ప్రాయశ్చిత్త దినము

16 1-2. ప్రభువునకు అపవిత్రమైన అగ్నిని సమర్పించి అహరోనుని ఇద్దరు కుమారులు ప్రాణములు కోల్పోయినపిదప ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను: ”నీ సోదరుడైన అహరోనుతో ఇట్లు చెప్పుము. అతడు ప్రత్యేక కాలమున మాత్రమే అడ్డుతెర దాి లోపలి గర్భగృహముననున్న మందసము మీది కరుణా పీఠము చెంతకుపోవచ్చును. ఈ ఆజ్ఞ మీరెనేని అతడు చచ్చును. నేను కరుణాపీఠముమీద మేఘములో సాక్షాత్కరింతును.

3. పాపపరిహారబలికిగాను కోడెను, సంపూర్ణదహనబలికిగాను పొట్టేలును కొనివచ్చిన పిదప వాితో అతడు గర్భగృహములోనికి ప్రవేశింప వచ్చును.

4. అటుల ప్రవేశింపకముందు అతడు స్నానముచేసి పవిత్రములయిన నారచొక్క, ఒంికి ఆనియుండు నారలాగు, నారకడికట్టు, నార తలపాగా ధరింపవలయును.

5. యిస్రాయేలు సమాజము పాపపరిహారబలి కొరకు రెండుమేకపోతులను, సంపూర్ణదహన బలి కొరకు ఒక పొట్టేలును కొనివచ్చి అహరోనునకు ఈయ వలయును.

6. అతడు తన స్వంత పాపములను తొలగించుటకై మొదట కోడెను పాపపరిహారబలిగా అర్పించుచూ తనకును, తన కుంటుంబమునకును ప్రాయశ్చిత్తము చెల్లించును.

7. పిమ్మట రెండు మేకపోతు లను సమావేశపుగుడార ప్రవేశద్వారమువద్ద, ప్రభువు సాన్నిధ్యమున నిలబెట్టవలెను.

8. అపుడు అహరోను, ప్రభువు నిమిత్తము మరియు అసాసేలు1 నిమిత్తము రెండుమేకలమీద రెండుచీట్లు వేయవలయును.

9. ప్రభువు నిమిత్తము చీిపడిన మేకను అహరోను తీసు కొనివచ్చి పాపపరిహారబలిగా అర్పింవలయును.

10. అసాసేలు నిమిత్తము చీిపడిన మేకను ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని ఎడారిలోనికి తోలివేయుటకు ప్రభువు సమక్షమున దానిని ప్రాణము లతో ఉంచవలయును.

11. అహరోను తన పాపములకును, తన ఇంి వారి పాపములకును పరిహారముగా కోడెను బలియిచ్చిన పిదప, 12. ప్రభువు సన్నిధిలోనున్న ధూపపీఠముమీది నిప్పుకణికలతో నింపబడిన ధూప పాత్రమును, తన గుప్పిళ్ళతో మేలిమి సాంబ్రాణిని గైకొని అడ్డుతెర లోపలికి వాిని తెచ్చి తాను చావ కుండునట్లు 13. అతడు ప్రభువుఎదుట సాంబ్రాణి పొగవేసి ఆ పొగమబ్బుతో మందసముమీది కరుణా పీఠమును కప్పివేయవలయును.

14. అటు తరువాత అతడు చేతివ్రేలితో కోడెనెత్తురును కొంత తీసికొని కరుణాపీఠము మీద తూర్పువైపు చిలుకరింపవల యును. కరుణాపీఠము ఎదుట నేలమీద ఏడు మార్లు చిలుకరింపవలయును.

15. ఆ తరువాత అతడు ప్రజల పాపపరిహార బలికొరకు నియమింపబడిన మేకను వధించి దాని నెత్తురునుగూడ అడ్డుతెర లోపలికి కొనిపోవలయును. కోడె నెత్తురునువలె ఈ మేకనెత్తురునుగూడ కరుణా పీఠముమీదను, దానిముందటను చిలుకరింపవలయును.

16. ప్రజల పాపమువలనను, వారి అపవిత్రతవలనను, అతిక్రమములవలనను మైలపడిపోయిన పరిశుద్ధస్థల మునకు అతడు ఈరీతిగా నిష్క ృతి చేయవలయును. శిబిరము మధ్యలోనుండు సమావేశపుగుడారము ప్రజల అపవిత్రతవలన మైలపడిపోయినది. దానికిని అహరోను పై రీతిగానే ప్రాయశ్చిత్తము చేయవలయును.

17. పవిత్రస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోయినదిమొదలు, అతడు తన నిమిత్తమును, తన ఇంివారి నిమిత్తమును, యిస్రా యేలీయుల సమస్తసమాజము నిమిత్తమును ప్రాయ శ్చిత్తముచేసి బయటకు వచ్చువరకు ఏ మనుష్యుడును సాన్నిధ్యపు గుడారములో ఉండరాదు.

18. అంతట అహరోను ప్రభువు సాన్నిధ్యమునున్న బలిపీఠము చెంతకువచ్చి దానికికూడ ప్రాయశ్చిత్తము చేయ వలయును. ఎద్దునెత్తురును, మేకనెత్తురును కొద్దిగా తీసికొని ఆ పీఠము కొమ్ములకు పూయవలయును.

19. చేతివ్రేలితో ఆ నెత్తురును ఏడుమార్లు పీఠముమీద చిలుకరింపవలయును. ఈ రీతిగా అతడు యిస్రా యేలీయుల అపవిత్రతనుండి బలిపీఠమును శుద్ధిచేసి దానిని పవిత్రము చేయును.

పాపములను మోసికొనిపోవు మేక

20. పవిత్రస్థలమునకును, సమావేశపు గుడార మునకును, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసిన పిదప అహరోను అసాసేలుకొరకు ఉద్దేశింపబడిన రెండవమేకను కొనిరావలయును.

21. అతడు ఆ మేక మీద చేతులుచాచి యిస్రాయేలీయుల అక్రమములను, నేరములను, పాపములను ఒప్పుకొని వానినెల్ల దాని తలమీద మోపవలయును. ఆ పిమ్మట ముందుగానే నియమింపబడిన ఒక మనుష్యునిచే దానిని ఎడారికి తోలింపవలయును.

22. ఆ మేక ప్రజల పాపముల నెల్ల తనపై వేసికొని ఎడారికి మోసికొనిపోవును.

23. తదుపరి అహరోను గుడారమునకు తిరిగి వచ్చి మునుపు గర్భగృహమున ప్రవేశించుటకు గాను తాను తాల్చియున్న నారవస్త్రములను తొలగించి వానిని అచట వదలివేయును.

24. అతడు పవిత్ర స్థలమున స్నానముచేసి సొంతబట్టలను తాల్చి వెలుపలికి వచ్చి తన పాపములకును, ప్రజలపాపములకును నిష్కృతిగా దహనబలులు అర్పింపవలయును.

25. ఆ పశువుల క్రొవ్వును పాపపరిహారబలిగా పీఠముమీద కాల్చి వేయవలయును.

26. అసాసేలు నిమిత్తము చీిపడిన మేకను తోలివచ్చినవాడు బట్టలు ఉతుకుకొని స్నానముచేసి శిబిరమునకు రావచ్చును.

27. పరిహారబలిగా అర్పింపబడిన కోడెనెత్తురును, మేకనెత్తుిని పాపము లకు ప్రాయశ్చిత్తము చేయుటకు గర్భగృహములోనికి కొనిపోయిరిగదా! వాని కళేబరములను శిబిరము వెలుపలికి కొనిపోవలయును. అచట వానిచర్మమును, మాంసమును, పేడను కాల్చివేయవలయును.

28. వానిని దహించినవాడు బట్టలు ఉతుకుకొని స్నానము చేసిన తరువాత శిబిరమునకు తిరిగివచ్చును.

ప్రాయశ్చిత్త దినమును పాింపవలయును

29. ఇవి మీకు శాశ్వతనియమములు కావల యును. ఏడవనెల పదియవదినము యిస్రాయేలీ యులును, వారితో వసించు పరదేశులును పనిని విరమించుకొని ఉపవాసము ఉండవలయును.

30. ఆ దినమున మిమ్ము శుద్ధిచేయుటకుగాను మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడును. దాని వలన మీ పాపములెల్ల తొలగి మీరు దేవుని ఎదుట దోషములేని వారగుదురు.

31. అది మీకు విశ్రాంతి దినము, ఉపవాసదినము. ఈ నియమములు మీకు కలకాలము వర్తించును.

32. అభిషేకము పొంది తన తండ్రికి అను యాయిగా నియమింపబడిన ప్రధానయాజకుడు మాత్రమే పై ప్రాయశ్చిత్తము జరుపుటకు అర్హుడు.   అతడు పవిత్ర నారవస్త్రములను ధరించి, 33. పవిత్ర స్థలమునకును, సమావేశపుగుడారమునకును, పీఠము నకును, యాజకులకును, ప్రజలకును ప్రాయశ్చిత్తము చేయును.

34. ఈ నియమములు మీకు కలకాలము వర్తించును. యిస్రాయేలీయుల పాపములకు ప్రాయ శ్చిత్తము చేయుటకు ఈ కట్టడను ఏడాదికి ఒకమారు జరిపింపవలయును.” మోషే ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసెను.

Previous                                                                                                                                                                                                  Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము