ఎలీహు సంభాషణములు

ఎలీహు సంవాదములో పాల్గొనుట

32 1. యోబు తనదృష్టికి తాను నిర్దోషినని విశ్వ సించియున్నాడని ఆ ముగ్గురు మిత్రులు గ్రహించి, అతడికి జవాబు చెప్పక మౌనము వహించిరి.

2. కాని యోబు తన్ను తాను సమర్థించుకొని దేవుని తప్పుపట్టుటను చూచి బరకేయేలు కుమారుడు ఎలీహు కోపముతో మండిపడెను. అతడు బూసీయుడును, రాము వంశమునకు చెందినవాడు.

3. అతడు ఆ ముగ్గురు మిత్రులమీదకూడ ఆగ్రహము చెందెను. వారు యోబునకు సమాధానము చెప్పజాలక దేవునిదే తప్పు అన్నట్లుగా మౌనము వహించిరికదా!

4. వారెల్లరు ఎలీహు కంటె పెద్దవారు కనుక వారు మ్లాడునపుడు అతడు మాటలాడడయ్యెను.

5-6. కాని ఆ ముగ్గురు యోబుకు జవాబునీయకుండిరి. కనుక ఎలీహు కోపము తెచ్చుకొని ఇట్లు బదులు పలికెను:

               ”నేను చిన్నవాడను, మీరు వయోవృద్ధులు

               అగుటచే మీ ఎదుట నా    అభిప్రాయమును

               వెలిబుచ్చజంకితిని.

7.            పెద్దవారలే మ్లాడవలయును,

               వృద్ధులే విజ్ఞానవాక్యములు పలుకవలయును

               అని నేను భావించితిని.

8.           కాని మహోన్నతుని ఆత్మయే

               నరులలో నెలకొనియుండి,

               వారికి విజ్ఞాన మొసగునని నేనిపుడు గ్రహించితిని

9.           వృద్ధులైనంత మాత్రముననే విజ్ఞానము అలవడదు

               ఏండ్లు చెల్లినంతనే వివేకమబ్బదు.

10.         కనుక మీరిపుడు నా పలుకులు ఆలింపుడు. నా అభిప్రాయము శ్రద్ధగా వినుడు.

11.           నేను మీ పలుకులను ఓపికగా వింని.

               మీరు పదములను వెదకుకొని

               మాటలాడుట గుర్తించితిని.

12.          మీ మాటలను సావధానముగా వింని,

               మీరు యోబును ఖండింపలేదు.

               అతని మాటలకు జవాబీయలేదు.

13.          ఇక మీకు విజ్ఞానము కలదని నమ్ముట ఎట్లు?

               ఈ కార్యము మీవలన కాలేదు గనుక దేవుడే

               యోబునకు బదులు చెప్పవలయును.

14.          యోబు నాతో వాదింపలేదు.

               నేను మీ మాటలనుబ్టి అతనికి జవాబునివ్వను.

15.          యోబూ! వీరు విస్మయముతో నోరెత్తజాలరైరి.

               వీరి నోివెంట మాటలు పెకలవయ్యెను.

16.          వీరు మౌనము వహించిరి కనుక

               నేను ఊరకుండవలయునా?

               అదిగో! వీరు నోటమాట లేక నిలుచుండిరి.

17.          కనుక నేనిపుడు జవాబు చెప్పెదను.

               నా అభిప్రాయము తెలియజేసెదను.

18.          నా తల భావములతో నిండియున్నది.

               నాలోనిఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది.

19.          నేను మాడనేని క్రొత్త ద్రాక్షసారాయము

               పోయుటవలన ఒత్తిడికి గురియైన తిత్తివలె

               పిగిలి పోవుదునేమో.

20.        మాటలాడిననే తప్ప నాకిపుడు

               ఉపశమనము లేదు.

               కనుక నా అభిప్రాయము వెల్లడింతును.

21.          నాకెవరిపట్ల పక్షపాతము లేదు.

               నేనెవరిని పొగడువాడను కాను.

22.         పొగడుటకు నాకు నేర్పు కూడ లేదు.

               ముఖస్తుతికి పూనుకొందునేని

               దేవుడు నన్ను శిక్షించును.