5. గిద్యోను – అబీమెలెకు

గిద్యోను పిలుపు

6 1. యిస్రాయేలీయులు మరల దుష్కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. అందుచే యావే వారిని ఏడేండ్లు మిద్యానీయుల వశము చేసెను.

2. మిద్యానీయులు యిస్రాయేలీయులను నేలబ్టెి కాల రాచిరి. యిస్రాయేలీయులు మిద్యానీయులకు భయ పడి కొండబొరియలలో దుర్గములలో దాగుకొనజొచ్చిరి.

3-4. యిస్రాయేలీయులు పైరువేయగనే మిద్యానీ యులు, అమాలేకీయులు, తూర్పుదేశపు ప్రజలుకూడ దాడిచేయవచ్చి పడెడివారు. యిస్రాయేలు రాజ్యముననే గుడారులు పన్నుకొని గాజావరకు వారి పైరుపంటలు నాశనముచేసెడివారు.వారి ఎడ్లను, గొఱ్ఱెలను, గాడిదలను తోలుకొనిపోయెడివారు. చివరకు యిస్రాయేలీయుల కేమియు మిగిలెడిదికాదు.

5. మిద్యానీయులు తమ పశువులమందలతో గుడారములతో వచ్చి మిడుతల దండువలె దిగెడివారు. వారినిగాని, వారి ఒంటెలను గాని లెక్కింపవలనుపడదు. వారు కాలుప్టిెన నేల వల్లకాడు కావలసినదే.

6. మిద్యానీయుల దోపిడి వలన యిస్రాయేలీయులకు పొట్టకూడు కూడ కరవై పోయెను. అందుచే వారు యావేకు మొరపెట్టుకొనిరి.

ప్రవక్త సందేశము

7-8. యిస్రాయేలీయుల మొరవిని ప్రభువు వారి చెంతకు ఒక ప్రవక్తను పంపెను. అతడు ”యిస్రాయేలు దేవుడైన ప్రభువు సందేశమిది: నేను మిమ్ము దాస్యగృహము ఐగుప్తునుండి వెలుపలికి కొని వచ్చితిని.

9. ఐగుప్తీయులనుండియు, మిమ్ము బానిస లుగా నేలిన యజమానులనుండియు మిమ్ము కాపాడి తిని. వారిని మీ ఎదుినుండి తరిమివేసి వారి భూములను మీ వశముచేసితిని.

10. మీ దేవుడైన యావేను నేనే కనుక మీరు అమోరీయుల మండల మున వసించునపుడు వారి దైవములను సేవింప వలదని ఆజ్ఞాపించితిని. అయినను మీరు నా మాట పెడచెవిని బ్టెితిరిగదా!” అని వారిని మందలించెను.

దేవదూత గిద్యోనునకు దర్శనమిచ్చుట

11. యావేదూత వచ్చి ఒఫ్రా చెంతగల సింధూర వృక్షముక్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబీయెస్రీయుని వంశమునకు చెందిన యెవాషునిది. యెవాషు కుమా రుడగు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండుటకై, ద్రాక్షపండ్లను త్రొక్కించు గాిలోనే గోధుమలను దుళ్ళ గొట్టుచుండగా, 12. ప్రభువుదూత అతనికి ప్రత్యక్షమై ‘శూరాగ్రణి! యావే నీకు తోడైయున్నాడు” అని పలి కెను.

13. గిద్యోను ‘అయ్యా! యావే తోడైయున్నచో మాకు ఈ అగచాట్లేల పట్టును? ప్రభువు మమ్ము ఐగుప్తు నుండి తీసికొనివచ్చెనని మా పూర్వులు వచించెదరు గాని, ఆ అద్భుతకార్యములన్నియు నేడేమైనవి? యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను గదా!” అనెను.

14. యావే అతని వైపు చూచి ”నీవు బలవంతు డవై మిద్యానీయుల మీదికి పొమ్ము. యిస్రాయేలీయు లను శత్రువులబారి నుండి రక్షింపుము. నేనే నిన్ను పంపుచున్నాను సుమా!” అని చెప్పెను.

15. గిద్యోను ”ప్రభూ! నేనేమి, యిస్రాయేలీయులను రక్షించు టేమి? మనష్షే తెగన మేము ఊరుపేరులేనివారము. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువయు లేదు” అని పలికెను.

16. యావే అతనితో ”ఓయి! నేను నీకు తోడైయుందును. నీవు మిద్యానీయులను ఏకనరునివలె చితుక గొట్టెదవు” అని చెప్పెను.     

17. గిద్యోను యావేతో ”నేను నీ దయకు పాత్రుడ నైతినేని ఇపుడు నాతో మాటలాడినది నీవేననుటకు రుజువుగా నాకొక గురుతునిమ్ము.

18. నేను వెడలి పోయి నా బలియర్పణమును గొనివచ్చి నీ యెదుట నిడువరకు నీవిటనుండి సాగిపోవలదు” అని మనవి చేసికొనెను. అతడు ”నీవు వచ్చువరకు నేనిచటనే ఉందును పొమ్ము” అనెను.

19. గిద్యోను వెడలిపోయి ఒక మేకపిల్లను కోసెను. కుంచెడు పిండితో పొంగనిరొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిడికొని మాంసపు చారును చ్టిలో పోసికొని సింధూరము చెంతకు గొనివచ్చెను.

20. ప్రభువుదూత అతనితో ”మాంస మును పొంగనిరొట్టెలను రాతిపై పెట్టుము. మాంసపు చారును వానిపై పోయుము” అని చెప్పెను. అతడట్లే చేసెను.

21. ప్రభువుదూత తన చేతికర్రను చాచి దానికొనతో మాంసమును, పొంగనిరొట్టెలను తాకెను. వెంటనే రాతినుండి గుప్పున మంటలెగసి మాంసమును, పొంగనిరొట్టెలను కాల్చివేసెను. అంతట ప్రభువుదూత అతనికి అదృశ్యమైపోయెను.

22. గిద్యోను అతడు దేవదూతయని గ్రహించి ”అయ్యో ప్రభూ! నేను దేవదూతను ముఖాముఖి చూచితిని గదా!” అనుకొని భయపడెను.

23. కాని యావే ”నీకు శుభమగుగాక! భయపడ వలదు. నీకు ఏ అపాయమును కలుగదు” అని అతనికి అభయమిచ్చెను.

24. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలిపీఠమును నిర్మించెను. దానికి సమాధాన కర్తయైన యావే అని పేరిడెను. నేికిని ఆ బలిపీఠమును అబీయెస్రీయుల ఒఫ్రా మండల మున చూడవచ్చును.

గిద్యోను – బాలు

25. ఆ రాత్రి యావే గిద్యోనుతో ”మీ నాయనకు ఒక బలిసినకోడెదూడ కలదు గదా! దానిని గైకొనుము. అతడు నిర్మించిన బాలుపీఠమును పడ ద్రోయుము. దాని చెంతగల దేవతాస్తంభమును కూడ నరికి వేయుము.

26. ఆ కుప్పమీదే కొలతల ప్రకార ముగా యావేకొక బలిపీఠము నిర్మింపుము. నరికి వేసిన దేవతాస్తంభపు కొయ్యను కాల్చి కోడెదూడను బలిపీఠముపౖౖె సంపూర్ణదహనబలిగా అర్పింపుము” అని చెప్పెను.

27. గిద్యోను తన పనివారిని పది మందిని వెంటనుంచుకొని ప్రభువు ఆజ్ఞాపించిన రీతినే చేసెను. కాని అతడు తన కుటుంబ జనమునకు, పట్టణ జనమునకు దడిసెను. కనుక పగిపూట గాక రేయిన యావే ఆజ్ఞ నెరవేర్చెను. 28. మరునాి ప్రొద్దున నగరవాసులు మేల్కొనిచూడగా అట బాలు బలిపీఠము నిర్మూలమైయుండెను. ఆ చెంతగల దేవతా స్తంభమును కూలియుండెను. ఆ తావున క్రొత్తగా నిర్మింపబడిన బలిపీఠముపై పోతరించిన కోడెదూడ సంపూర్ణదహనబలిగా సమర్పింపబడియుండెను.

29. పురవాసులందరు ఆ పని చేసినవాడు ఎవడాయని విస్తుపోయిరి. సంగతి తెలిసికొని యోవాషు కుమారుడు గిద్యోను సాహసముతో అంతి పనిచేసెనుగదా! అనుకొనిరి.

30. కనుక పౌరులు యోవాషుతో ”నీ కుమారుని ఇచికి కొనిరమ్ము. అతడు బాలు బలి పీఠము కూలద్రోసి దాని చెంతగల దేవతాస్తంభమును తెగనరికెను గనుక తప్పక చంపనర్హుడు” అనిరి.

31. కాని యెవాషు తన యొద్దకు వచ్చిన పౌరులను చూచి ”మీరు బాలును సమర్థింతురా? అతనిని మీరు రక్షింప గలరా? బాలును సమర్థించువారందరును ప్రొద్దు పొడవకముందే చంపబడుదురుగాక! బాలు దేవుడే యైన పక్షమున, ఇపుడు తన బలిపీఠము నాశనమైనది గనుక తనను తానే సమర్థించుకొనును గాక!” అనెను.

32. నాినుండి గిద్యోనునకు యెరూబాలు1 అని పేరు వచ్చెను. ఎందుకన ప్రజలు ”బాలుపీఠమును గిద్యోను కూలద్రోసెను గనుక బాలు అతనితో వాదించుగాక!” అని అనిరి.

యుద్ధ సన్నాహములు

33. అంతట మిద్యానీయులు, అమాలెకీయులు, తూర్పు దేశవాసులు పోరునకు తలపడి యోర్దాను నది దాివచ్చి యెస్రెయేలు మైదానమున గుడార ములు పన్నిరి.

34. అపుడు యావేఆత్మ గిద్యోనును ఆవేశింపగా అతడు బాకానూదెను. అబీయెస్రీయు లందరు అతనిని అనుసరించిరి.

35. గిద్యోను మనష్షే యులకు వార్తనంపగా వారును అతని వెంటనింరి. ఆషేరు, సెబూలూను, నఫ్తాలి తెగలవారికి కబు రంపగా వారును గిద్యోనుతో చేరిరి.

గొఱ్ఱె ఉన్నితో పరీక్ష

36. అపుడు గిద్యోను ప్రభువుతో ”నీవు సెలవిచ్చి నట్లు యిస్రాయేలును నా ద్వారా రక్షింపపూనెదవేని ఇట్లు జరుగునుగాక!

37. నేను కళ్ళమున గొఱ్ఱెఉన్నిని ఉంచెదను. ఆ ఉన్నిమీద మాత్రమే మంచుపడి మిగిలిన నేలయంతయు పొడిగా ఉండినచో, నీవు నుడివినట్లే నా మూలమున యిస్రాయేలును రక్షింతు వని తెలిసికొందును” అనెను.

38. అతడు అడిగినట్లే మంచుపడెను. అతడు మరునాడు వేకువనే లేచి గొఱ్ఱెఉన్నిని పిండిచూడగా ముంతెడు మంచినీళ్ళు కారెను.

39. గిద్యోను మరల యావేతో ”నేను ఇంకొక్క మనవి చేసికొన్నచో ప్రభువులవారు ఆగ్రహింప కుందురు గాక! గొఱ్ఱెఉన్నితో ఇంకొకమారు పరీక్షించి చూచెదను. ఈ మారు గొఱ్ఱెఉన్ని మాత్రము పొడిగా నుండి కళ్ళమందంతట మంచుపడియుండునుగాక!” అనెను.

40. నాిరాత్రి యావే అట్లే చేసెను. గొఱ్ఱెఉన్ని మాత్రము పొడిగానుండెను. కళ్ళమందంతటను మంచుపడియుండెను.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము