స్వయముగా వచ్చిన పనివారు

3 1. ప్రధానయాజకుడైన ఎల్యాషిబు, అతని తోి యాజకులు కలిసి గొఱ్ఱెలద్వారము నిర్మించిరి. వారా ద్వారమునకు ప్రతిష్ఠచేసి తలుపులు ప్టిెరి. వారు హనన్యేలు గోపురము వరకు ప్రాకారము క్టిరి.

2. యెరికో నివాసులు దాని ప్రక్కభాగమును క్టిరి. ఇమ్రీ కుమారుడైన సక్కూరు దాని అవతలి భాగము కట్టెను. 3. హస్సేనా వంశస్థులు మత్స్యద్వారము నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి తలుపులు ప్టిె గడియలు, తాళములు అమర్చిరి.

4. దాని ప్రక్క భాగమును హక్కోసు మనుమడు ఊరియా కుమారు డగు మెరెమోతు నిర్మించెను. దాని అవతలిభాగమును మెషెషబేలు మనుమడును, బెరెకియా కుమారుడనగు  మెషూల్లూము నిర్మించెను. దానికానుకొని బానా కుమారుడగు సాదోకు కట్టెను.

5. దాని ప్రక్క భాగ మును తెకోవా పౌరులు క్టిరి. కాని వారి నాయకులు మాత్రము నిర్మాణకార్యకర్తలు నియమించిన కాయ కష్టము చేయుటకు నిరాకరించిరి.

6.పాసెయా కుమా రుడైన యోయాదా, బెసోద్యా   కుమారుడైన               మెషుల్లాము పాతద్వారమును పునర్నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి తలుపులుప్టిె, గడియలు, తాళములు అమర్చిరి.

7.దాని ప్రక్కభాగమును పశ్చిమ యూఫ్రీసు అధికారి న్యాయపీఠముంచబడు భవ నమువరకు నిర్మించినవారుగిబియోనీయుడగు మెల్యా, మెరోనోతునకు చెందిన యాదోను, గిబ్యోను మిస్పా పట్టణ పౌరులు.

8. హర్హయా కుమారుడు స్వర్ణకారు డునైన ఉజ్జీయేలు ఆ మీది భాగము కట్టెను. అత్తర్ల పనివాడైన హనన్యా దాని ప్రక్కభాగమును వెడల్పు గోడవరకు కట్టెను.

9. యెరూషలేము అర్థమండల పాలకుడును, హూరు కుమారుడునగు రెఫాయా ఆ మీది భాగము కట్టెను.

10. దానికి ఆవలిగోడను హరూమపు కుమారుడైన యెదాయా తననింకి ఎదురుగా నిర్మించెను. హషబ్నెయా కుమారుడైన హట్టూషు దాని ప్రక్కభాగమును కట్టెను.

11. దానికి ఆనుకొనియే హారిము కుమారుడైన మల్కియా, పహత్మోవబు కుమారుడగు హష్షూబు క్టిరి. పొయ్యి ద్వారమును గూడ వారే క్టిరి.

12. యెరూషలేము రెండవ అర్థభాగమునకు అధిపతియు, హల్లో హేషు కుమారుడైన షల్లూము దాని ప్రక్కభాగమును కట్టెను. షల్లూము కుమార్తెలునూ పనిలో అతనికి తోడ్పడిరి.

13. హానూను మరియు సనోవా పౌరులు కలిసి లోయద్వారమును నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి, తలుపులు ప్టిె, గడియలు, తాళములు అమర్చిరి. ప్రాకారమును పేడద్వారమువరకు వెయ్యిమూరల పొడవున మరమ్మతు చేసిరి.

14. బేత్‌హక్కేరెము మండలపాలకుడును రేకబు కుమారుడునగు మలకియా పేడద్వారమును కట్టెను. అతడు దానికి దూలములు నిలిపి, తలుపులుప్టిె, గడియలు, తాళములు అమర్చెను.

15. మిస్ఫా మండలాధిపతియు కొల్హోసే కుమా రుడునగు షల్లూము జలధారద్వారమును నిర్మించెను. దానికి తలుపులు ప్టిె, గడియయు, తాళమున మర్చెను. షేలా మడుగుచెంత రాజోద్యానవనము ప్రక్కన ప్రాకారము క్టించెను. ఈ గోడ దావీదు నగ రము మెట్లవరకు పోయెను.

16. బేత్సూరు మండల పాలకుడును అస్బూకు కుమారుడునగు నెహెమ్యా దాని ప్రక్కభాగము నిర్మించెను. ఈ గోడ దావీదు సమాధి, కృత్రిమమడుగు, సైనికాశ్రయమువరకు పోయెను.

ప్రాకారమును నిర్మించిన లేవీయులు

17. దాని ప్రక్కభాగమున క్రింది లేవీయులు నిర్మించిరి. బానీ కుమారుడగు రెహూము ఆ మీది భాగమును కట్టెను. కెయిలా మండలములోని అర్ధ భాగమునకు అధిపతియైన హషబ్యా తనమండలము తరపున ఆ తరువాతి భాగమును కట్టెను.

18. కెయిలా మండలములోని అర్ధభాగమునకు అధిపతియు హేనాదాదు కుమారుడునైన బవ్వయి దాని తరువాతి భాగమును కట్టెను.

19. మిస్పా మండలాధిపతియు యేషూవ కుమారుడునైన ఏసేరు ఆ మీది భాగమును కట్టెను. ఆ గోడ ఆయుధాగారమునుండి ప్రాకారము వంపుతిరుగు తావువరకు పోయెను.

20. సబ్బయి కుమారుడగు బారూకు ప్రక్కభాగము కట్టెను. ఆ గోడ ప్రధానయాజకుడగు ఎల్యాషిబు ఇంివరకు పోయెను.

21. ఆ మీది భాగమును హక్కోజు మనుమడును ఊరియా కుమారుడునైన మెరేమోతు నిర్మించెను. ఆ గోడ ప్రధానయాజకుని ఇల్లు మొదలుకొని ఆవలికొన వరకు పోయెను.

ప్రాకారమును నిర్మించిన యాజకులు

22. దాని ప్రక్కభాగమును ఈ క్రింది యాజ కులు నిర్మించిరి. యెరూషలేము ప్రాంతపు యాజకులు ఆ మీది భాగమును నిర్మించిరి.

23. బెన్యామీను, హష్షూబు తమ ఇండ్లకెదురుగా తరువాయి గోడను క్టిరి. అటు తరువాతి భాగమును అనన్యా మను మడును, మాసెయా కుమారుడైన అసర్యా తన ఇంి కెదురుగా నిర్మించెను.

24. అటు తరువాత హేనాదాదు కుమారుడైన బిన్నుయి అజర్యా ఇంినుండి ప్రాకా రము మూలవరకు గోడ కట్టెను.

25. ఆ మీదట ఊసయి కుమారుడగు పాలాలు కట్టెను. చెరసాల చెంతగల మీది రాజప్రసాదము చెంతనున్న బురుజు వరకును, ప్రాకారపు మలుపువరకును అతడు కట్టెను.

26. పరోషు కుమారుడైన పెదయా తరువాతి భాగ మును కట్టెను. ఆ గోడ జలద్వారమువరకును, దేవాలయ రక్షణ బురుజువరకును పోయెను.

ప్రాకారమును క్టిన యితర జనులు

27. తెకోవా పౌరులు తరువాతి భాగమును క్టిరి. ఆ గోడ దేవాలయము ఎదుి బురుజునుండి ఓఫెలు గోడవరకు పోయెను.

28. అశ్వద్వారము నుండి యాజకులెవరి ఇంిముందు వారు గోడక్టిరి.

29. ఇమ్మేరు కుమారుడైన సాదోకు తరువాతి భాగ మును తన ఇంికెదురుగా కట్టెను. తూర్పుద్వార మునకు పాలకుడును, షెకన్యా కుమారుడునగు షెమయా తరువాతి గోడను కట్టెను.

30. షెలెమ్యా కుమారుడైన హనన్యా, సాలాపు ఆరవ కుమారుడైన హానూను తరు వాతి భాగమును క్టిరి. బెరాకియా కుమారుడైన మెషుల్లాము తరువాతి గోడను తనింకెదురుగా కట్టెను.

31. స్వర్ణకారుని కుమారుడైన మల్కియా తరువాతి భాగమును కట్టెను. దేవాలయపు పనివారు, వర్తకులు వాడుకొను భవనమువరకు అతడు కట్టెను. ఈ భవనము దేవాలయ రక్షణద్వారము చెంత ప్రాకా రము మీద కట్టబడిన గదిదాపున కలదు.

32. ఆ గదియొద్దనుండి గొఱ్ఱెల ద్వారమువరకుగల గోడను స్వర్ణకారులు, వ్యాపారులు కలిసి నిర్మించిరి.

Previous                                                                                                                                                                                                   Next