నాలుగవ దర్శనము-ప్రధానయాజకుడు

3 1. ప్రభువు మరియొక దర్శనమున ప్రధాన యాజకుడగు యోహోషువ దేవదూత ముందు నిలుచుండియుండుటను   నాకు   చూపించెను. యోహోషువ మీద నేరము మోపుటకై సాతాను అతని  కుడిప్రక్కన  నిలుచుండియుండెను.

2. దేవదూత అతనితో ”సాతానూ! ప్రభువు నిన్ను ఖండించునుగాక! యెరూషలేమును కోరుకొను ప్రభువు నిన్ను గద్దించును గాక! ఈ నరుడు నిప్పునుండి బయటకు తీసిన కొరివి వలె ఉన్నాడు” అని అనెను.

3. యోహోషువ మురికిబట్టలతో దేవదూత ముందట నిలుచుండియుండెను.

4. దేవదూత తన యెదుట నిలుచుండియున్న పరిచారకులతో ”మీరితనికి మురికిబట్టలు తొలగింపుడు” అని చెప్పెను. అంతట అతడు యోహోషువతో ”నేను నీ పాపములను తొలగించితిని. నీకు ప్రశస్థమైనదుస్తులు ఇత్తును” అని అనెను.

5. అతడు యోహోషువ తలమీద తెల్లనిపాగా పెట్టుడని ఆ పరిచారకులను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ప్రభువుదూత అచట నిలుచుండి యుండగా వారు యోహోషువకు ప్రశస్థమైనదుస్తులు తొడిగించిరి.

6. అటుపిమ్మట దేవదూత యోహోషువతో ఇట్లనెను: 7. ”సైన్యములకధిపతియగు ప్రభువు పలు కులివి. నీవు నా ఆజ్ఞలను పాించి నేను నీకు నియ మించిన బాధ్యతలు నెరువేర్తువేని నా దేవళము పైనను, దాని ఆవరణములపైనను అధికారము నెరపుదువు. నేను నా సన్నిధిలోనుండు దేవదూతల మనవులను ఆలించినట్లే నీ మనవులను గూడ ఆలింతును.

8. ప్రధానయాజకుడగు యోహోషువా! అతని తోడి యాజకులారా! మీరెల్లరును వినుడు. మీరు భావి శుభమునకు సూచకముగా ఉందురు. నేను చిగురు  అనబడు నా సేవకుని కొనివత్తును.

9. నేను యోహోషువ యెదుట ఒక్క రాతి నుంచె దను. దానికి ఏడు కన్నులుండును. దానిపై లేఖన మును చెక్కుదును. ఒక్క రోజులోనే నేను ఈ దేశము యొక్క పాపమును పరిహరింతును.

10. ఆ దినము వచ్చినపుడు మీరెల్లరును ఒకరినొకరు పిలుచుకొనుచు సుఖశాంతులతో మీ అంజూరపుచెట్ల క్రిందను, ద్రాక్షల చెట్ల క్రిందను కూర్చుందురు” ఇదియే సైన్యముల కధిపతియగు ప్రభువు వాక్కు.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము