సిరియాతో మరియొక యుద్ధము

అహాబు రామోతుగిలాదును ముట్టడింప కోరుట

22 1. యిస్రాయేలు సిరియా దేశముల మధ్య మూడేండ్లపాటు యుద్ధములేమియు జరుగలేదు.

2. మూడవఏట యూదారాజగు యెహోషాఫాత్తు యిస్రా యేలు రాజగు అహాబును చూడవచ్చెను.

3. అప్పుడు అహాబు తన ఉద్యోగులతో ”రామోతుగిలాదు మనదే గదా! అయినను సిరియా రాజునుండి దానిని ఇంత వరకు స్వాధీనము చేసికోమైతిమి” అనెను.

4. మరియు అహాబు ”నేను రామోతు మీదికి యుద్ధము నకు పోయినచో నీవు నాకు సహాయము చేయుదువా?” అని యెహోషాఫాత్తును అడిగెను. అతడు ”నీవు యుద్ధమునకు సిద్ధపడినచో నేను మాత్రమురానా? నేను నీవాడినే, నా ప్రజలు నీ ప్రజలే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే.

5. కాని మొదట ప్రభువును సంప్రతించి చూడుము” అని చెప్పెను.

కపటప్రవక్తలు విజయమును ఎరిగించుట

6. కనుక అహాబు తన నాలుగువందల మంది ప్రవక్తలను పిలిపించి ”నేను రామోతుమీదికి దండెత్తి పోవచ్చునా పోగూడదా?” అని ప్రశ్నించెను. వారందరు ”దండెత్తుము. ప్రభువు ఆ నగరమును నీ స్వాధీనము చేయును” అనిరి.

7. కాని యెహోషాఫాత్తు ”ప్రభువును సంప్రతించుటకు ఇక్కడ ఇతర ప్రవక్తలు లేరా?” అని అడిగెను.

8. అహాబు ”ఇమ్లా కుమారుడు మీకాయా ఉన్నాడు. అతని ద్వారా గూడ దేవుని సంప్రతింప వచ్చును. కాని మీకాయా నన్ను గూర్చి చెడునే చెప్పును గాని మంచి మాట ఒక్కియు చెప్పడు. అతడనిన నాకుగిట్టదు” అనెను. ఆ మాటలకు యెహోషాఫాత్తు ”ప్రభువు అటుల అనరాదు” అనెను.

9. అపుడు అహాబు సేవకుని పిలిచి ”నీవు వెళ్ళి మీకాయాను త్వరగా తోడ్కొనిరమ్ము” అని చెప్పెను.

10. రాజులిద్దరు రాజవైభవముతో విలువగల దుస్తులుదాల్చి సమరియా నగరద్వారమునకు వెలుపల నున్న కళ్ళమువద్ద సింహాసనములపై ఆసీనులై యుండిరి. ప్రవక్తలందరు వారి ఎదుట ప్రోగై ప్రవచన ములు చెప్పుచుండిరి.

11. కెనానా కుమారుడగు సిద్కియా ప్రవక్త ఇనుపకొమ్ములు చేయించుకొనివచ్చి, అతడు అహాబుతో ”యావే సందేశమిది. నీవు సిరియ నులను ఈ కొమ్ములతో పొడిచి రూపుమాపుదువు” అని చెప్పెను.

12. ఇతర ప్రవక్తలు అతని పలుకులను సమర్థించుచు ”నీవు రామోతు మీదికి దండెత్తిపోయి దానిని జయింపుము. ప్రభువు ఆ నగరమును నీ వశము చేయును” అని పలికిరి.

మీకాయా ఓటమిని ఎరిగించుట

13. మీకాయాను తోడ్కొని రాబోయిన సేవకుడు అతనితో ”ప్రవక్తలందరు ఏకకంఠముతో రాజునకు విజయము కలుగునని పలికిరి. నీవును అట్లే చెప్పుము” అనెను.

14. కాని మీకాయా అతనితో ”యావే జీవముతోడు. నేను ప్రభువు నాచే పలికించిన పలుకులే పలికెదను” అని నుడివెను.

15. అతడు రాగానే రాజు ”మీకాయా! నీవేమందువు? మేము రామోతు మీదికి దండెత్తిపోవచ్చునా, పోగూడదా?” అని యడిగెను. కాని మీకాయా ”పొండు, మీకు విజయము సిద్ధించును. ప్రభువు నగరమును మీ వశము చేయును” అనెను.

16. కాని అహాబు ”ఓయి! నీవు ప్రభువు పేర సత్యమునే చెప్పవలెనని నేనెన్నియో మారులు నిన్ను హెచ్చరింపలేదా?” అని అతనిని మందలించెను.

17. అప్పుడు మీకాయా ఇట్లు పలికెను: ”యిస్రాయేలీయులు కాపరిలేని మందవలె కొండల మీద చెల్లాచెదరైరి. అది చూచి ప్రభువు ‘ఈ ప్రజలకు నాయకుడులేడు, కనుక వీరిని నిశ్చింతగా ఇంికి వెళ్ళిపొమ్మనుడు’ ”అనెను.

18. ఆ మాటలువిని అహాబు యెహోషాఫాత్తుతో ”వింవా! ఇతడు నన్ను గూర్చి ఒక్క మంచిమాట చెప్పడు. ఇతడు చెప్పునవన్ని చేటుమాటలే అని నీతో  చెప్పలేదా!” అనెను.

19. అప్పుడు మీకాయా ఇంకా ఇట్లు చెప్పెను. ”ప్రభువుపలుకులు వినుము. యావే సింహాసనాసీనుడై ఉండగా చూచితిని. పరలోకసైన్యము అంతయు ఆయనకు ఇరువైపుల కొలువుదీరి ఉండుట చూచితిని.

20. అప్పుడు ప్రభువు ”అహాబును మోస పుచ్చి అతడు రామోతు యుద్ధమునకుపోయి అచ్చట ప్రాణములు కోల్పోవునట్లు చేయువారెవ్వరు?” అని ప్రశ్నించెను. ఆ ప్రశ్నకు కొందరుఇట్లని, మరికొందరు అట్లని సూచనలు చేసిరి.

21. కడన ఒక ఆత్మ దేవుని ముందు నిలుచుండి ‘నేను అతనిని మోసగింతును’ అనెను.

22. ప్రభువు ‘నీవెట్లు మోసగింతువో చెప్పుము’ అని అడుగగా ఆ ఆత్మ ‘నేను వెళ్ళి అహాబు ప్రవక్తలందరు నోరార అబద్ధమాడునట్లు చేసెదను’ అనెను. ప్రభువు ఆ ఆత్మతో ‘అట్లే వెళ్ళి అహాబును మోసగింపుము. నీ పని నెరవేరును” అనెను.

23. ఈ రీతిగా ప్రభువు నీ ప్రవక్తలు కల్లలాడునట్లు చేసెను. కాని ప్రభువు మాత్రము నిన్ను నాశనము చేయ నెంచెను.”

24.  ఆ పలుకులాలించి కెనానా కుమారుడగు సిద్కియా మీకాయా చెంతకువెళ్ళి అతని చెంపలు వాయించి ”నాయనా! దేవుని ఆత్మ నన్ను వదలిప్టిె నీతో మ్లాడినదా? అది ఎప్పినుండి?” అని అడిగెను.

25. మీకాయా ”నీవు లోపలగదిలో దాగు కొనుటకై పారిపోయిన రోజున నీకే తెలియును?” అని జవాబిచ్చెను. 26-27. అంతట అహాబురాజు తన ఉద్యోగితో ”మీకాయాను బంధించి నగర పాల కుడు ఆమోను వద్దకును రాజకుమారుడు యోవాషు నొద్దకును కొనిపొమ్ము. ఇతనిని చెరలో త్రోయింప వలసినదనియు, నేను యుద్ధమునుండి సురక్షితముగ తిరిగివచ్చువరకు చాలీచాలని రొట్టె, నీళ్ళు మాత్రమే ఈయవలెననియు వారితో చెప్పుము” అని పలికెను.

28. కాని మీకాయా ”నీవు సురక్షితముగా తిరిగి వత్తువేని ప్రభువు నా ద్వార మ్లాడలేదు. ఇచి వారెల్లరు నా పలుకులు ఆలింపుడు” అని అనెను.

రామోతు యుద్ధమున అహాబు కూలుట

29. యిస్రాయేలు రాజగు అహాబు, యూదా రాజగు యెహోషాఫాత్తు గిలాదునందలి రామోతును ముట్టడింపబోయిరి.

30. అహాబు యెహోషాఫాత్తుతో ”నేను మారు వేషమున యుద్ధమునకు వత్తును. నీవు రాజవస్త్రములతోనే రమ్ము” అని చెప్పెను. తాను చెప్పినట్లే అహాబు మారువేషమున వచ్చెను.

31. అట సిరియా రాజు తన ముప్పదిద్దరు రథాధిపతులతో యిస్రాయేలు రాజును తప్ప మరెవ్వరిని పోరున ఎదిరింపవలదని చెప్పెను.

32. ఆ అధిపతులు యెహోషాఫాత్తునుచూచి యిస్రాయేలు రాజు అన్న అను భ్రమతో అతనిని ఎదిరించిరి. వారిని చూచి యెహోషాఫాత్తు బిగ్గరగా అరచెను.

33. ఆ వీరులు అతడు యిస్రాయేలు రాజు కాదని గుర్తించి అతనిని వదలి వేసిరి.

34. అప్పుడొక సిరియా సైనికుడు యాదృచ్ఛికముగా విల్లెక్కుప్టిె బాణమువేయగా అది అహాబు రాజు కవచపు అతుకుల మధ్యలో గ్రుచ్చు కొనెను. రాజు తన సారథితో ”నాకు గాయము తగిలినది. రథమును యుద్ధభూమినుండి ఆవలికి తరలింపుము” అనెను.

35. పోరు ముమ్మరముగా సాగుచుండగా అహాబు సిరియాసైన్యమువైపు మళ్ళి రథముమీద ఆనుకొని నిలుచుండియుండెను. అతని గాయమునుండి నెత్తురు ధారగాకారి రథమును తడిపి వేసెను. ఆ మాపిపూట అతడు మరణించెను.

36. సాయంకాలమగునప్పికి యిస్రాయేలు సైన్యమున ”మన సైనికులందరు ఎవరి మండలములకు, పట్టణ ములకు వారు తిరిగిపొండు” అను కేక విన్పించెను.

37. అహాబు శవమును సమరియా నగరమున పాతిప్టిెరి.

38. రాజు రథమును సమరియా మడుగున కడుగగా అతని రక్తమును కుక్కలు నాకెను. ఆ రక్తపు నీటనే వేశ్యలు స్నానమాడిరి. ప్రభువు చెప్పినట్లే ఇది అంతయు జరిగెను.

అహాబు మరణానంతరము

అహాబు పరిపాలనాంతము

39. అహాబు చేసిన ఇతరకార్యములు అనగా అతడు దంతపు మేడను కట్టుట, పట్టణములను నిర్మించుట-యిస్రాయేలు రాజులచరితమున వర్ణింప బడియేయున్నవి.

40. అహాబు మరణానంతరము అతని కుమారుడు అహస్యా రాజయ్యెను.

యూదాసీమలో యెహోషాఫాత్తు రాజు (క్రీ.పూ. 870-848)

41.యిస్రాయేలురాజ్యమున అహాబు రాజుగానున్న నాలుగవయేట ఆసా కుమారుడగు యెహోషాఫాత్తు యూదా రాజ్యమునకు రాజయ్యెను.

42. అప్పుడు అతని వయస్సు ముప్పది ఐదేండ్లు. అతడు యెరూష లేమున ఇరువది ఐదేండ్లు పరిపాలించెను. అతని తల్లి షిల్హీ కుమార్తెయైన అసూబా.

43. తన తండ్రి ఆసావలె యెహోషాఫాత్తు కూడ సత్కార్యములు చేసి ప్రభువునకు ఇష్టుడయ్యెను.

44. కాని అతడు అన్య దైవములను కొలుచుటకు ఉన్నతస్థలముమీద నిర్మించిన బలిపీఠములను తొలగింపలేదు. వాని యందు ప్రజలు బలులు సమర్పించి సాంబ్రాణిపొగ వేయుచునే యుండిరి.

45. యెహోషాఫాత్తునకును యిస్రాయేలునకును మధ్య సంధి కుదిరెను.

46. యెహోషాఫాత్తు చేసిన ఇతరకార్యములు, అతడు చూపిన పరాక్రమము, చేసిన యుద్ధములు యూదారాజుల చరితమున వర్ణింపబడియేయున్నవి.

47. అతడు వేశ్యలవలె ప్రవర్తించు మగవారిని మట్టు పెట్టెను. వీరు తన తండ్రి ఆసా గతించినప్పి నుండి మిగిలియున్నవారు.

48. ఆ కాలమున ఎదోమునకు రాజులేడు. యూదా రాజు నియమించిన రాజప్రతినిధి ఆ దేశమును పరిపాలించెను.

49. యెహోషాఫాత్తు తర్షీషు ఓడలను నిర్మించి బంగారమును కొనితెచ్చు టకు వానిని ఓఫీరు మండలమునకు పంపనెంచెను. కాని అవి త్రోవలో ఏసోన్గెబెరున బ్రద్దలైపోయినందున గమ్యము చేరలేదు.

50. యిస్రాయేలు రాజు అహస్యా తన నావికులను యెహోషాఫాత్తు నావికులతో పంప నెంచెను గాని అతడందుకు సమ్మతింపలేదు.

51. యెహోషాఫాత్తు తన పితరులతో నిద్రించి, తన పితరుడైన దావీదుపురముననే పాతిపెట్టబడెను. అటుపిమ్మట అతని కుమారుడు యెహోరాము రాజయ్యెను.

యిస్రాయేలురాజు అహస్యా (క్రీ.పూ. 853-852)

52. యూదా రాజ్యమున యెహోషాఫాత్తు పరిపాలనకాలము పదునేడవయేట, యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడగు అహస్యా రాజు అయ్యెను. ఆ రాజు సమరియా నగరమున రెండేండ్లు పరిపాలించెను.

53. అతడు ప్రభువు ఆజ్ఞ మీరి దుష్కార్యములు చేసెను. అహస్యా తన తల్లిదండ్రు లిద్దరి ప్రవర్తనను, యిస్రాయేలు ప్రజలను పాపము నకు పురికొల్పిన నెబాతు కుమారుడు యరోబామును అనుకరించి చెడుపనులు చేసెను.

54. బాలు దేవతను కొలిచి, తన తండ్రివలె తానును యిస్రాయేలు దేవుడైన ప్రభువు కోపమును రెచ్చగొట్టెను.