అరువు

29 1.      దయగలవాడు తన పొరుగువానికి

                              అరువిచ్చును.

                              అతనిని తన హస్తముతో బలపరచువాడు

                              దేవుని ఆజ్ఞలను పాించును.

2.           తోడివాడు అక్కరలోనున్నపుడు

               సాయము చేయుము.

               నీవు బాకీపడియున్నప్పుడు వెంటనే

               ఋణము తీర్పుము.

3.           నీవు ఋణదాతకు ఇచ్చిన మాటను నెరవేర్చుకొన్నచో

               అతడు నీ అక్కరలలో ఎల్లపుడు

               సాయము చేయును.

4.           చాలమంది అప్పును

               ఉచితముగా దొరకిన సొమ్మనుకొందురు.

               ఆపదలో అప్పిచ్చి ఆదుకొన్నవారిని

               తిప్పలు పెట్టుదురు.

5.           అప్పుకొరకు వచ్చినవాడు

               ఋణదాత చేతిని ముద్దుపెట్టుకొనును.

               అతని సంపదనుగూర్చి పొగడుచు మాటలాడును. కాని గడువు వచ్చినపుడు

               సొమ్ము చెల్లింపక జాప్యము చేయును.

               బాకీ తీర్చుటకు ఇది అదనుకాదని పలుకును.

               ఏవేవో కల్లబొల్లి సాకులు చెప్పును.

6.           ఋణదాత ఋణగ్రస్తుని నిర్బంధప్టిె

               తానిచ్చిన అసలులో సగము రాబట్టుకోగలిగిన అదృష్టము పండినట్లుగానే భావింపవచ్చును.

               నిర్బంధముచేయనిచో ఋణదాత

               తన సొమ్మును కోల్పోవును.

               అనవసరముగా ఒక శత్రువునుగూడ

               సిద్ధము చేసికొనకుము.

               అప్పు తీసికొనినవాడు

               అతనిని శపించి త్టిపోయును.

               అతనిని గౌరవించుటకు మారుగా

               అవమానించి పంపును.

7. కనుకనే చాలమంది అరువిచ్చుట కంగీకరింపరు. వారు పిసినిగొట్టులు కాదుగాని, సొమ్మిచ్చి అనవసరముగా మోసపోనేల అని ఎంతురు.

దాన ధర్మములు

8.           అయినను పేదసాదలను

               సానుభూతితో చూడుము.

               వారిచే దీర్ఘకాలము బతిమాలించుకోవలదు.

9.           దైవాజ్ఞలమీది గౌరవముచే

               పేదలకు సాయముచేయుము.

               అక్కర ఉండి వచ్చిన వారిని

               వ్టిచేతులతో పంపివేయకుము.

10.         నీ కాసులను ఏ బండక్రిందనో దాచి

               త్రుప్పుపాలు చేయుటకంటె

               వానిని నీ పొరుగువాని కొరకో,

               స్నేహితుని కొరకో వెచ్చించుటమేలు.

11.           దైవాజ్ఞ సూచించినట్లు దానధర్మములు అను

               నిధిని ప్రోగుచేసికొనుము.

               ఆ నిధి నీకు బంగారముకంటె

               అధికముగా ఉపయోగపడును.

12.          పేదలకిచ్చినదే నీవు భద్రపరచిన నిధి 

               అనుకొనుము.

               అది నిన్ను సకల ఆపదలనుండి కాపాడును.

13.          ఆ నిధి బలమైన డాలుకంటెను,

               బరువైన ఈటెకంటెను అధికముగా

               నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షించును.

హామీ యుండుట

14.          సజ్జనుడు తోడివానికి హామీ ఉండవలెను.

               సిగ్గుసెరము లేనివాడు మాత్రమే

               ఈ ధర్మమును మీరును.

15.          నీకు పూటకాపుగా నుండినవాని

               ఉపకారమును మరువకుము.

               అతడు తన పరువును పణముగా ప్టిె

               నిన్ను కాపాడునుగదా!

16.          దుర్మార్గుడు తన పూటకాపు ఆస్తిని

               నాశనము చేయును.

               కృతఘ్నుడు  తన్ను  కాపాడిన వానిని విస్మరించును.

17.          హామీగా ఉండుటవలన చాలమంది

               తమ ఆస్తిని కోల్పోయిరి.

               హామీ అను తుఫాను వారిని సర్వనాశనము చేసెను

18.          హామీవలన బలవంతులే ఇల్లువాకిలి పోగొట్టుకొని

               పరదేశములలో తిరుగాడవలసి వచ్చెను.

19.          కాని స్వలాభము కోరి హామీగా నుండెడి దుష్టుడు

               తగవులలో చిక్కుకొనును.

20.        నీకు సాధ్యమైనంత వరకు

               నీ పొరుగు వానికి తోడ్పడుము.

               కాని దానివలన నీవు చిక్కులలో పడకుండునట్లు

               చూచుకొనుము.

ఇల్లు, ఆతిథ్యము

21.          కూడు, గుడ్డ, నీళ్ళు నరునికి

               ప్రాథమిక అవసరములు.

               గుట్టుగా మనుటకు కొంపకూడ అవసరము.

22.        ఇతరుల ఇంట రాజభోజనములు ఆరగించుటకంటె

               లేమితో తన సొంతగుడిసెలో వసించుట మేలు.

23.        నీకున్నది కొద్దియే అయినను దానితోనే

               తృప్తి చెందుము.

24.         కొంపనుండి కొంపకు పోవుటయు,

               ఎక్కడను నోరెత్తుటకు ధైర్యము లేకపోవుటయు

               నికృష్టము.

25.        జనుడు అన్యుల ఇంట అతిథులను ఆహ్వానించి

               పానీయములందించినూ,

               ఆ ఇంి వారతనిని మెచ్చరు.

               పైగా అతనిని నిందించుచు

26.        ”ఓయి అన్యుడా! ఇట వచ్చి

               భోజనపాత్రములు కడుగుము.

               ఇచటనున్న భోజనపదార్థములు నాకు వడ్డింపుము

27.         ఓయి అన్యుడా! నేడొక ముఖ్యఅథితి

               మా ఇంికి వచ్చుచున్నాడు,

               మా సోదరుడు వచ్చుచున్నాడు,

               కనుక నీవీ గదిని ఖాళీచేయుము”

               అని పలుకుదురు.

28.        ఎచటను ఆతిథ్యము లభింపకుండుటయు,

               బాకీ ఇచ్చినవాడు వెంటబడుటయు అనునవి

               సున్నితమైన మనస్తత్వము కలవారికి

               భరింపరాని కార్యములు.