ఆశ్వాసన గ్రంథమునకు అనుబంధములు

యిర్మీయా పొలమును గొనుట

32 1. సిద్కియా యూదాకు రాజుగానున్న కాలము పదియవయేటను, నెబుకద్నెసరు పరిపాలనాకాలము పదునెన్మిదియవయేటను ప్రభువు నాకు తన వాక్కును వినిపించెను. 

2. అపుడు బబులోనియారాజు సైన్యము యెరూషలేమును ముట్టడించుచుండెను. నన్ను రాజభవన ఆవరణమునందలి చెరలో బంధించి యుంచిరి.

3. సిద్కియారాజు నన్నచట బంధించెను. నేనీ క్రింది ప్రవచనము చెప్పినందున అతడు నామీద తప్పుపట్టెను. ‘ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను బబులోనియా రాజు ఈ నగరమును స్వాధీనము చేసి కొనునట్లు చేయుదును. 4. సిద్కియారాజు తప్పించు కోజాలడు. అతనిని బబులోనియారాజునకు అప్ప గింతురు. అతడా రాజును ముఖాముఖిచూచి అతనితో మ్లాడును.

5. సిద్కియాను బబులోనియాకు గొని పోవుదురు. నేను జోక్యము చేసికొనువరకును అతడచటనేయుండును. అతడిపుడు బబులోనియా ప్రజల నెదిరించినను విజయము బడయజాలడు.’ ఇది ప్రభుడనైన నా వాక్కు.

6. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను.

7. ”నీ పినతండ్రియైన షల్లూము కుమారుడగు హనమేలు నీ చెంతకువచ్చును. అతడు అనాతోతు గ్రామముననున్న తన పొలమును కొనుమని నిన్ను అడుగును. నీవు దగ్గరి చుట్టమువు కనుక దానిని కొనుటకు నీకు హక్కుకలదు అని చెప్పును.

8. ప్రభువు చెప్పినట్లే హనమేలు చెరలోనున్న నా చెంతకు వచ్చి ‘బెన్యామీను మండలమునందలి అనాతోతు గ్రామ ములోని నా పొలమును నీవు కొనుము. నీవు నాకు దగ్గరి చుట్టము, కనుక దానిని కొని భుక్తము చేసికొను హక్కు నీకు కలదు అనెను.’ ” ఇది ప్రభువు సందేశమేయని నేను గ్రహించితిని.

9. ”కనుక నేను అనాతోతునకు చెందిన హనమేలునుండి ఆ పొలము కొని అతనికి సొమ్ము తూచిఇచ్చితిని. దాని ఖరీదు పదునేడు తులముల వెండి.

10. నేను క్రయపత్రము మీద సంతకముచేసి ముద్రవేసి సాకక్షులచే సంతకము చేయించితిని. వెండిని తూచిఇచ్చితిని. 

11.  అంతట మడచి ముద్రవేసిన క్రయపత్రమును, వ్టినే మడచి యుంచిన క్రయపత్రమును తీసికొని వానిని, 12. బారూకునకు అప్పగించితిని. అతడు మహసేయా మనుమడు, నేరీయా కుమారుడు. నా సోదరుడగు హనమేలును, క్రయపత్రము మీద సంతకము చేసిన సాకక్షులును, చెరసాల చెంతకూర్చుండి యున్న యూదా ప్రజలును ఈ చర్యను గమనించుచునే యుండిరి.

13. వారందరును వినుచుండగా నేను బారూకుతో ఇట్లింని.

14. ‘సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: నీ వీ క్రయపత్రములను-మడచి ముద్రవేసిన దానిని, వ్టినే మడచియుంచిన దానిని తీసికొని మ్టికుండలో దాచి పెట్టుము. అట్లయిన అవి చాలకాలము వరకు భద్ర ముగా నుండును.

15. ఈ దేశమున ప్రజలు మరల ఇండ్లను, పొలములను, ద్రాక్షతోటలను కొందురని సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.’ ”

యిర్మీయా ప్రార్థన

16. క్రయపత్రమును నేరీయా కుమారుడైన బారూకునకు ఒప్పగించిన పిదప నేనిట్లు ప్రార్థించితిని.

17.          ”ప్రభువైన దేవా!

               స్వీయబలముతోను, చాచిన నీ బాహువుతోను

               నీవు భూమ్యాకాశములను చేసితివి.

               నీకు అసాధ్యమైనదేదియు లేదు.

18.          నీవు వేలకొలది ప్రజలకు దయజూపుదువు.

               తండ్రుల పాపములకు వారి తరువాత

               వారి తనయులను గూడ దండింతువు.

               నీవు మహాఘనుడవు. మహాశూరుడవు.

               సైన్యములకధిపతియైన ప్రభుడవని నీకు పేరు.

19.          నీవు ఉచితమైన నిర్ణయములను,

               మహాకార్యములను చేయుదువు.

               నరులు చేయుకార్యములనెల్ల గమనింతువు.

               ఎవరెవరి కార్యములకు దగినట్లుగా

               వారికి ప్రతిఫలమిత్తువు.

20.        నీవు ఐగుప్తున మహాకార్యములను,

               అద్భుతములను చేసితివి.

               యిస్రాయేలీయుల నడుమను,

               అన్యజాతుల నడుమను,

               నేికిని ఆ కార్యములు చేయుచునేయున్నావు.

               కనుక నేడు నీకు ఎల్లయెడల కీర్తి కలిగినది.

21.          నీవు అద్భుతకార్యములతోను,

               సూచకక్రియలతోను శత్రువులకు భీతి ప్టుించి,

               బలముతో బాహువుచాపి

               నీ ప్రజలైన యిస్రాయేలును

               ఐగుప్తునుండి తోడ్కొని వచ్చితివి.

22.        తరువాత నీవు వారి పితరులకు

               వాగ్దానము చేసినట్లే ఈ పాలుతేనెలు

               జాలువారు నేలను వారికిచ్చితివి.

23.        కాని ఆ దేశమున ప్రవేశించి

               దానిని స్వాధీనము చేసికొనిన పిదప

               వారు నీ ఆజ్ఞలు పాింపరైరి.

               నీ ధర్మశాస్త్రమును అనుసరింపరైరి.

               నీవు ఆజ్ఞాపించిన కార్యము ఒక్కియు చేయరైరి.

               కావున నీవు వారికి వినాశములెల్ల తెచ్చిప్టిెతివి.

24.         అదిగో! బబులోనీయులు నగరముచుట్టును

               ముట్టడిదిబ్బలుపోసి

               దానిని పట్టుకోజూచుచున్నారు.

               పోరు, కరువు, అంటురోగములవలన

               నగరము వారికి చిక్కును.

               నీవు చెప్పినదెల్ల జరిగినది.

               నీవే దీనిని చూడవచ్చును.

25.        కాని ప్రభువైన దేవా!

               ‘ఈ పట్టణము బబులోనీయుల వశమగుచున్నను,

               సాకక్షులయెదుట పొలమును గొనుము’ అని

               నీవు నన్ను ఆజ్ఞాపించితివి.”

26. అపుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను: 27. ”నేను సకల జనులకును దేవుడనైన ప్రభుడను. నాకు అసాధ్యమైనదేమైనా కలదా?

28. నేనీ నగరమును బబులోనియా రాజునకును, అతని సైన్యములకును అప్పగించితిని. వారు దానిని పట్టు కొందురు.

29. ఈ నగరముమీద దాడిచేయువారు దానిలో ప్రవేశించి, దానిని కాల్చివేయుదురు. ఏ ఇండ్ల మిద్దెలమీద బాలు దేవతకు సాంబ్రాణిపొగవేసి, పర దైవములకు ద్రాక్షసారాయార్పణము కావించి నా కోపమును రెచ్చగ్టొిరో, ఆ ఇండ్లనెల్ల తగులబెట్టు దురు.

30. యూదాజనులును, యిస్రాయేలు జనులును మొదినుండియు నాకు అప్రియమైన కార్యములనే చేసిరి. తమ చెయిదములతో నా కోపమును రెచ్చగ్టొిరి.

31. ఈ నగరమును నిర్మించినప్పి నుండియు నేి వరకును దీని పౌరులు నాకు కోపమును, ఆగ్రహ మును కలిగించుచునేయున్నారు. కనుక నేను దీనిని నా ఎదుినుండి తుడిచివేయుదును.

32. యూదా యెరూషలేము ప్రజలును వారి రాజులును, అధిపతులును, యాజకులును, ప్రవక్తలును చేసిన దుష్కార్యములకుగాను నేనిట్లుచేయనెంచితిని.

33. వారు తమ మొగము నావైపు త్రిప్పరైరి. నేను వారికి నిరంతరము బోధించుచుండినను, వారు నా ఉపదేశ మును ఆలింపలేదు, నేర్చుకొనలేదు.

34. వారు నా పేరు పెట్టబడిన దేవళమున తమ హేయమైన విగ్రహ ములు నెలకొల్పి దానిని అమంగళము చేసిరి. 35. హిన్నోము లోయలో బాలుదేవతకు బలిపీఠములు నిర్మించిరి. తమ కుమారులను, కుమార్తెలను దహించి మోలెకు దేవతకు బలిఅర్పించిరి. నేను వారిని ఈ కార్యముచేయ ఆజ్ఞాపింపలేదు. వార్టి హేయమైన కార్యముచేసి యూదా ప్రజలచే పాపము చేయింతు రని నేను ఊహింపనైనలేదు.

యూదాకు మంచిరోజులు వచ్చును

36. యిస్రాయేలు దేవుడైన ప్రభువు నాతో ఇట్లనెను: ” ‘యుద్ధము, కరువు, అంటురోగముల వలన ఈ నగరము బబులోనియా రాజునకు వశమగును’ అని ప్రజలు చెప్పుకొనుచున్నారు. కాని ఈ నగర మును గూర్చి నేను చెప్పు సంగతులివి: 37. నేను కోపముతోను, ఆగ్రహముతోను యిస్రాయేలు ప్రజ లను చెల్లాచెదరు చేసిన దేశమునుండి వారిని మరల తోడ్కొనివత్తును. నేను వారిని ఈ తావునకు గొని వత్తును. వారిచట సురక్షితముగా జీవింతురు.

38. అపుడు వారు నా ప్రజలగుదురు. నేను వారికి దేవుడనగుదును.

39.  నేను వారికి ఏకహృదయమును, ఏకమార్గమును దయచేయుదును. ఫలితముగా వారు నన్ను సదా గౌరవింతురు. దానివలన వారికిని, వారి సంతతికిని మేలు కలుగును.

40. నేను వారితో శాశ్వతమైన నిబంధనము చేసికొందును. వారికి ఉప కారము చేయుటమానను. ఆ ప్రజలు పూర్ణహృదయ ముతో నన్ను గౌరవించునట్లును, నానుండి వైదొలగ కుండునట్లును చేయుదును.

41. వారికి ఉపకారము చేయుటయే నా సంతోషముగా భావింతును. ఈ దేశమునందు వారిని నా పూర్ణహృదయముతో, నా పూర్ణాత్మతో నిశ్చయముగా నాటుదును.

42. నేను ఈ ప్రజలకు ఈ వినాశము కలిగించి నట్లే వారికి ప్రమాణము చేసిన ఉపకారములను గూడ నెరవేర్తును. 43. ఈ దేశము నరులుగాని, పశువులు గాని వసింపని ఎడారివలె అగుననియు, ఇది బబులోనియా వశము అగుననియు ప్రజలు చెప్పు కొనుచున్నారు. కాని ఈ దేశమున మరల పొలములు విక్రయింపబడును.

44. ప్రజలు ద్రవ్యమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయుదురు, ముద్రలు వేయుదురు, సాకక్షులచే సంతకములు చేయింతురు. బెన్యామీను మండలమునను, యెరూషలేము చుట్టు పట్లగల ప్రాంతములలోను, యూదానగరములలోను, పర్వతసీమలోని నగరములలోను, కొండపాదులలోను, యూదా దక్షిణప్రాంతమునను ఈ కార్యము జరుగును. నేను ప్రజలను వారి దేశమునకు గొనివత్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు.”