ప్రభువు యిస్రాయేలును దీవించును

36 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: ”నరపుత్రుడా! నీవు యిస్రాయేలు పర్వతములకిట్లు ప్రవచనము చెప్పుము: యిస్రాయేలు పర్వతములారా! మీరు ప్రభువు పలుకులు ఆలింపుడు.

2. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలు శత్రువులు గర్వాతిశయముతో ‘ఆహా! ఆ పురాతన పర్వతములు మావే’ అని పలికిరి.

3. నీవు నా పేరు మీదుగా ఇట్లు ప్రవచింపుము: యావే ప్రభువు పలుకిది. ఇరుగుపొరుగు జాతులు యిస్రాయేలు కొండలను పట్టుకొని వానిని దోచుకొనినపుడు ఎల్లరును యిస్రాయేలును గేలిచేసిరి.

4. కనుక ఇపుడు ప్రభుడనైన నేను పర్వతములతోను, కొండలతోను, ఏరులతోను, లోయలతోను, పాడువడిన తావులతోను, పాడువడి దోపిడికి గురియై ఇరుగుపొరుగు జాతులనుండి నగుబాట్లు తెచ్చుకొనిన నగరములతోను ఇట్లు చెప్పు చున్నాను.

5. యావే ప్రభుడనైన నేను ఇరుగుపొరుగు జాతులతోను, విశేషముగా ఎదోముతోను కోపావేశ ముతో మ్లాడితిని. ఆ దేశము సంబరముతోను, తృణీకార భావముతోను నా దేశమును స్వాధీనము చేసికొని, దాని గడ్డిబీళ్ళను భుక్తము చేసికొనెను.”

6. కావున నీవు యిస్రాయేలు దేశమును గూర్చి ప్రవచనము చెప్పుము. పర్వతములకును, కొండల కును, ఏరులకును, లోయలకును ఇట్లు చెప్పుము. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు: ”ఇతర జాతులు మిమ్ము అవమానించినవి. కనుక నేను రోషముతోను, ఆగ్రహముతోను మాటలాడుచున్నాను.

7. మీ ఇరుగు పొరుగు జాతులు అవమానము తెచ్చుకొనునని ప్రభుడనైన నేను ఆనబ్టెి చెప్పుచున్నాను.

8. యిస్రాయేలీయులారా! యిస్రాయేలు కొండలపై మీకొరకు చెట్లు మరల చిగిర్చి పండ్లుకాయును. మీరు మరల తిరిగివత్తురు.

9. నేను మీ పక్షముననుండి మిమ్ము ఆదరింతును. మీ పొలములలో మరల సేద్యము చేసి పైరువేయుదురు.

10. నేను మీ ప్రజలను వృద్ధి చేయుదును. మీరు నగరములలో వసింతురు. పాడు వడిన కట్టడములను పునర్నిర్మింతును.

11. నేను మీ ప్రజలను పశువులను వృద్ధి చేయుదును. మీరు పూర్వముకంటె ఎక్కువమంది అగుదురు. మీ సంతానము విస్తరిల్లును. పూర్వము వసించినట్లే మీరు మరల ఆ నేలమీద వసింతురు. ఇంతకు పూర్వము కంటె ఎక్కువగా అభివృద్ధి చెందుదురు. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

12. నా ప్రజలైన యిస్రాయేలీయులారా! నేను మిమ్ము మరల మీ నేలకు కొనివత్తును. అది మీ సొంత దేశమగును. మీకు పుత్రహీనత అనునది ఇక ఉండబోదు.

13. యావే ప్రభుడనైన నేనిట్లు చెప్పుచున్నాను. ప్రజలు ఆ దేశమును నరభక్షకి అని పిలుచుట వాస్తవమే. అది తన ప్రజల పిల్లలను అపహరించినదనియు వారు చెప్పుచున్నారు.

14. కాని ఇప్పినుండి అది నరభక్షకి కాజాలదు. మీ బిడ్డలను అపహరింపజాలదు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

15. మీ దేశము ఇక మీదట జనుల హేళనమును అవమాన వాక్యములను విన నక్కరలేదు. అది ఇకమీదట మీ బిడ్డలను అప హరింపదు. ఇది ప్రభుడనైన నా వాక్కు.”

క్రొత్తజీవితము

16. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 17. ”నర పుత్రుడా! యిస్రాయేలీయులు తమ దేశమున వసించి నపుడు వారు తమ ప్రవర్తనద్వారాను, క్రియలద్వారాను ఆ నేలను మలినముచేసిరి. నా దృష్టిలో వారి ప్రవ ర్తనము ముట్టుతవలె అపవిత్రమైనది.

18. వారు ఆ దేశమున హత్యలుచేసిరి. విగ్రహములద్వారా ఆ నేలను మలినముచేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని.

19. వారి ప్రవర్తనమునకును, క్రియలకును వారిని దండించితిని. వారిని అన్యదేశ ములకు చెదరగ్టొితిని.

20. వారు పోయిన తావు లందెల్ల నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు ‘వీరు ప్రభువు ప్రజలు. కాని ఆయన వీరిని తన దేశము నుండి బహిష్కరించెను’ అని చెప్పుకొనిరి.

21. కాని నా దివ్యనామమును గూర్చి నేను చింతించి తిని. యిస్రాయేలీయులు తాము పోయిన తావు లందెల్ల దానికి అపకీర్తి తెచ్చిరి.

22. నీవు యిస్రాయేలీ యులతో యావే ప్రభుడనైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము. ”నేను మిమ్ముచూచి కాదుగాని, నా దివ్య నామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశములందెల్ల దానికి అవమానము తెచ్చి తిరి.

23. మీరు జాతులమధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరికదా! నేను జాతులమధ్య నా మహానామము యొక్క పావిత్య్రమును వెల్లడి చేయు దును. అప్పుడవి నేను ప్రభుడనని గుర్తించును. ఇది ప్రభుడనైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసికొందును.

24. ప్రతి జాతినుండియు నేను మిమ్ము ప్రోగుజేసి మీ దేశము నకు కొనివత్తును.

25. నేను మీ పై శుభ్రమైన జల ములు చల్లి మీ విగ్రహములనుండియు, మీ మాలి న్యము నుండియు మిమ్ము శుద్ధిచేయుదును.

26. మీకు నూత్నహృదయమును దయచేయుదును. నూతనఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపుగుండెను దయ చేయుదును.

27. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించునట్లును, నా విధులను పాించు నట్లును చేయుదును.

28. అపుడు మీరు నేను మీ పితరులకిచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు. నేను మీకు దేవుడనగుదును.

29. నేను మీ అపవిత్రత నుండి మిమ్ము రక్షింతును. నేను ఆజ్ఞాపింపగా మీకు ధాన్యము పుష్కలముగా లభించును. ఇక కరువుండబోదు.

30. నేను మీ పండ్లచెట్లు, పొల ములు అధికముగా పండునట్లు చేయుదును. కావున ఇక మీదట మీకు కరువుకలుగదు. అన్యజాతులు మిమ్ము హేళనచేయవు.

31. అప్పుడు మీరు దుష్కార్య ములను, మీ అక్రమములను జ్ఞప్తికితెచ్చుకొందురు. మీ పాపములను, హేయమైన కార్యములను తలంచు కొని మిమ్ము మీరే ఛీ కొట్టుకొందురు.

32. యిస్రాయేలీ యులారా! నేను ఈ కార్యములెల్ల మీకొరకు చేయుట లేదు. మీరు మీ చెయిదములను తలంచుకొని అవమాన ముతో మ్రగ్గిపోవలెనని నా కోరిక. ఇది ప్రభుడనైన నా వాక్కు.

33. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను మీ పాపముల నుండి మిమ్ము శుద్ధిచేసిన పిదప మిమ్ము మరల మీ నగరాలలో వసింపనిత్తును. మీరు మీ శిథిలాలయము లను పునర్నిర్మించు కొనవచ్చును.

34. మీ పొలముల ప్రక్కన నడచువారు అవి పాడువడి నాశనమై పోయిన వని గుర్తించిరి. మీరు వానిని మరల సేద్యము చేసికో వచ్చును.

35. ‘ఒకప్పుడు ఎడారివలె ఉన్న ఈ భూమి మరల ఏదెను తోటవలె అయినదని ఎల్లరును చెప్పు కొందురు. చిన్నాభిన్నమై దోపిడికి గురియై నాశనమైన నగరములు మరల జనావాసయోగ్యమై సురక్షిత పట్ట ణములైనవి’ అని ఎల్లరును చెప్పుకొందురు.

36. అప్పుడు చుట్టుపట్ల మిగిలియున్న జాతులు ప్రభుడనైన నేను శిథిల నగరములను పునర్నిర్మింతుననియు, బీడు వడిన పొలములలో మరల చెట్లు నాటుదుననియు గ్రహింతురు. ఇది ప్రభుడనైన నేను పలికిన వాక్కు. నేను దానిని నేరవేర్చి తీరుదును.

37. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను మరల యిస్రాయేలీయులను నా సహాయము అర్థింపనిత్తును. వారు గొఱ్ఱెలమందవలె వృద్ధిచెందుదురు.

38. ఉత్సవ దినమున బలిగా అర్పింపనున్న గొఱ్ఱెలతో యెరూష లేము నిండియుండునుగదా! అట్లే నేనిప్పుడు పాడు వడియున్న నగరములు మరల ప్రజలతో నిండి యుండునట్లు చేయుదును. అప్పుడు వారు నేను ప్రభుడనని గుర్తింతురు.”