3 1. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు:  నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అపుడు మీరెదురుచూచుచున్న ప్రభువు దిఢీలున దేవళ మునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శ్రీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చు చున్నాడు.

2. కాని అతడు వేంచేయు దినమును భరింపగల వాడెవడు? అతనియెదుట నిలబడగలవాడెవడు? అతడు చాకలివాని సబ్బువిం వాడు. లోహములను శుద్ధిచేయు కంసాలి అగ్నివింవాడు.

3. అతడు వెండిని పుటమువేసి శుద్ధిచేయువానివలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండిబంగారములను పుటము వేసినట్లే ప్రభువుదూత యాజకులను శుద్ధిచేయును. అందువలన వారతనికి యోగ్యమైనబలిని అర్పింతురు.

4. అప్పుడు యూదా, యేరూషలేమువాసులు ప్రభువు నకు అర్పించుబలులు పూర్వకాలమునందువలె అతడికి ప్రీతిపాత్రములగును.

5. సైన్యములకధిపతియైన ప్రభువిట్లనుచున్నాడు: ”నేను తీర్పుచెప్పుటకుగాను మీ చెంతకురాగా, మాంత్రి కులమీదను, వ్యభిచారులమీదను, కూటసాక్ష్యము పలుకువారిమీదను, నాకు భయపడక వారి కూలి వారికి జీతము చెల్లింపనివారిమీదను, విధవలను అనాధ శిశువులను పరదేశులను పీడించువారిమీదను, నన్ను గౌరవింపనివారి మీదను బలమైన సాక్ష్య మిచ్చుదును.

పదియవ వంతు చెల్లించుట

6. ప్రభుడనైన నేను మార్పులేనివాడను. కనుకనే యాకోబు వంశజులైన మీరు ఇంకను పూర్తిగా నాశ నము కాలేదు.

7. మీ పితరులవలె మీరు నా ఆజ్ఞల నుండి వైదొలిగి వానిని పాింపరైతిరి. మీరు నా వైపు మరలుడు, నేను మీతట్టు తిరుగుదును. కాని ‘నీవైపు మరలవలెనన్న మేమేమి చేయవలయును’ అని మీరడుగుచున్నారు.

8. ‘దేవుని మోసగించుట తగునా?’ అని నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను. అయినను మీరు నన్ను దోచుకొనుచున్నారు. ‘మేము నిన్నెట్లు మోసగించితిమి’ అని మీరడుగుచున్నారు. పదియవవంతు మరియు కానుకలను చెల్లించు విషయమున, 9. మీ ప్రజలందరు నన్ను దోచుకొను చున్నారు. కావున మీరు శాపముపాలగుదురు.

10. మీరు మీ పదియవ పాలును సంపూర్తిగా దేవళ మునకు కొనిరండు. అపుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను  పరీక్షించి చూడ వచ్చును. నేను ఆకాశ ద్వారములు విప్పి ఆశీర్వాద ములెల్ల మీపై సమృద్ధిగా కురియింతునో  లేదో మీరే చూడవచ్చును.

11. నేను పురుగులు మీ పైరులు తిని వేయకుండునట్లును, మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించు నట్లును చేయుదును. 12. అప్పుడు మీ భూమి ఆనంద దాయకమైనదగును. గనుక సమస్త జాతిప్రజలు మీరు ధన్యులని పలుకుదురు.

నీతిమంతులు విజయమును బడయుట

13. మీరు నన్ను గూర్చి ఘోరమైన సంగతులు చెప్పితిరని ప్రభువు పలుకుచున్నాడు. కాని ‘మేము నిన్నుగూర్చేమి చెప్పితిమి’ అని మీరడుగుచున్నారు.

14. మీరు ఇట్లింరి: ”ప్రభువును సేవించుట నిష్ప్ర యోజనము. ఆయన ఆజ్ఞలను పాించుటవలన లాభమేమి? మేము చేసిన కార్యములకుగాను సైన్య ములకధిపతియైన ప్రభువు ఎదుట పశ్చాత్తాపపడుట వలన ప్రయోజనమేమి?

15. మాకు కన్పించున దేమనగా, గర్వాత్ములే సంతోషముగానున్నారు. దుర్మా ర్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారు. వారు దేవుని సహ నమును పరీక్షకు గురిచేసియు, తప్పించుకొని తిరుగు తున్నారు.”

16. అపుడు ప్రభువునకు భయపడువారు తమలో తాము మాటలాడుకొనిరి. అతడు వారి పలుకులు వినెను. ప్రభువునందు భయభక్తులుగలవారి పేర్లు ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్ధముగా గ్రంథమున వ్రాయబడెను.

17. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు: ”వారు నా ప్రజలగుదురు. నియ మింపబడిన దినమున వారునావారై నాకు ప్రత్యేకమైన ఆస్తిగానుందురు. తండ్రి తనకు ఊడిగముచేయు కుమారునిపట్ల దయజూపినట్లే, నేనును వారిపట్ల దయజూపుదును.

18. అప్పుడు దుర్మార్గులకును సజ్జ నులకును ఏమేమిజరుగునో, నన్ను సేవించువారికిని సేవింపనివారికిని ఏమేమిజరుగునో నా ప్రజలు కన్ను లారాచూతురు.”

Previous                                                                                                                                                                                                    Next