సంతకము చేసినవారు

10 1. నిబంధన పత్రము మీద మొదట సంత కము చేసినవాడు అధికారియు హకల్యా కుమారు డునగు నెహెమ్యా. అటుతరువాత సిద్కియా సంతకము చేసెను.

2-8. ఆ పిమ్మట ఈ క్రింది యాజకులు:

               సెరాయా, అసర్యా, యిర్మియా; పషూరు, అమర్యా, మల్కీయా; హట్టూషు, షెబన్యా, మల్లూకు; హారిము, మెరేమోతు, ఓబద్యా; దానియేలు, గిన్నెతోను, బారూకు; మెషుల్లాము, అబీయా, మీయామిను; మాస్యా, బిల్గాయి, షెమయా.

9-13. ఈ క్రింది లేవీయులు:

               అసన్యా కుమారుడగు యేషూవ; హెనాదాదు వంశజుడైన బిన్నుయి, కద్మీయేలు, షెబన్యా, హోదీయా, కెలితా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, హషబ్యా, సక్కూరు, షేరెబ్యా, షెబన్యా, హోదియా, బానీ, బెనీను.

14-27. ఈ క్రింది పెద్దలు:

               పారోషు, పహత్మోవబు; ఏలాము, సత్తూ, బానీ; బున్ని, అస్గాదు, బేబై; అదోనియా, బిగ్వయి, ఆదీను; ఆతేరు, హెజ్కియా, అస్సూరు; హోదియా, హాషూము, బేసయి; హారీఫు, అనాతోతు, నేబయి; మగ్పీయాషు, మెషుల్లాము, హెసీరు; మెషేసబెలు, సాదోకు, యద్దూవ; పెల్యా, హానాను, అనయా; హోషేయ, హనన్యా, హష్షూబు; హల్లోహేషు, పిల్హా, షోబేకు; రెహూము, హషబ్నా, మాసెయా; అహీయా, హానాను, ఆనాను; మల్లూకు, హారిము, బానా.

ప్రజల ప్రమాణములు

28-29. యిస్రాయేలీయులమైన మేమెల్లరము అనగా యాజకులము, లేవీయులము, దేవాలయ ద్వారపాలకులము, గాయకులము, దేవళపు పనివార లము దైవాజ్ఞకు బద్ధులమై మా దేశములోని అన్య జాతులనుండి వైదొలగితిమి. మేము, మా భార్యలు, పెరిగి పెద్దయి బుద్ధివివరము తెలిసిన మా పిల్లలు, మా పెద్దలు ఎల్లరము ప్రభువు తన సేవకుడైన మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రమును పాింతుమని ప్రమాణము చేయుచున్నాము. మేము ప్రభువాజ్ఞల న్నిని అనుసరింతుము. ఆయన నిబంధనలు జవదాటము. ఈ ప్రమాణమును నిలుబెట్టుకోమైతి మేని మేమెల్లరము శాపముపాలగుదుముగాక!  

30. మా దేశమున వసించు అన్యజాతి జనుల పిల్లలను మేము పెండ్లియాడము, మా పిల్లలను వారికీయము.

31. అన్యజాతిజనులు విశ్రాంతి దినమునగాని పరిశుద్ధదినములందుగాని ధాన్యమును మరి ఇతర వస్తువులను అమ్ముటకు తీసికొనివచ్చినచో మేము వానిని కొనము. ప్రతి ఏడవయేడు మా పొలము సాగుచేయము. మాకు రావలసిన ఋణములు కూడ క్షమించి వదిలివేయుదుము.

32. ప్రతి సంవత్సరము దేవాలయము ఖర్చు లకు ఒక్కొక్కరము తులమున మూడవవంతు వెండిని అర్పింతుము.

33. దైవసన్నిధిలోనుంచు రొట్టెలు, ధాన్యబలికి అవసరమైన ధాన్యము, ప్రతిదినబలికి వలసిన పశువులు, విశ్రాంతిదినమునర్పించు నైవేద్య ములు, అమావాస్య మొదలైన పండుగలలో ఇతర పండుగులలో అర్పించు నివేదనములు, పాపపరిహార బలికి అవసరమగు వస్తువులు. ఈ రీతిగా దేవాలయ ఆరాధనకు కావలసినవి అన్నియు మేమే ఇచ్చు కొందుము.

34. సామాన్య ప్రజలము, లేవీయులము, యాజకులమునైన మేమెల్లరము చీట్లు వేసికొని ఎవరి వంతుల ప్రకారము వారలము ధర్మశాస్త్రవిధి చొప్పున ఏడాదిపొడుగున సమర్పించు బలులకుగాను దేవాల యమునకు వంటచెరకు కొనివత్తుము.

35. ప్రతియేడు మా పొలమున పండిన ప్రథమ వెన్నులను మా చెట్లపై పండిన ప్రథమఫలములను దేవాలయమునకు కానుకగా ఇత్తుము.

36. మా తొలి చూలు బిడ్డలను, మా ఆవులు ఈనిన మొది దూడ లను, మా మందలలో ప్టుిన మొది గొఱ్ఱెపిల్లలను, మేకపిల్లలను దేవాలయమునకు గొనిపోయి యాజ కులకు అర్పింతుము.

37. క్రొత్త ధాన్యమునుండి తయారైన పిండి, క్రొత్త ద్రాక్షసారాయము, క్రొత్త ఓలివునూనె, క్రొత్తపండ్లను ప్రతియేడు దేవాలయ మునకు ఇత్తుము. మా పొలమున పండిన పంటలో పదియవవంతు మా గ్రామములందు పన్ను వసూలు చేయు లేవీయులకిత్తుము.

38. లేవీయులు థమ భాగము వసూలు చేయునపుడు అహరోను వంశ మునకు చెందిన యాజకులు కూడ వారితో ఉందురు. పదవ భాగము క్రింద లేవీయులు వసూలుచేయు ధాన్యమున పదియవవంతు దేవాలయపు గిడ్డంగు లకు చేరును.

39. మా ప్రజలు, లేవీయులు కలిసి ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలివునూనె మొదలైన వానిని దేవాలయపు గిడ్డంగులకు చేర్చుదురు. అచ టనే దేవాలయపు వంటపాత్రలను భద్రపరచియుంచిరి. మరియు అర్చనచేయు యాజకులు దేవాలయ సంరక్ష కులు, గాయకులు వసించు గృహములు ఆ తావుననే కలవు. మేము దేవాలయమును ఎంతమాత్రము అశ్రద్ధచేయము.

Previous                                                                                                                                                                                                  Next