2 1. దేవదూతలు మరల దేవుని సమక్షమునకు వచ్చిరి. వారితోపాటు సాతానుకూడ వచ్చెను 2. దేవుడు సాతానుని నీవు ఎక్కడనుండి వచ్చితివి అని అడుగగా అతడు నేను భూలోకమున అటునిటు సంచారము చేసి వచ్చితిని అని ప్రత్యుత్తరమిచ్చెను.

3. దేవుడతనితో ”నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అతడు ఋజువర్తనుడును, న్యాయవంతు డును మరియు దేవునిపట్ల భయభక్తులు కలిగి, పాపమునకు దూరముగా ఉండువాడు. అి్టవాడు మరియొకడు భూలోకమునలేడు. నీవే నిష్కారణముగా నాచే అతనిని నాశనము చేయుటకు నన్ను ప్రేరేపించి నను, అతడు ఇంకను తన నీతిని వదలక, తన నడవడికలో నిలకడగా ఉన్నాడు” అనెను.

4.సాతాను ”నరుడు తన చర్మమును కాపాడుకొనుటకు చర్మ మును, తన ప్రాణములను దక్కించుకొనుటకు సమస్త మును త్యజించును.

5. ఇంకొకసారి నీవు చేయిచాపి అతని దేహమును మొత్తినయెడల, అతడు నీ ముఖ మెదుటనే నిన్ను దూషించి నిన్నువిడనాడును” అని పలికెను.

6. దేవుడు సాతానుతో ”సరియే. యోబును నీ ఆధీనమున ఉంచుచున్నాను. నీవు అతని ప్రాణము జోలికి మాత్రము పోవలదు” అని చెప్పెను.

7. అంతట సాతాను దేవుని సమక్షమునుండి వెడలిపోయెను. అతడు యోబును అరికాలినుండి నడినెత్తివరకు వ్రణములతో నింపెను.

8. యోబు కసవు దిబ్బమీద కూర్చుండి చిల్లపెంకుతో తన వ్రణములను గోకుకొన నారంభించెను.

9. అతని భార్య ”నీవింకను యదార్ధత తను వదలవా? దేవుని దూషించి మరణించుము” అనెను.

10. అందుకు యోబు ”నీవు మూర్ఖురాలు మ్లాడినట్లు మ్లాడుచున్నావు. దేవుడు మనకు మేలులు దయచేసినపుడు స్వీకరించితిమి, మరి కీడు లను పంపినపుడు స్వీకరింపవలదా?” అనెను. ఇన్ని దురదృష్టములు వాిల్లినను, యోబు ఏ పాపమును కట్టుకొనలేదు, దేవుడు అన్యాయము చేసెను అని పెదవులతోసైతము పలుకలేదు.

11. యోబునకు దుర్దినములు ప్రాప్తించినవని అతడి ముగ్గురు స్నేహితులు విని, అతనికొరకు దుఃఖించు టకును, అతనిని ఓదార్చుటకును వారు తమతమ పట్టణములనుండి బయలుదేరిరి. వారు తేమాను నగరవాసి ఎలీఫసు, షూహా దేశీయుడు బిల్దదు, నామా దేశీయుడు సోఫరు. వారు మువ్వురు ఒకచోట కలిసి కొని, యోబువద్దకు పోవుటకు నిర్ణయించుకొనిరి.

12. ఆ మిత్రులు యోబుని దూరమునుండి చూచిరి. కాని అతడిని గుర్తుపట్టజాలరైరి. కనుక వారు పెద్దగా శోకించి బట్టలు చించుకొని, తలమీద దుమ్ము చల్లు కొనిరి.

13. వారు యోబు ప్రక్కనే నేలమీద చతికిల బడి ఏడురాత్రులు, ఏడు పగళ్ళు మౌనము వహించిరి. యోబు తీవ్రమైనబాధను అనుభవించుచుండెనని గ్రహించి ఆ స్నేహితులతడితో ఒక్క పలుకైనను పలుక జాలరైరి.

Previous                                                                                                                                                                                                Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము