మోషే చివరిరోజులు

యెహోషువ మోషేకు అనుయాయి

31 1. మోషే యిస్రాయేలీయులతో ఇట్లనెను: 2. ”నాకిపుడు నూటయిరువది యేండ్లు. నేనిక కార్యభారము వహింపజాలను. నేను యోర్దాను దాట నని గూడ ప్రభువు సెలవిచ్చెను.

3. మీ ప్రభువైన దేవుడు మీకు ముందుగా పోయి అచి జాతులను నాశనము చేయును. మీరు వారి దేశమును స్వాధీనము చేసికొందురు. యెహోషువ మీకు నాయకుడగునని ప్రభువు నాతో చెప్పెను.

4. ప్రభువు అమోరీయ రాజులగు సీహోను, ఓగులను జయించి వారి రాజ్య ములను నాశనము చేసినట్లే, ఆ శత్రు ప్రజలను కూడ తుదమ్టుించును.

5. ప్రభువు వారిని మీ చేతికి చిక్కించును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లే మీరు వారిని రూపుమాపుడు.

6. మీరు ధైర్యస్థైర్యములను అలవరచుకొనుడు. మీరు వారిని చూచి భయపడవలదు. అధైర్యము చెందవలదు. ప్రభువు మీకు బాసటయై ఉండును. ఆయన మిమ్ము చేయి విడుచువాడు కాడు.”

7. అంతట మోషే యెహోషువను పిలిపించి ప్రజలందరి సమక్షమున అతనితో ఇట్లనెను: ”నీవు ధైర్యస్థైర్యములను అలవరచుకొనుము. నీవీ ప్రజలతో వెళ్ళుము. ప్రభువు వారి పితరులకు వాగ్ధానము చేసిన దేశమును స్వాధీనము చేసికొనునట్లు చేయుము.

8. నీవు భయపడవలదు. దిగులుపడవలదు. ప్రభువు నీ చేయి విడువడు. ఆయన నీకు నాయకుడగును. నీకు తోడుగాఉండును” అని యిస్రాయేలీయులందరి ఎదుట యెహోషువతో చెప్పెను.

ధర్మశాస్త్ర పఠనము

9. మోషే ఈ ధర్మశాస్త్రమును లిఖించి, దానిని ప్రభువు మందసమును మోయు లేవీయ యాజకుల కును, యిస్రాయేలు నాయకులకును ఒప్పజెప్పెను.

10. అతడు వారిని ఇట్లు ఆజ్ఞాపించెను. ”ప్రతి ఏడవయేి చివరన, బాకీలు రద్దయినకాలమున 11. ప్రభువు ఎంచుకొనిన ఏకైక ఆరాధనస్థలమున  ప్రజలు ఆయనను కొలుచుటకు సమావేశమయినపుడు మీరు ఈ ధర్మశాస్త్రమును జనులందరి ఎదుట పఠింపుడు.

12. అప్పుడు స్త్రీలను, పురుషులను, పిల్లలను, మీ నగరములలో వసించుపరదేశులను ప్రోగు చేయుడు. వారెల్లరు ఈ ధర్మశాస్త్రమును విని ప్రభువు పట్ల భయభక్తులు అలవరచుకొని ఆయన ఆజ్ఞలెల్ల పాింతురు.

13. అంతవరకు ఈ ధర్మశాస్త్రమును ఆలకింపని పిల్లలును అప్పుడు దానిని విందురు. విని, యోర్దాను ఆవల మీరు సొంతం చేసికొనబోవు నేలమీద తాము జీవించినంతకాలము  ప్రభువుపట్ల  భయభక్తులు చూపుదురు.”

ప్రభువు ఉపదేశములు

14. ప్రభువు మోషేతో ”నీవు కన్ను మూయు కాలము సమీపించినది. యెహోషువను పిలువనంపి మీరిరువురు సమావేశపుగుడారము చెంత వేచి యుండుడు. నేను అచట అతనికి ఉపదేశము చేయు దును” అనెను. కనుక మోషే యెహోషువలు సమావేశపు గుడారము చెంత చేరిరి.

15. ప్రభువు గుడారము తలుపునొద్ద మేఘమునందు వారికి ప్రత్యక్ష మయ్యెను.

16. ప్రభువు మోషేతో ఇట్లనెను: ”నీవు త్వరలోనే నీ పూర్వీకులను చేరుదువు. నీ మరణానంతరము ఈ ప్రజలు వ్యభిచారులై తాము స్వాధీనము చేసికొన బోవు దేశమునందలి అన్యదైవములను పూజింతురు. వారు నన్ను విడనాడుదురు. నేను వారితో చేసికొనిన నిబంధనమును మీరుదురు.

17. అప్పుడు నా కోపము వారిమీద రగు ల్కొనును. నేను వారిని పరిత్యజింతును. వారిని కరుణింపను. వారు ఘోరయాతనలకు గురియై క్రుంగి పోవుదురు. అప్పుడు ఆ ప్రజలు ”ప్రభువు మమ్ము చేయివిడిచెను కనుకనే మాకు ఈ అగచాట్లన్నియు ప్రాప్తించినవి” అనియను కొందురు.

18. వారు అన్య దైవములను పూజించి అపచారము చేసినందులకు నేను వారిని ఆదుకొనను.

సాక్ష ్యగీతము

19. ఇప్పుడు నీవు ఈ పాటను వ్రాసికొనుము. దీనిని యిస్రాయేలీయులకు నేర్పింపుము. ఇది వారిని ఖండించుచు సాక్ష ్యమిచ్చును.

20. నేను పితరులకు వాగ్ధానము చేసిన పాలుతేనెలు జాలువారు నేలకు వీరిని కొనిపోవుదును. అచట వారు తమకు ఇష్టము వచ్చినది భుజించి సుఖముగా జీవింతురు. కాని వారు నన్ను విడనాడి అన్యదైవములను కొలుతురు. నన్ను లెక్కచేయక నా నిబంధనమును  మీరుదురు.

21. ఫలితముగా ఘోరమైన యాతనలు, కష్టములు వారిని పీడించును. అప్పుడు ఈ గీతము వారిని ఖండించి సాక్ష ్యమిచ్చును. వీరి సంతానమును కూడ దీనిని విస్మరింపజాలరు. నేను వీరికి వాగ్ధానము చేసిన నేలకు వీరిని కొనిపోకమునుపే, వీరి హృదయములలో నున్న ఆలోచనలను ఇప్పుడే గుర్తింపగలను.”

22. మోషే నాడే ఈ గీతమును లిఖించి దానిని యిస్రా యేలీయులకు నేర్పించెను.

23.అంతట ప్రభువు నూను కుమారుడైన యెహోషువతో ”నీవు ధైర్యస్థైర్యములను అలవరచు కొనుము. నీవు నేను వాగ్ధానము చేసిన దేశమునకు యిస్రాయేలీయులను తప్పక తోడ్కొనివత్తువు. నేను నీకు బాసటయైయుందును” అని పలికెను.

ధర్మశాస్త్రమును మందసము చెంత ఉంచవలయును

24. మోషే ఈ దైవశాసనములన్నిని ఒక గ్రంథమున వ్రాసి, 25. ప్రభువు మందసమును మోయుబాధ్యతగల లేవీయులను ఇట్లు ఆజ్ఞాపించెను: 26. ”మీరు ధర్మశాస్త్రమును కొనిపోయి మీ దేవుడైన ప్రభువు మందసముచెంత ఉంచుడు. అది అచట నుండి మిమ్ము ఖండించుచు సాక్ష ్యమిచ్చును.

27. మీరు తిరుగుబాటు చేయువారనియు, తలబిరుసుగల జనమనియు నేనెరుగుదును. నేడు నేను బ్రతికి యుండగనే మీరు దేవునిమీద తిరుగబడితిరనగా, ఇక నేను చనిపోయినపిదప ఎంతి అల్లరికైనను పాల్ప డుదురు.

యిస్రాయేలీయులు గీతమును వినుటకు ప్రోగగుట

28. మీ తెగనాయకులను పెద్దలను నాయెదుట ప్రోగుచేయుడు. నేను వారికి ఈ సంగతులు చెప్పెదను. వారిని ఖండించి సాక్ష ్యము చెప్పుటకు, భూమ్యాకాశ ములను పిలిచెదను.

29. నేను చనిపోయిన తరువాత మీరు తప్పక దుష్కార్యములు చేయుదురు. నా ఆదేశములను తిరస్కరించుదురనియు, మీరు ప్రభువు ఒల్లని చెడ్డపనులు చేసి ఆయనకోపమును రెచ్చగొట్టు దురనియు కావుననే భవిష్యత్తులో మీకు కీడు వాిల్లు నని నాకు తెలియును”

30. అంతట యిస్రాయేలు సమాజమంతయు ఆలకించుచుండగా మోషే ఈ క్రింది గీతమును సాంతముగా వినిపించెను:

Previous                                                                                                                                                                                                   Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము