బబులోనియా దూతలు

39 1. ఆ కాలముననే బబులోనియా రాజును  బలదాను కుమారుడునగు మెరొదక్బలదాను హిజ్కియా వ్యాధిగ్రస్తుడై మరల కోలుకొనెనని విని, అతనికొక జాబును వ్రాసి బహుమతిని పంపెను.

2. హిజ్కియా అతని దూతలను ఆహ్వానించి వారికి తన కోశాగారము నందలి వెండిబంగారములను, సుగంధద్రవ్యములను, పరిమళతైలములను, ఆయుధసామగ్రిని చూపించెను. తన ప్రాసాదమునగాని, రాజ్యమునగాని హిజ్కియా వారికి చూపింపని వస్తువులేదు.

3. అంతట యెషయా ప్రవక్త రాజువద్దకు వచ్చి ‘వీరెచ్చినుండి వచ్చిరి, నీతో ఏమిచెప్పిరి’ అని అడిగెను. రాజు అతనితో ‘వీరు దూరదేశమైన బబులోనియా నుండివచ్చిరి’ అని చెప్పెను.

4. యెషయా ‘వీరు నీ ప్రాసాదమున ఏమి చూచిరి’ అని అడిగెను. రాజు, ‘వీరు అంతయును చూచిరి. నా కోశాగారమున నేను వీరికి చూపింపని వస్తువే లేదు’ అని బదులు చెప్పెను.

5. యెషయా ”అటులయినచో సైన్యములకధి పతియైన ప్రభువువాక్కు వినుము.

6. నీ ప్రాసాదమున నున్న వస్తువులన్నింని, నేివరకు మీ పూర్వులు కూడబ్టెియుంచిన వస్తువులన్నింని, ప్రజలు బబులోనియాకు ఎత్తుకొనిపోవు కాలమువచ్చుచున్నది. ఇక నీ ఇంట ఏమియు మిగులదు.

7. నీ వంశజులను గూడ బబులోనియాకు కొనిపోయెదరు. అచట వారు రాజప్రాసాదమున నపుంసకులుగా బ్రతికెదరు” అని అనెను.

8. కాని హిజ్కియా తన పరిపాలన కాలమున శాంతిభద్రతలు నెలకొనియుండిన, అదియే చాలునను కొనెను. కనుక అతడు యెషయాతో ‘నీవు నాకు వినిపించిన ప్రభువు సందేశము మంచిదే’ అని పలికెను.