యిస్రాయేలు

ప్రభువు రక్షణమును బడయవచ్చును

50 1. ప్రభువు ఇట్లనుచున్నాడు:

                              ”నేను మీ తల్లిని విడనాడినట్లు

                              పరిత్యాగపత్రిక ఏమైన ఉన్నదా?

                              నేను నా ఋణదాతలకెవనికైనను

                              మిమ్ము బానిసలనుగా అమ్మివేసితినా?

                              మీ తప్పులకు గాను

                              మీరే బానిసలుగా అమ్ముడుపోతిరి.

                              మీ పాపములకుగాను

                              నేను మీతల్లిని విడనాడ వలసివచ్చినది.

2.           నేను రక్షింపవచ్చినపుడు

               నీ ప్రజలేల అంగీకరింపలేదు?

               నేను పిలిచినపుడు

               వారు ఏల ప్రత్యుత్తరమీయలేదు?

               నా చేయి విమోచింపలేనంత కురచయైపోయెనా?

               వారిని రక్షించుటకు నాకు శక్తిలేదా?

               నేను ఒక్క ఆజ్ఞ ఈయగనే

               సముద్రము ఎండిపోవును,

               ఏరులు ఎడారియగును.

               వానిలోని చేపలు నీరులేక నశించును,

               దప్పికగొని చచ్చును.

3.           నేను ఆకాశమును నల్లబరతును.

               అది దుఃఖముతో గోనె తాల్చినదో

               అన్నట్లు కన్పించును.”

ప్రభువు సేవకునిగూర్చి

మూడవగీతము

1. సేవకుని సంభాషణ

4.           ప్రభువైన దేవుడు

               నాకు బోధచేయు శక్తిని అనుగ్రహించెను.

               నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకుగాను

               ఆయన నాకు సంభాషణాశక్తిని దయచేసెను.

               శిష్యులు వినునట్లుగ నేనును వినుటకై

               ప్రతి ఉదయమున ఆయన నాకు

               విను బుద్ధిని ప్టుించెను. 

5.           ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను.

               నేను ఆయనకు అడ్డుచెప్పలేదు.

               ఆయన మాట పెడచెవినిపెట్టలేదు.

6.           నన్ను మోదువారికి

               నేను నా వీపును అప్పగించితిని.

               వారు నా గడ్డపు వెండ్రుకలను

               లాగివేయుచుండగా నేను ఊరకుింని.

               నా మొగముమీద ఉమ్మివేసి

               నన్ను అవమానించుచుండగా

               నేను నా మొగమును దాచుకొనలేదు.

7.            ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనునుగాన,

               వారు కలిగించు అవమానములు

               నన్ను బాధింపజాలవు.

               నేను నా మొగమును

               చెకుముకి రాయివలె గ్టి జేసికొింని.

               నేను నగుబాట్లు తెచ్చుకోనని

               నాకు తెలియును.

8.           నన్ను నీతిమంతునిగా యెంచువాడు

               నా ప్రక్కనేయున్నాడు.

               నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో

               అతడును నేనును కలిసి

               న్యాయస్థానమునకు పోయెదము.

               నా ప్రత్యర్థి తన అభియోగమును

               ఋజువు చేయునుగాక!

9.           ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును.

               నేను దోషినని నిరూపింపగల వాడెవడు?

               నా ప్రత్యర్థులు

               చిమటలు క్టొిన బట్టవలె క్షీణింతురు.

2. జనులు సేవకుని అనుసరింపవలెను

10.         ప్రభువుపట్ల భయభక్తులు చూపుచు

               ఆయన సేవకునిమాట పాించువారలారా!

               మీరు వెలుగుసోకని

               చీకి తావులలో నడవవలసివచ్చినపుడు,

               ప్రభువును నమ్మి ఆయనపై ఆధారపడుడు.

11.           కాని నిప్పునురాజేసి కొరవులను

               మండించువారలారా!

               మీరు మీ నిప్పులోనికే నడతురు.

               మీ కొరవులలోనే అడుగుపెట్టుదురు.

               ప్రభువువలన మీకు ఈ గతి పట్టును.

               మీరు ఘోరబాధలలో చిక్కుకొందురు.