7 1. నేను యిస్రాయేలీయుల వ్యాధిని నయము

               చేసినపుడెల్ల ఎఫ్రాయీము పాపములును,

               సమరియా దోషములును

               బట్టబయలగుచున్నవి.

               ఎందుకన వారుచేయునదంతయు మోసము.

               దొంగలు ఇండ్లలో జొరబడుచున్నారు.

               ముఠాలు వీధులలో దోపిడి చేయుచున్నారు.

2.           ఈ దుష్క్రియలన్నియు

               నేను జ్ఞప్తియందుంచు కొందునని

               వారు గ్రహించుటయేలేదు.

               వారి పాపములు వారి చుట్టును క్రమ్ముకొనినవి.

               అవి నా కింకి కనిపింపకుండ ఉండజాలవు.

రాజ ప్రాసాదమున కుట్ర

3.           ప్రభువు ఇట్లనుచున్నాడు:

               వారి దుష్టత్వముతో తమ రాజునకు

               ఆనందము కలిగించుచున్నారు.

               వారి కల్లలాడుతనముతో

               అధిపతులను సంతోషపెట్టుచున్నారు.

4.           జనులెల్లరును వేడెక్కిన ఒక ఆవమువలె ఉన్నారు.

               రొట్టెలు కాల్చువాడు పిండినిపిసికిన తరువాత

               ముద్దంతయు పొంగువరకు

               ఆ ఆవమును అధికముగ వేడిచేసి

               ఊరకుండునట్లు జనులెల్లరును

               మానని మోహావేశులైయున్నారు.

5.           ఆ ప్రజలు రాజోత్సవదినమున రాజును,

               అధిపతులను తప్పత్రాగించి మత్తులను చేసిరి.

6.           వారు తమ కుట్రలతో      

               పొయ్యివలె మండుచుండిరి.

               రొట్టెలు కాల్చువాడు నిదురించునట్లు,

               రాత్రంతయు మాటునుంచిన వారి ద్వేషము

               మరల వేకువనే తీవ్రముగా

               మండుచున్న అగ్నివలె చెలరేగును.

7.            ఆ జనులు కోపాగ్నితో

               తమ పాలకులను హత్యజేసిరి.

               వారి రాజులెల్లరును హత్యకు గురియైరి.

               కాని వారిలో నన్ను స్మరించుకొనువాడు

               ఒక్కడును లేడు.

అన్యజాతులతో పొత్తు

8.           ప్రభువు ఇట్లనుచున్నాడు:

               యిస్రాయేలీయులు

               ఒక ప్రక్క మాత్రమే కాలిన రొట్టెవింవారు1.

               వారు ఇరుగుపొరుగు జాతులపై

               అధారపడుచున్నారు.

9.           కాని ఈ చెయిదమువలన,

               తమ బలమును కోల్పోవుచున్నారని,

               వారు గ్రహించుటలేదు.

               వారికి కాలము సమీపించినది.

               శిరముపై జుట్టు నెరసినది,

               అయినను ఆ విషయమును

               వారు అర్థము చేసికొనుటలేదు.

10.         యిస్రాయేలీయుల గర్వము

               వారు దోషులని చాిచెప్పుచున్నది.

               ఇంత జరిగినను వారు తమ దేవుడను,

               ప్రభుడనైన నా చెంతకు తిరిగి వచ్చుటలేదు.

11.           ఎఫ్రాయీము తెలివిలేని పాపురమువలె

               అటునిటు ఎగురుచున్నది.

                అది మొదట ఐగుప్తును శరణువేడెను.

               అటుపిమ్మట అస్సిరియా వద్దకు పరుగెత్తెను.

12.          కాని ఎగిరిపోవుపకక్షులను వలపన్ని పట్టుకొనునట్లు

               నేను వారిని పట్టుకొందును.

               వారి దుష్కార్యములకుగాను వారిని దండింతును.

యిస్రాయేలీయుల కృతఘ్నత, వారికి శిక్ష

13.          ప్రజలు నన్ను విడనాడిరిగాన

               నాశనమునకు గురియగుదురు.

               నాకెదురు తిరిగిరి, కనుక చత్తురు.

               నేను వారిని రక్షింపగోరుచున్నాను.

               గాని వారి ఆరాధనలో చిత్తశుద్ధిలేదు.

14.          ఆ జనులు నాకు హృదయపూర్వకముగా

               ప్రార్థన చేయుటలేదు.

               కాని క్రిందబడి విలాపములు

               మాత్రము చేయుచున్నారు.

               ద్రాక్షాసారాయము కొరకు

               ధాన్యము కొరకు మొరపెట్టునపుడు

               శరీరమును గాయపరచు కొనుచున్నారు.

               వారు నిజముగా తిరుగుబాటుదారులు.

15.          వారిని పైకి తీసికొనివచ్చినది నేను.

               బలాఢ్యులను చేసినది నేను.

               అయినను వారు నాపైనే కుట్రపన్నిరి.   

16.          ఆ ప్రజలు మరలుదురుగాని,

               సర్వోన్నతుని వైపు మరలరు.

               వారు మోసకరమైన వింవలె నమ్మదగనివారు.

               వారి నాయకులు గర్వోక్తులు పలుకుచున్నారు

               కావున కత్తివాత పడుదురు.

               ఐగుప్తీయులు వారిని చూచి నవ్వుదురు.

Previous                                                                                                                                                                                                    Next