ఒడంబడిక4- సున్నతి

1. అబ్రామునకు తొంబదితొమ్మిదియేండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ”నేను సర్వశక్తి మంతుడగు దేవుడను. నా సన్నిధిన మెలగుము. నిర్దోషివైై యుండుము.

2. నేను నీతో ఒడంబడిక చేసికొందును. నీ సంతతిని విస్తరిల్లజేయుదును” అనెను.

3. అబ్రాము దేవుని యెదుట సాగిలబడెను. దేవుడు అతనితో మ్లాడుచు 4.”నేను నీతో ఒడంబడిక చేసికొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రివగుదువు.

5. ఇకముందు నీకు అబ్రాము1 అను పేరుండదు. అబ్రహాము2 అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేసితిని.

6. నీ సంతతిని పెంపొందింపజేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును. నీనుండి రాజులు పుట్టుదురు.

7. నీయెడ, నీసంతతియెడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరములవరకు శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకును నీసంతతికిని నేనే దేవుడను.

8. మీకు కానిదేశముగా ఉన్న కనాను భూమిని మొత్తము నీకును, నీ తరువాత వారికిని శాశ్వతభోగముగా చేయుదును. నీ తరువాతవారికి సైతము నేనే దేవుడను” అని చెప్పెను.

9. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను: ”నీవును, నీసంతతివారును తరతరములవరకు నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలయును.

10. నాకును, నీకు నీ తర్వాతి తరములవారికిని నడుమ నేను చేసిన ఒడంబడికను మీరెల్లరు పాింపవలెనన్నచో, మీలో ప్రతిపురుషుడును సున్నతి పొందవలయును.

11. మీరు చర్మాగ్రమున సున్నతి చేసికొనవలయును. ఇదియే మన నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా ఉండును.

12. తరతరమున నీ యింట ప్టుినవారు, నెత్తురుపొత్తు లేకపోయినను నీవు సొమ్మిచ్చికొన్నవారు ఎనిమిదవనాడు సున్నతి పొందవలయును.

13. నీ యింట పుట్టినవారికి, నీవు సొమ్మిచ్చి కొన్నవారికి సున్నతి చేయుము. ఈ విధముగా నా నిబంధనము  శాశ్వతనిబంధనముగా మీ శరీరములందు ముద్రిత మగును.

14. చర్మాగ్రమున సున్నతిపొందని ప్రతి పురుషుడు తనవారినుండి వెలివేయబడును. అతడు నా ఒడంబడికను మీరినట్లేయగును.”

15. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను: ”ఇక నీ భార్యను ‘సారయి’ అని పిలువకుము. ‘సారా’3 అని మాత్రమే పిలువుము.

16. నేను ఆమెను ఆశీర్వదింతును. ఆమెవలన నీకు కొడుకు పుట్టును. నేను ఆమెను దీవింతును. ఆమె అనేక జాతులకు తల్లిఅగును. అనేకజాతుల రాజులకు అమ్మయగును.”

17. ఈ మాటలువిని అబ్రహాము దేవునియెదుట సాగిలబడెను. అతడు తనలోతాను నవ్వుకొనెను. ‘కాికి కాళ్ళుచాచిన నూరేండ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా? తొంబదియేండ్ల సారా కనుటయా?’ అని అనుకొనెను.

18. ఇట్లనుకొని అతడు దేవునితో, ”ప్రభూ! నీవు యిష్మాయేలును చల్లనిచూపు చూచిన నాకదియే పదివేలు” అని అనెను.

19. కాని దేవుడు ఇట్లు చెప్పెను: ”అది కాదు! నీ భార్య సారా తప్పక నీకు కుమారుని కనును. అతనికి ఈసాకు4 అను పేరు పెట్టుము. నేను అతనితో ఒడంబడిక చేసికొందును. అతని తరువాత తరములతోకూడా  నేను శాశ్వతముగా ఒడంబడిక చేసికొందును.

Pic taken from jasonbandura.com

20. ఇక యిష్మాయే లందువా! అతనికొరకు నీవు చేసిన మనవిని వింని. అతనిని ఆశీర్వదించితిని. అతనికి సంతానాభివృద్ధి అగునట్లు చేయుదును. అతని సంతతిని విస్తరిల్ల జేయుదును. అతడు పండ్రెండుగురు రాజులకు తండ్రి యగును. అతనినుండి ఒక మహాజాతిని రూపొందించె దను.

21. కాని ఈసాకుతో మాత్రమే నేను ఒడంబడిక చేసికొందును. రానున్నయేట ఈ ఋతువునందే సారా నీకు ఆ బిడ్డనుకనును.”

22. ఇట్లు అబ్రహాముతో మ్లాడిన తరువాత దేవుడు అతనిని వీడి పరమునకు వెడలిపోయెను.

23. దేవుడు చెప్పినరీతిగా అబ్రహాము తన కుమారుడు యిష్మాయేలును, ఇంటప్టుిన ప్రతి పురుషుని, సొమ్మిచ్చికొన్న ప్రతిపురుషుని, ఇంటిలో ఉన్న ప్రతిపురుషుని తీసికొనివచ్చి ఆ దినమందె వారి చర్మాగ్రమున సున్నతి చేసెను.

24. తన చర్మాగ్రమున సున్నతి చేసికొన్నప్పుడు అబ్రహాము తొంబదితొమ్మిది యేండ్ల యీడువాడు.

25. సున్నతి చేసినప్పుడు అతని కుమారుడు యిష్మాయేలు వయస్సు పదుమూడేండ్లు.

26. అబ్రహాము యిష్మాయేలు ఇద్దరును ఒకనాడే సున్నతి చేసికొనిరి.

27. వారితోపాటు అబ్రహాము ఇంటిలో పుట్టినవారికి, పరదేశులనుండి సొమ్ముకు కొన్నవారికి అందరకును సున్నతి జరిగెను.

Previous                                                                                                                                                                                                 Next                                                                                      

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము