15 1.       దైవభీతి గలవాడు ఇి్ట పనిచేయును.

                              ధర్మశాస్త్ర పారంగతుడైనవాడు

                              విజ్ఞానమును పొందును.

2.           విజ్ఞానము తల్లివలెను,

               ఎలప్రాయపు వధువువలెను వచ్చి

               అతడిని ఆహ్వానించును.

3.           అది అతనికి తెలివి అను అన్నము పెట్టును.

               వివేకమను పానీయము నొసగును.

4.           అతడు ఊతకఱ్ఱ మీదవలె దానిమీద వాలి

               క్రింద పడిపోవుట అను అవమానమునుండి

               తప్పించుకొనును.

5.           అది అతనికి  అనన్యసాధ్యమైన

               ఖ్యాతిని అర్జించిపెట్టును.

               సభలో మ్లాడుటకు వాగ్ధాిని అనుగ్రహించును

6.           అతనికి సుఖసంతోషములు సిద్ధించును.

               అతని పేరు కలకాలము నిలుచును.

7.            కాని మూర్ఖులు విజ్ఞానమును బడయజాలరు.

               పాపాత్ముల కింకది కన్పింపనుగూడ

               కన్పింపదు.        

8. గర్వాత్ములకది దూరముగా ఉండును.

               అసత్యవాదుల మనసులోనికది ప్రవేశింపదు.

9.           పాపాత్ముడు దేవుని కీర్తింపజాలడు.

               ప్రభువు అతడికి ఆ బుద్ధి దయచేయడు.

10. దైవ సంకీర్తనమును విజ్ఞానము వలననే

               పలుకవలెను.

               ప్రభువే ఆ సంకీర్తనమును ప్రేరేపించును.

నరుడు స్వేచ్ఛాపరుడు

11.           నేను పాపము చేయుటకు

               దేవుడే కారణమని చెప్పకుము.

               తాను అసహ్యించుకొను దానిని

               దేవుడెట్లు చేయించును?

12.          దేవుడు నన్ను పెడత్రోవ ప్టించెనని అనకుము.

               ఆయన పాపాత్ములను తన పనికి వాడుకొనడు.      

13.          ప్రభువు దౌష్ట్యమును పూర్తిగా

               అసహ్యించు కొనును.

               దైవభీతికల నరుడు చెడ్డను అంగీకరింపడు.

14.          దేవుడు ఆదిలో నరుని చేసినపుడు అతనికి తన నిర్ణయములను తాను చేసికొను స్వేచ్ఛనొసగెను.

15.          నీవు కోరుకొందువేని 

               ప్రభుని ఆజ్ఞలు పాింపవచ్చును.

               అతనిని అనుసరింపవలెనో  లేదో

               నిర్ణయించునది నీవే.

16.          ప్రభువు నిప్పును, నీళ్ళనుగూడ నీ ముందుంచెను

               చేయిచాచి వానిలో నీకిష్టము వచ్చినది తీసికొనుము

17.          మృత్యువు జీవముకూడ

               నరుని ముందటనున్నది.

               అతడు తాను కోరుకొనినది తీసికోవచ్చును.

18.          ప్రభువు విజ్ఞానము అనంతమైనది.

               ఆయన మహాశక్తిమంతుడు,

               సర్వమును పరిశీలించువాడు.

19.          ఆయన నరులు చేయు ప్రతికార్యమును

               గమనించును.

               తనపట్ల భయభక్తులు చూపువారిని కాపాడును.

20.        ప్రభువు ఏ నరుని పాపముచేయుమని

               ఆజ్ఞాపింపడు,

               ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతినీయడు.