15 1. జరిగిన సంగతివిని అస్సిరియా సైనికులు దిగ్భ్రాంతి చెందిరి.

2. ఆ సైనికు లెల్లరు గగ్గోలుపడి చెల్లాచెదరైపోయిరి. కొండలను, లోయలనుబ్టి ఎవరికికన్పించిన త్రోవలవెంట వారు పారిపోజొచ్చిరి.

3. బెతూలియా చుట్టును కొండలలో శిబిరములు పన్నిన సైనికులును కాలికి బుద్ధిచెప్పిరి. యిస్రాయేలు సైనికులు వారిని వెంబడించి తరిమిరి.

4. ఉజ్జీయా బెతోమెస్తాయిము, బెబాయి, కోబా, కోలా నగరముల కును, యిస్రాయేలు మన్యమంతికిని దూతలను పంపి జరిగిన సంగతులెల్ల అచి ప్రజలకు చెప్పించెను. అచి జనులెల్లరును కలిసి వచ్చి శత్రువుల మీదపడి వారిని హతమార్పవలెనని కోరిరి.

5. ఆ సమాచారము అందుకొని యిస్రాయేలీయులెల్లరు ప్రోగైవచ్చి విరోధు లను వెన్నాడిరి. కోబా వరకు వారిని తరిమిక్టొి చిక్కిన వారినిచిక్కినట్లు మట్టుబ్టెిరి. యెరూషలేము పౌరులు, మన్యములలోని యితర ప్రజలు అస్సిరియా శిబిర మున జరిగిన సంగతులను దూతలవలన విని శత్రు వుల వెంటబడిరి. గిలాదు, గలిలీ నివాసులు పారి పోవు అస్సిరీయులకు అడ్డువచ్చి వారిలో చాలమందిని వధించిరి. వారు దమస్కు పరిసరముల వరకు విరోధు లను తరిమిక్టొిరి.

6. బెతూలియా నగరములో మిగి లినవారు అస్సిరియా శిబిరముమీద పడి కొల్లసొమ్ము ను విస్తారముగా దోచికొని సంపన్నులైరి.

7. శత్రు వులను తునుమాడి తిరిగివచ్చు యిస్రాయేలు సైని కులు విరోధి శిబిరమును కొల్లగ్టొిరి. ఆ పాళెమున చాల సొత్తు కలదు కనుక కొండలలోను పట్టణముల నుండి, పల్లెలనుండికూడ ప్రజలు వచ్చి కొల్లసొమ్మును దోచుకొనిరి.

యిస్రాయేలీయులు దేవుని స్తుతించుట

8. యెరూషలేమున వసించు ప్రధానా చార్యుడు యోయాకీము, మహాసభ సభ్యులు ప్రభువు నిర్వ హించిన మహాకార్యములను కన్నులార చూచుటకును, యూదితును అభినందించుటకును బెతూలియాకు విచ్చేసిరి.

9-10. వారెల్లరు యూదితును పొగడుచు:

”నీ వలన యెరూషలేమునకు కీర్తి కల్గినది.

నిన్ను చూచి యిస్రాయేలీయులు గర్వింతురు.

నీవలన మనజాతికెనలేని గౌరవము చేకూరినది.

నీవు స్వయముగా ఈ కార్యమును సాధించి,

యిస్రాయేలీయుల మన్ననను పొందితివి.

నీ చెయిదమును దేవుడు మెచ్చుకొనును.

నీ జీవితకాలమంతయు

ప్రభువు నిన్ను దీవించుగాక!”

అని పలికిరి. ఆ పలుకులకు ప్రజలెల్లరు ‘ఆమెన్‌’ అనిరి.

11. అస్సిరీయుల శిబిరమును పూర్తిగా దోచు కొనుటకు ఒక మాసము పట్టెను. ప్రజలు హోలోఫెర్నెసు గుడారమునందలి వెండి పాత్రములు, ఆసనములు, పరికరములను యూదితునకు కానుకగా ఇచ్చిరి. ఆమె ఈ వస్తువులనెల్ల తన కంచరగాడిద మీదికి, బండ్ల మీదికెత్తించెను.

12. యిస్రాయేలు స్త్రీలు యూదితును చూచుటకొచ్చిరి. వారామెను కీర్తించుచు గీతములు పాడి, నాట్యముచేసిరి. యూదితు మరియు ఆమెతో పయనము చేయు స్త్రీలు సంతోషసూచకముగా చిన్న కొమ్మలను చేప్టిరి.

13. తలమీద ఓలివుపత్రముల దండలను ధరించిరి. యూదితు ముందు పోవుచుండగా, ఆ స్త్రీలు ఆమెవెంట నడచుచు నాట్యము చేసిరి.

14. వారి వెనుక ఆయుధములు ధరించి పూలమాలలు తాల్చి గీతములు పాడుచు పురుషులు వచ్చిరి.