువులవలె విస్తరిల్లుదురు. వారు లెక్కలకును, కొలతలకును అందరు. ఏ స్థలమందు మీరు ‘నా ప్రజలుకారు’ అన్నమాట ప్రజలు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు ‘జీవముగల దేవుని కుమారులై ఉన్నారు’ అని వారితో చెప్పుదురు.

11. అప్పుడు యిస్రాయేలీయులును, యూదీయులును ఐక్యమగుదురు. ఇరువురును కలిసి ఒక్కనాయకుని ఎన్నుకొందురు. వారు మరల తమదేశమున పెంపు చెందుదురు. అది యెస్రెయేలునకు శుభదినమగును.

Previous                                                                                                                                                                                                    Next