ఐగుప్తు అను దేవదారు
31 1. అంతట పదునొకొండవ యేడు, మూడవ నెల మొదిరోజున ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 2. ”నరపుత్రుడా! నీవు ఐగుప్తు రాజునకును, అతని ప్రజలకును ఇట్లు చెప్పుము.
నీ గొప్పతనమును దేనితో పోల్తును?
3. నీవు లెబానోను దేవదారు వింవాడవు.
దానికి నీడనిచ్చు అందమైన కొమ్మలు కలవు.
అది మేఘమండలము వరకు ఎదిగెను.
4. నీరు సమృద్ధిగా లభించుటచే బాగుగా పెరిగెను.
అగాధజలములు దానిని వృద్ధికి తెచ్చెను.
ఆ జలములు అది ఎదుగు తావును తడిపెను.
అడవిలోని ఇతర వృక్షములకుకూడ ఊటనిచ్చెను
5. ఆ దేవదారు ఇతర వృక్షములకంటె
ఎత్తుగా పెరిగెను.
దాని శాఖలు బహువిస్తారముగా పెరిగెను.
పుష్కలముగా నీరు లభించుటచే
దాని చిగుళ్ళు పెద్దకొమ్మలాయెను.
6. నానావిధ పకక్షులు దానికొమ్మలలో
గూళ్ళు కట్టుకొనెను.
దాని నీడలో వన్యమృగములు పిల్లలను ఈనెను.
వివిధజాతి ప్రజలు
ఆ తరుచ్ఛాయలో విశ్రమించిరి.
7. ఆ తరువు అందమయినది, ఎత్తయినది.
దాని కొమ్మలు పొడవైనవి.
దాని వేళ్ళు అగాధజలములోనికి పారెను.
8. దేవుని వనములో దానికి ధీటైన చెట్టులేదు.
ఏ దేవదారునకును, దాని శాఖలను
పోలిన శాఖలు లేవు.
ఏ మేడిచెట్టునకును దాని కొమ్మలవిం
కొమ్మలు లేవు.
దేవుని వనములో అంత సొగసైన చెట్టులేదు.
9. నేను దానిని విశాల శాఖలు గల
సుందర వృక్షముగా చేసితిని.
దానిని చూడగా దేవుని తోటయైన
ఏదెనులోని చెట్లకు కన్నుకుట్టెను.
10. యావే ప్రభువు ఇట్లు అనుచున్నాడు: మబ్బులవరకు ఎదిగిన ఆ చెట్టునకు ఏమి జరుగునో చెప్పెదను. అది పెరిగినకొలది దానికి పొగరు హెచ్చెను.
11. కావున నేను దానిని పరిత్యజించితిని. అన్యజాతి రాజునకు దాని నొప్పగించితిని. అతడు ఆ చెట్టును దాని దుష్టత్వమునకు తగినట్లుగా దండించును.
12. క్రూరులైన అన్యదేశీయులు దానిని నరికి అచటనే వదలివేయుదురు. దానికొమ్మలు, ఛేదమైన ముక్క లును ప్రతికొండమీదను, ప్రతి లోయలోను పడును. దాని నీడన వసించు జాతులన్నియు దానిని విడనాడి వెళ్ళిపోవును.
13. పకక్షులువచ్చి పడిపోయిన ఆ చెట్టుమీద వ్రాలును. వన్యమృగములు దాని కొమ్మల మీద నడచును.
14. నీరెంత సమృద్ధిగా లభించినను, ఇకమీదట ఏ చెట్టుకూడ అంత ఎత్తుగా ఎదుగజాలదు. అంత ఉన్నతముగా పెరిగి మేఘముల వరకు కొమ్మలు చాపజాలదు. ఆ చెట్లన్నియు చావునకు గురియగు నరులవలె చచ్చును. మృతలోకమునకు పోవు వారి సంఖ్యలో చేరి నాశనమునకు గురియగును.
15. ప్రభువైన దేవుడు ఇట్లనుచున్నాడు: ఆ చెట్టు పాతాళమునకు ఏగిననాడు, అగాధజలములు సంతాప సూచకముగా దానిని ముంచివేయును. నేను భూగర్భ నదులను ఆపివేయుదును. బహుముఖములైన వాని ప్రవాహములు ప్రవహింపజాలవు. ఆ చెట్టు చచ్చినది కనుక నేను లెబానోను కొండలమీద చీకట్లు క్రమ్మింతును. అడవిలోని చెట్లన్నియు వాడిపోవును.
16. నేను ఆ చెట్టును పాతాళమున పడద్రోసినపుడు ప్టుిన శబ్ధము వలన జాతులు కంపించును. మృతలోకమున చేరుకొనిన ఏదెను వృక్షములును, సమృద్ధిగా నీరు బడసిన లెబానోను వృక్షరాజములును ఆ వృక్షపతనమునుచూచి సంత సించును.
17. అతని నీడన వసించి అన్యజాతులకు మధ్య అతనికి సహాయపడిన వారు అతనితోకూడ పాతాళమునకు, అతడు ఖడ్గముతో హతముచేసినవారి చెంతకు దిగిరి. పూర్వము ఆ వృక్షపునీడన వసించిన వారు జాతులమధ్య చెల్లా చెదరగుదురు.
18. ఆ వృక్షము ఐగుప్తురాజును, అతని ప్రజలను సూచించును. ఏదెను వనములోని చెట్లకుగూడ దానికి ఉన్నంత ఎత్తుగాని, వైభవముగానిలేదు. ఇపుడు ఏదెను చెట్లతో పాటు అది కూడ పాతాళమునకు చేరుకొని అచట సున్నతినొందని వారితోను, పోరున చచ్చిన వారి తోను కలిసిపోవును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”