దావీదు వంశము

దావీదు కుమారులు

3 1-3. దావీదునకు హెబ్రోనున కలిగిన కుమా రులు వరుసక్రమముగా వీరు: యెస్రెయేలునకు చెందిన అహీనోవమునకు ప్టుిన అమ్నోను. కర్మెలునకు చెందిన అబీగయీలునకు జన్మించిన దానియేలు. గెషూరు రాజగు తల్మయి కుమార్తె మాకాకు ఉద్భవించిన అబ్షాలోము. హగ్గీతు కనిన అదోనీయా. అబీతలు కుమారుడు షెఫ్యా. ఎగ్లా పుత్రుడు ఈత్రెయాము.

4. దావీదు హెబ్రోనున పరిపాలనము చేసిన ఏడున్నరయేండ్లలో ఈ ఆరుగురు కుమారులు కలిగిరి.

5. అతడు యెరూషలేమున ముప్పది మూడేండ్లు రాజ్యము చేసెను. అతనికి యెరూషలేమున ప్టుిన కుమారులు వీరు.

6. అమ్మీయేలు పుత్రికయైన బత్షెబ వలన షిమ్యా, షోబాబు, నాతాను, సొలోమోను అను నలుగురు కుమారులు జన్మించిరి.

7-8. ఇంకను దావీదునకు ఇభారు, ఎలీషామా, ఎల్పేలెతు, నోగా, నెఫెగు, యాఫీయ, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు అను తొమ్మండుగురు తనయులు గలరు.

9. వీరితో పాటు ఉపపత్నులకు ప్టుిన పిల్లలు కూడా కలరు. అతనికి తామారు అను పుత్రికయును గలదు.

యూదా రాజులు

10-14. సొలోమోను వంశజులు క్రమముగా వీరు: సొలోమోను, రెహబాము, అబీయా, ఆసా, యెహోషాఫాత్తు, యెహోరాము, అహస్యా, యోవాషు, అమస్యా, అసర్యా, యోతాము, ఆహాసు, హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషీయా.

15. యోషీయా నలుగురుకుమారులు యోహానాను, యెహోయాకీము, సిద్కియా, షల్లూము.

16. యెహోయాకీము పుత్రుడు యెకొన్యా, అతని తనయుడు సిద్కియా.

ప్రవాసము తరువాత రాజవంశము

17-18. బందీగా కొనిపోబడిన యెకొన్యా కుమా రులు వీరు: ఆసీరు, షల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనస్సరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా, 19. పెదాయా తనయులు సెరుబ్బాబెలు, షిమీ. సెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమితు వారిరువురికి సోదరి.

20. మెషుల్లాము పుత్రులు హషూబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబేస్హెదు అను ఐదుగురు.

21. హనన్యా వంశజులు వీరు: పెల్యా, యెషయా, రెఫాయా, అర్నాను, ఓబద్యా, షెకన్యా.

22. షెకన్యా వంశజులు వీరు: షెమయా, హట్టూషు, ఇగాలు, బారియా, నెయర్యా, షాఫాతు అను ఆరుగురు. 23. నెయర్యా పుత్రులు ఎల్యోయేనయి, హిస్కియా, అస్రీకాము అను ముగ్గురు.

24. ఎల్యోయేనయి సుతులు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనాని అను ఏడుగురు.