క్రూరులైన శత్రువుల నడుమ చిక్కుకొనుట

ప్రధానగాయకునికి  దావీదు సౌలువద్ద నుండి గుహలోనికి పారిపోయినపుడు అల్‌తష్‌హెత్‌ అను రాగముమీద పాడదగిన, అతడు రచించిన గీతము

57 1.      ప్రభూ! నా మీద దయజూపుము,

                              నా మీద దయజూపుము.

                              నేను నిన్నాశ్రయించితిని.

                              అపాయములెల్ల తొలగిపోయినదాక

                              నేను నీ రెక్కలమాటున దాగుకొందును.

2.           నా అక్కరలెల్ల తీర్చువాడును,

               మహోన్నతుడునైన దేవునికి నేను మొరపెట్టెదను.

3.           అతడు ఆకసమునుండి నా మొర విని

               నన్ను కాపాడునుగాక!

               నా మీదికి ఎత్తి వచ్చువారిని అడ్డగించునుగాక!

               తన కరుణను విశ్వసనీయతను

               నా చెంతకు పంపునుగాక!

4.           నేను సింగముల నడుమ చిక్కుకొింని.

               అవి నన్ను మ్రింగుటకు కాచుకొనియున్నవి.

               వాి కోరలు బాణములవలెను

               బల్లెములవలెను ఉన్నవి.

               వాి నాలుకలు వాడియైన కత్తులవలె ఉన్నవి.

5.           దేవా! నీవు మింకిపైగా ఎగయుము.

               ఈ భూమినంతిని నీ తేజస్సుతో నింపుము.

6.           విరోధులు నా పాదములకు ఉరులు పన్నిరి.

               నేను విచారమువలన క్రుంగిపోతిని.

               వారు నన్ను కూల్చుటకు గోతిని త్రవ్విరి.

               కాని తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి.

7.            దేవా! నా హృదయము స్థిరముగా నున్నది,

               నా హృదయము దృఢముగా నున్నది.

               నేను నీపై పాటలు పాడి నిన్ను స్తుతింతును.

8.           నా ప్రాణమా! మేలుకొనుము!

               వీణతంత్రీవాద్యము మేల్కొనునుగాక!

               నేను ఉషస్సును మేలుకొల్పెదను.

9.           ప్రభూ! నేను వివిధజాతులనడుమ

               నిన్ను వినుతించెదను.

               బహుజనులనడుమ నిన్ను స్తుతించెదను.

10.         నీ కృప ఆకాశమంత ఉన్నతమైనది.

               నీ విశ్వసనీయత మేఘమండలమంత ఎత్తైనది.

11.           దేవా! నీవు మింకి పైగా ఎగయుము

               ధాత్రినంతిని నీ తేజస్సుతో నింపుము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము