రోగి ప్రార్థన

ప్రధానగాయకునికి దావీదు కీర్తన

41 1.       పేదల నాదరించువాడు ధన్యుడు.

                              అతనికి ఆపదవాిల్లినపుడు,

                              ప్రభువు వానిని ఆదుకొనును.

2.           ప్రభువతనిని కాపాడి

               అతని ప్రాణమును సంరక్షించును.

               అతడు తన దేశమున సుఖశాంతులతో

               అలరారునట్లు చేయును.

               అతడు తన విరోధుల చేతికి

               చిక్కకుండునట్లు చేయును.

3.           అతడు రోగగ్రస్తుడై మంచము

               ప్టినప్పుడు ప్రభువు అతనికి సాయము

               చేసి ఆరోగ్యమును ప్రసాదించును.

4.           ”ప్రభూ! నేను నీకు

               ద్రోహముగా పాపము చేసితిని.

               నీవు నన్ను కరుణించి, నా వ్యాధి నయము

               చేయుము” అని నేను పలికితిని.

5.           నా విరోధులు నన్ను గూర్చి చెడ్డగా

               మ్లాడుచున్నారు.

               ”అతడెప్పుడు చనిపోవును,

               అతడి పేరెప్పుడు మాసిపోవును”

               అని కాచుకొని యున్నారు.

6.           నన్ను సందర్శింప వచ్చువారు

               నా ముందు ముఖస్తుతి చేయుచున్నారు.

               వారు నన్ను గూర్చి చెడు సమాచారము

               సేకరించుకొనిపోయి వెలుపల

               అందరితోను చెప్పుచున్నారు.

7.            నేననిన గిట్టని వారు తమలో తాము

               గుసగుసలాడుకొనుచు

               నాకు మహాదుర్గతి ప్టినదని ఎంచుచున్నారు.

8.           ”ఇతనికి మాయదారి రోగము పట్టుకొనినది.

               ఇక మంచముమీది నుండి లేవడు”

               అని చెప్పుకొనుచున్నారు.

9.           నేను బాగుగా నమ్మిన ప్రాణస్నేహితుడే,

               నా ఇంట భోజనము చేసినవాడే

               నా మీద తిరుగబడెను.

10.         ప్రభూ! నీవు నన్ను కరుణించి

               నా వ్యాధిని కుదుర్చుము.

               అప్పుడు నేను నా విరోధులకు బుద్ధి చెప్పుదును.

11.           నా శత్రువులు నన్ను అణగ ద్రొక్కకుండుటను

               బ్టి నాపట్ల నీకు ప్రీతి కలదని గ్రహింతును.

12.          నేను ధర్మమును పాింతును

               గనుక నీవు నన్నాదుకొందువు.

               నన్ను కలకాలము నీ సన్నిధిలో నిలుపుకొందువు.

13.          అనాది కాలము నుండి అనంతము

               వరకును యిస్రాయేలు దేవుడైన

               ప్రభువునకు స్తుతి కలుగునుగాక!

               ఆమెన్‌, ఆమెన్‌.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము